Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 01 Jun 2023 16:59 IST

1. భాజపా, కాంగ్రెస్‌ తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలి: మంత్రి కేటీఆర్‌ 

రాష్ట్రంలో భారాస తిరిగి అధికారంలోకి వస్తుందని.. 90 నుంచి 100 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. భాజపా, కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరవు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్టు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌లు వెల్లడించారు. జులై 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కిషన్‌రెడ్డి చొరవ.. తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌

తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో ఏపీ, తెలంగాణల్లో రెండు సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు లేఖ రాసింది. విశాఖపట్నం-విజయవాడ-శంషాబాద్‌, విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు మార్గాల్లో ఈ సర్వే జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భాజపా అధిష్ఠానంతో పవన్‌ చర్చలు జరిపారు: సుజనా చౌదరి

ఈ తొమ్మిదేళ్లలో నవభారత్‌ ఆవిష్కృతమైందని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి మోదీ పాలనపై కరపత్రాలను విజయవాడలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టంలోని అనేక అంశాలను మోదీ అమలు చేశారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘వెంటనే ఆయుధాలు అప్పగించండి.. లేదో’: అమిత్‌ షా గట్టి వార్నింగ్‌

కొన్నిరోజులుగా మండిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శాంతిని నెలకొల్పేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మణిపుర్‌లో చెలరేగిన ఘర్షణలను హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రూ.2వేల నోట్ల మార్పిడిపై పిటిషన్‌.. అత్యవసర విచారణకు సుప్రీం ‘నో’!

రూ.2వేల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ.. వీటిని మార్పిడి చేసుకునేందుకు సెప్టెంబర్‌ చివరి వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోట్లను ఎటువంటి ఐడీ ప్రూఫ్‌, దరఖాస్తు లేకుండా మార్పిడి చేసుకోవచ్చంటూ బ్యాంకులు ఇచ్చిన నోటిఫికేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు అయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘మా పోలీసులు చూసుకోగలరు’: జెడ్‌ ప్లస్ భద్రత వద్దన్న సీఎం

తన భద్రత విషయంలో కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆఫర్‌ను  పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌(Punjab CM Bhagwant Mann) తిరస్కరించారు. తనకు కేంద్రం ప్రకటించిన జెడ్‌ ప్లస్ సెక్యూరిటీ(Z Plus Security)ని వద్దనుకున్నారు. తనకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం ఉందని వెల్లడించారు. పంజాబ్, దిల్లీలో వారు తనకు రక్షణగా ఉంటారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కుప్పకూలిన వాయుసేన శిక్షణ విమానం..!

భారత వాయుసేనకు (IAF) చెందిన ఓ శిక్షణ విమానం (Kiran Aircraft)  ప్రమాదానికి గురైంది. కర్ణాటక (Karnataka)లోని చామరాజనగర్‌ (Chamrajnagar) సమీపంలో అది కుప్పకూలింది. అయితే, ఈ ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అందులో ఒక మహిళా పైలట్‌ ఉన్నారు. వాయుసేన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వన్‌ప్లస్‌ ఇండియాకు సీఈఓ నవనీత్‌ నక్రా గుడ్‌బై

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్ ఇండియాకు (Oneplus India) ఆ కంపెనీ సీఈఓ నవనీత్‌ నక్రా (Navnit Nakra) రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఆయన రాజీనామాను వన్‌ప్లస్‌ ధ్రువీకరించింది. తన అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవాలని అనుకుంటున్నానని, కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితం గడపాలనుకుంటున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం.. ముగ్గురి మృతి

మాస్కోపై డ్రోన్‌ దాడులు జరిగిన మర్నాడే రష్యా(Russia) తీవ్రంగా స్పందించింది. కీవ్‌(Kyiv)పై గురువారం ఉదయం భారీ ఎత్తున క్షిపణి దాడులను చేసింది. దాదాపు 10కి పైగా క్షిపణులను నేటి తెల్లవారుజామున ప్రయోగించింది. ఈ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు.  మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత నెల కీవ్‌పై రష్యా 17 దాడులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు