Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

  ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Jun 2024 13:06 IST

1. ‘గేమ్‌ ఛేంజర్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన శంకర్‌.. ఎన్ని రోజులు షూటింగ్‌ ఉందంటే!

రామ్‌చరణ్ - శంకర్‌ల (Shankar) కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రం నుంచి అప్‌డేట్‌ వచ్చి చాలా రోజులవుతోంది. తాజాగా దర్శకుడు శంకర్‌ దీనిపై అప్‌డేట్‌ ఇచ్చారు. ‘ఇండియన్‌ 2’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో ‘గేమ్ ఛేంజర్‌’ గురించి మాట్లాడారు. పూర్తి కథనం

2. ప్రభాస్‌ ‘కల్కి’ రిలీజ్‌.. ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద ఫ్యాన్స్‌ సందడి

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద సందడి నెలకొంది. సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూర్తి కథనం

3. వినుకొండలో చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి

పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.  పూర్తి కథనం

4. ఇది సమష్టి విజయం.. ఫైనల్‌ కోసం భయం లేదు: మార్‌క్రమ్‌

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా (South Africa) ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి అఫ్గానిస్థాన్‌ను (Afghanistan) చిత్తుచిత్తుగా ఓడించింది. 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్‌ కోల్పోయి ఛేదించింది.   పూర్తి కథనం

5. మన్యం జిల్లాలో ఆగని ఏనుగుల మృత్యుఘోష

విద్యుదాఘాతానికి గురై కొన్ని.. అనారోగ్యంతో మరికొన్ని.. ఆహారం దొరక్క ఇంకొన్ని.. ఇలా కారణం ఏదైనా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఏనుగుల సంరక్షణపై కేంద్రం ప్రతిపాదనలు ఆచరణలోకి రాకపోవడంపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పూర్తి కథనం

6. అందరి దృష్టీ రెండో సెమీఫైనల్‌పైనే .. వాతావరణం లేటెస్ట్‌ అప్‌డేట్‌

టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup 2024) సెమీఫైనల్‌-1లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా (SouthAfrica) ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ ఇవాళ రాత్రి 8 గంటలకు (భారత్‌ కాలమానం ప్రకారం) భారత్‌-ఇంగ్లాండ్‌ల మధ్య జరిగే సెమీఫైనల్‌-2పైనే ఉంది. పూర్తి కథనం

7. కేరళలో భారీ వర్షం.. ఇళ్లల్లోకి దూసుకొచ్చిన సముద్రం

కేరళలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి సముద్రం ముందుకు వచ్చింది. అలల తాకిడికి తీర ప్రాంతాల్లోని పలు నివాసాలు నీట మునిగాయి.

 పూర్తి కథనం

8. ఇండియా సిమెంట్స్‌లో అల్ట్రాటెక్‌కు 23% వాటా.. ఒప్పంద విలువ ₹1,885 కోట్లు

భారత సిమెంట్‌ తయారీ పరిశ్రమలో మరో కీలక ఒప్పందం ఖరారైంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌లో (India Cements Ltd) 23 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ (UltraTech Cement) గురువారం ప్రకటించింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.1,885 కోట్లని వెల్లడించింది. పూర్తి కథనం

9. విరాట్‌ - రోహిత్‌లకు ముప్పు పొంచి ఉందిలా..!

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు వారు వెన్నెముక. వారిలో ఒక్కరు చెలరేగినా ప్రత్యర్థి జట్లు గెలుపుపై ఆశలు వదలుకోవాల్సిందే. ఏ బౌలర్‌పైన అయినా గురిపెట్టారో అతడు కెరీర్‌ చరమాంకానికి చేరాల్సిందే. వారే రోహిత్‌ - విరాట్‌ (Virat & Rohit). వీరిద్దరూ పొట్టి ప్రపంచకప్‌ (ICC Mens T20 World Cup) టీమ్‌ ఇండియా ఓపెనర్లుగా వస్తున్నారు.  పూర్తి కథనం

10. పాక్‌ ఎన్నికలపై దర్యాప్తునకు అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం

పాకిస్థాన్‌లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలపై (Pak Elections) సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. దీన్ని రెండు ప్రధాన పార్టీలు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించాయి. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని