Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 01 Sep 2022 17:08 IST

1. ఎన్డీయేలో చేరికపై వారే జవాబు చెప్పాలి: చంద్రబాబు

ఎన్డీయేలో చేరతారన్న ప్రచారంపై స్పందించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నిరాకరించారు. ఆ ప్రచారం చేసేవారే దానికి జవాబు చెప్పాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల కోసమే గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామని స్పష్టం చేశారు. పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండుసార్లు నష్టపోయిందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ‘ఎన్డీయేలోకి తెదేపా’ ప్రచారం.. లక్ష్మణ్‌ ఏమన్నారంటే?

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీయేలోకి తెదేపా వస్తోందన్న ప్రచారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా లక్ష్మణ్‌ స్పందించారు. అది కేవలం ప్రచారమేనని చెప్పారు. అలాంటిది ఏమైనా ఉంటే చెప్తామని వ్యాఖ్యానించారు.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Video: ఏకకాలంలో వినాయక ప్రార్థనలు చేసిన 31 వేల మంది మహిళలు

3. హైదరాబాద్‌లో ‘డార్క్‌ వెబ్‌’ మత్తు దందా.. ముఠా అరెస్ట్‌

నగరంలో మరో మత్తు దందా గుట్టు రట్టయింది. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హుమయూన్‌ నగర్‌లో డ్రగ్స్‌ అమ్మేందుకు యత్నించిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.9లక్షల విలువైన సరకును నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ‘డార్క్‌ వెబ్‌’ ద్వారా మత్తు దందా చేస్తున్నారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. అమిత్ షాను ఎన్టీఆర్ కలవాల్సిన అవసరమేంటి?: నారాయణ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ సీఎం నీతీశ్‌ కుమార్‌ను కలవడం మంచి పరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఏపీ సీఎం జగన్‌ను కూడా భాజపా వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సినీ నటులను భాజపా ప్రసన్నం చేసుకుంటోందని.. వారి ద్వారా తెరాసను బలహీన పరచాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. విరాట్ - సూర్యకుమార్‌.. ఇప్పుడిలా.. అప్పుడలా!

అది 2020 అక్టోబర్‌ 28.. భారత టీ20 లీగ్‌లో మరుపురాని రోజు.. మైదానంలో దూకుడుగా ఉండే పరుగుల రారాజుకి సవాల్‌ విసిరేలా ఓ యువ బ్యాటర్‌ ఆడిన తీరు అప్పట్లో వైరల్‌గా మారింది. వారిద్దరి మధ్య నాటకీయ సన్నివేశాలు చోటుచేసుకొన్నాయి. ఇంతకీ మ్యాచ్‌ను ఎగరేసుకుపోయిన ఆ బ్యాటర్‌ ఎవరో కాదు.. తాజాగా హాంకాంగ్‌పై విరుచుకుపడిన సూర్యకుమార్‌ యాదవ్. ఇక పరుగుల రారాజు విరాట్ కోహ్లీ అని తెలుసు కదా.. ఇప్పుడు మరోసారి ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. సిసోదియాపై దాడులు.. గుజరాత్‌లో ఆప్‌ ఓటు షేర్‌ పెరిగింది..!

దేశ రాజధాని దిల్లీలో భాజపా - ఆప్‌ మధ్య రాజకీయ విభేదాలు ముదిరిన వేళ సొంత ప్రభుత్వంపై తీసుకొచ్చిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నెగ్గారు. ఆప్‌ ఎమ్మెల్యేలంతా సీఎంకు అనుకూలంగా ఓటేశారు. దీంతో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ భాజపాపై విమర్శల వర్షం కురిపించారు. దిల్లీలో ఆపరేషన్‌ కమల్‌ విఫలమైందని రుజువైందని అన్నారు. సీబీఐ దాడులతో కేంద్రం తమను భయపెట్టాలని చూసిందని, కానీ అది వారికే హాని చేసిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ట్విన్‌ టవర్స్‌ పరిస్థితి రావొద్దంటే.. ఇల్లు కొనే ముందు ఇవన్నీ చూసుకోండి!

ఇటీవల నోయిడాలో జంట భవనాల కూల్చివేతను యావత్తు దేశం ఆసక్తిగా తిలకించింది. భారీ ఖర్చుతో నిర్మించినప్పటికీ.. వీటిని కూల్చివేయాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయక తప్పలేదు. నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్న బలమైన సందేశాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రజల్లోకి తీసుకెళ్లింది. అందుకే ఎవరైనా ఇల్లు లేదా ఏదైనా ఆస్తి కొనేముందు అనుమతుల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన కళ్లకు కట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. సెప్టెంబరులో కీలక మార్పులు.. వారికిదే చివరి అవకాశం

మన రోజువారీ ఆర్థిక విషయాలను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు వచ్చే మార్పుల్ని తెలుసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా రుసుముల పెంపు, కొత్త ఛార్జీలు, ఏవైనా సేవలకు గడువు తీరిపోనుండడం వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మరి సెప్టెంబరులో వస్తున్న కీలక ఆర్థికపరమైన మార్పులేంటో చూద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. పోర్చుగల్‌లో భారతీయ గర్భిణీ మృతి.. దేశ ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా

పోర్చుగల్‌లో (Portugal) భారతీయ కుటుంబానికి విషాద ఘటన ఎదురయ్యింది. గర్భిణిగా ఉన్న భారత మహిళకు సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోర్చుగల్‌ ప్రభుత్వం.. పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అంతేకాకుండా ఈ దారుణ ఘటనకు అక్కడ వైద్య సదుపాయాల కొరతే కారణమని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మార్టా టెమిడో (Marta Temido) రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. సంక్షోభం దిశగా ఝార్ఖండ్‌ ప్రభుత్వం.. నేడు సోరెన్‌ రాజీనామా?

ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చనే ప్రచారం జోరందుకొంది. రాజీనామా అనంతరం గవర్నర్‌తో భేటీ అయి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని ఆయన కోరవచ్చు. ఈ విషయమై నేడు సాయంత్రం సంకీర్ణ ప్రభుత్వ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం వీరు గవర్నర్‌ను కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని