Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 31 May 2023 20:57 IST

1. రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన: కిషన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ గోల్కొండ కోటలో జూన్ 2, 3 తేదీల్లో కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రెండ్రోజుల కార్యక్రమాల వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జమ్మూకశ్మీర్‌లో జూన్‌ 8న శ్రీవారి ఆలయ సంప్రోక్షణ: తితిదే

జమ్మూకశ్మీర్‌లో జూన్‌ 8వ తేదీన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ సంప్రోక్షణ ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది. జూన్‌ 3న శ్రీవారి ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపింది. జమ్మూకశ్మీర్‌లో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తితిదే నిర్మించిన విషయం తెలిసిందే. వైఖానస ఆగమోక్తంగా, సర్వాంగ సుందరంగా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్‌

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్‌ అయ్యారు. భవిష్యత్‌లో నిర్వహించే పరీక్షలు రాయకుండా వీరిని డిబార్‌ చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. సిట్‌ ఇప్పటివరకు అరెస్ట్‌ చేసిన 37 మందిని మంగళవారం డిబార్‌ చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 50 మంది డిబార్‌ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శిందే వర్గం నుంచి కొందరు టచ్‌లో ఉన్నారు: రౌత్‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేనకు చెందిన పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఉద్ధవ్‌ వర్గానికి చెందిన నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) అన్నారు. ఆ పేర్లను ఇప్పుడే బయటపెట్టాలని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. భాజపా వైఖరి పట్ల 22 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీలు అసంతృప్తితో ఉన్నారంటూ ఉద్ధవ్‌ పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’లో కథనం వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చార్‌ధామ్‌ యాత్రకు పోటెత్తిన భక్తులు.. ఉత్తరాఖండ్‌ పోలీసుల కీలక సూచన

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు ఈసారి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో మంచు కొండల్లో ప్రయాణానికి కొంత అసౌకర్యం కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తులకు ఉత్తరాఖండ్‌ పోలీసులు కీలక సూచన చేశారు. సామర్థ్యం కంటే అనేక రెట్లు ఎక్కువగా చార్‌ ధామ్‌ దర్శనానికి భక్తులు వస్తున్నారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మసీదు కమిటీ పిటిషన్‌ కొట్టివేసిన అలహాబాద్‌ హైకోర్టు

జ్ఞానవాపి మసీదు కేసులకు సంబంధించిన ఓ అంశంలో కమిటీకి చుక్కెదురయ్యింది. శృంగార గౌరీ ఆలయంలో నిత్యం పూజలు చేసుకోవడంపై కొందరు హిందూ మహిళలు స్థానిక కోర్టులో వేసిన పిటిషన్‌ను రద్దు చేయాలని ముస్లిం వర్గం వేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించింది. వారణాసి జిల్లా కోర్టులో వారు వేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అవును.. నేను బైసెక్సువల్‌ను: అందాల భామ సంచలన ప్రకటన

ఈ ఏడాది విశ్వ సుందరి పోటీలకు ఫిలిప్పీన్స్‌ (Miss Universe Philippines) తరఫున పోటీ పడుతున్న అందాల భామ (మిస్‌ యూనివర్స్‌ ఫిలిప్పీన్స్‌) మిషెల్లీ మార్కెజ్‌ డీ (Michelle Marquez Dee) సంచలన ప్రకటన చేశారు. తన లైంగికత్వంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ.. తాను బైసెక్సువల్‌ (bisexual) అని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. త్వరలో ఆస్పత్రిలో చేరనున్న ఎంఎస్ ధోనీ.. కారణం ఏంటంటే?

మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) 41 ఏళ్ల వయసులోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)ను విజయవంతంగా ముందుండి నడిపించాడు. తన వ్యూహాలతో మేటి జట్లను సైతం మట్టికరిపించి సీఎస్కేకు ఐదో టైటిల్‌ను అందించాడు. మోకాలి గాయంతో బాధపడుతున్నా అన్ని మ్యాచ్‌ల్లో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడంతోపాటు జట్టుకు అవసరమైన సందర్భాల్లో బ్యాటింగ్‌కు దిగాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

9. పేదలను మోసగించడమే కాంగ్రెస్‌ వ్యూహం: ప్రధాని మోదీ

పేదరిక నిర్మూలన నినాదం దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ చెబుతోన్న అతిపెద్ద అబద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. భాజపా (BJP) కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ నెలరోజుల పాటు భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ₹కోట్లు పెట్టి కొన్నా.. కొట్టింది కొందరే..

దాదాపు రెండు నెలలపాటు జరిగిన ఐపీఎల్‌(IPL 2023) క్రికెట్‌ అభిమానులను ఎంతగానో అలరించింది. విజేతగా చెన్నై(Chennai Super Kings) ఐదోసారి నిలిచి.. ముంబయి రికార్డును సమం చేసింది. ఇక ఈ సీజన్‌లో రింకుసింగ్‌, యశస్వి జైస్వాల్‌ లాంటి ఆటగాళ్లు ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి అద్భుత ప్రదర్శన చేయగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న మరికొందరు నిరాశ పరిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు