Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 28 Jun 2024 13:02 IST

1. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్‌

ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్‌ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. పూర్తి కథనం

2. నేడు పోలవరంపై శ్వేతపత్రం.. విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరంపై ఏపీ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఏడు ప్రభుత్వశాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పోలవరంపై సీఎం చంద్రబాబు (Chandrababu) శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను వెల్లడించనున్నారు. పూర్తి కథనం

3. ఓటీటీలోకి కాజల్‌ ‘సత్యభామ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

కాజల్‌ అగర్వాల్‌ (kajal aggarwal) పోలీసు ఆఫీసర్‌గా నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama). సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి మెప్పించింది. ఇప్పుడీ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.  పూర్తి కథనం

4. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. భారత ఓపెనర్లు అదుర్స్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక తొలి టెస్టు మ్యాచ్‌లో భారత (IND w Vs SA w) అమ్మాయిలు శుభారంభం చేశారు. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ జట్టు తొలి రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి వికెట్ నష్టపోకుండా 130 పరుగులు చేసింది.  పూర్తి కథనం

5. రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్‌గా రికార్డు

టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే సారథిగా 5000+ పరుగులు చేసిన అతడు.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. పూర్తి కథనం

6. ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. నిఫ్టీ @ 24,120

అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రెండు ప్రధాన సూచీలు ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలను తాకాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 253 పాయింట్ల లాభంతో 79,496 వద్ద ట్రేడవుతోంది.  పూర్తి కథనం

7. ‘నీట్‌’పై చర్చకు విపక్షాల పట్టు.. లోక్‌సభ సోమవారానికి వాయిదా

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘నీట్‌ పేపర్‌ లీక్ (NEET Paper Leak)’ వ్యవహారం దుమారం రేపుతోంది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్‌ చేయడంతో లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభల్లో శుక్రవారం గందరగోళ వాతావరణం నెలకొంది. పూర్తి కథనం

8. దిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..!

దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు (Delhi rainfall) కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. గత 24 గంటల్లో సఫ్దార్‌జంగ్‌లో 228.1 మిల్లీమీటర్ల వాన పడింది. నిన్న రాత్రి కేవలం 3 గంటల వ్యవధిలో 148.5 మి.మీ. కురిసింది.  పూర్తి కథనం

9. భూ కుంభకోణం కేసు.. మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఝార్ఖండ్‌ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren)కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం బెయిల్‌ (Bail) మంజూరుచేసింది.  పూర్తి కథనం

10. స్త్రీ, పురుషులిద్దరూ సమానమే కానీ.. : లింగ సమానత్వంపై సుధామూర్తి ఏమన్నారంటే..?

ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, వితరణశీలిగా పేరుగాంచిన సుధామూర్తి (Sudha Murty) లింగ సమానత్వంపై తన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్) ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని