Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Apr 2023 17:08 IST

1. సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం

రాష్ట్రంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపై పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో 10 మందితో కూడిన కమిటీ ఏర్పాటైందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. డిగ్రీ లేని వ్యక్తికి దేశంలోనే పెద్ద ఉద్యోగం: ఎమ్మెల్సీ కవిత

దేశంలో నిరుద్యోగ రేటు 7.8శాతంగా ఉందని భారాస ఎమ్మెల్సీ కవిత అన్నారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. మోస పూరిత హామీతో దేశ యువతను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దగా చేసిందని విమర్శించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా భాజపా, ప్రధాని మోదీపై ఆమె విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అప్పుడు వాళ్లను వీర బాదుడు బాదుతాను అన్నాను.. కానీ : సెహ్వాగ్‌

ప్రపంచంలో ఎక్కడా లేని క్రేజ్‌ మన ఐపీఎల్‌(IPL)కే ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ ప్లేయర్లు ఇందులో ఆడేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ప్రతీ సీజన్‌కు ఎంతో ఆదరణను పెంచుకుంటూ వస్తోన్న ఈ టోర్నీ.. టీమ్‌ఇండియా(TeamIndia)లోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనూ ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. అయితే.. ఈ టోర్నీ ప్రారంభమైనప్పుడు ఇంత ఆదరణ వస్తుందని ఎవరూ ఊహించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అంబానీ కోడలు రాధిక హ్యాండ్‌ బ్యాగ్‌ ధర రూ.అర కోటి!

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్‌ ‘నీతా ముకేశ్‌ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC)’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు రాజకీయ, సినిమా, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ వేడుకలో అనంత్‌ అంబానీ, ఆయనకు కాబోయే భార్య రాధిక మర్చంట్‌ (Radhika Merchant) జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘రాహుల్‌ గాంధీ పది జన్మలెత్తినా.. సావర్కర్‌ కాలేరు’

ఇటీవల అనర్హత వేటు అనంతరం కాంగ్రెస్‌(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడుతూ.. ‘నా పేరు సావర్కర్‌ కాదు. క్షమాపణలు చెప్పను’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Anurag Thakur) మండిపడ్డారు. రాహుల్‌ పది జన్మలెత్తినా సావర్కర్‌(Savarkar)లా మారలేరని పేర్కొన్నారు. దిల్లీ(Delhi)లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఠాకూర్‌ మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గూగుల్‌ ఉద్యోగులకు స్నాక్స్‌ బంద్‌.. ఇతర ప్రోత్సాహకాలూ కట్‌!

ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో గూగుల్‌ (Google) ఎప్పుడూ ముందుంటుంది. అయితే, ఇప్పుడు అవన్నీ కంపెనీకి భారంగా మారాయి. ఇకపై ఉద్యోగులకు ఇచ్చే చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్‌, కంపెనీ మధ్యాహ్న భోజనాల వంటి వాటిని ఆపేయాలని గూగుల్‌ నిర్ణయించింది. వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కంపెనీ ‘ప్రధాన ఆర్థిక అధికారి (CFO)’ రుత్‌ పోరట్‌ ఉద్యోగులకు లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సుపారీ ఇచ్చినవారి పేర్లు చెప్పండి..! ప్రధాని మోదీకి కపిల్‌ సిబల్‌ విజ్ఞప్తి

భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని లండన్‌లో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇటీవల వ్యాఖ్యానించడం దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అనంతరం ఓ క్రిమినల్‌ పరువు నష్టం కేసులో రాహుల్‌ దోషిగా తేలడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడింది. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని బ్రిటన్‌, జర్మనీ ప్రకటించిన నేపథ్యంలోనే ‘తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నేను అందంగా లేనని ట్రోల్స్‌ చేశారు : ఉపాసన

పెళ్లైన కొత్తలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నట్లు నటుడు రామ్‌చరణ్‌ (Ramcharan) సతీమణి ఉపాసన (Upasana) చెప్పారు. శరీరాకృతిపరంగా తనపై పలువురు నెగెటివ్‌ కామెంట్స్‌ చేశారని అన్నారు. ట్రోల్స్‌ ఎదురైనప్పటికీ తాను ఏమాత్రం కుంగుబాటుకు గురికాలేదని.. ప్రస్తుతం తానొక ఛాంపియన్‌గా ఫీలవుతున్నానని తెలిపారు. తాజాగా ముంబయిలో ఓ మీడియాతో మాట్లాడిన ఉప్సీ.. చరణ్‌తో తన రిలేషన్‌ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. లాక్‌ చాట్‌.. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌!

యూజర్ల ప్రైవసీని మరింత పెంచేలా ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌పై వర్క్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాబీటా వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. లాక్‌ చాట్‌ (Lock Chat) అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ (WhatsApp) అభివృద్ధి చేస్తోంది. దీనితో యూజర్లు తమ ప్రైవేట్‌ చాట్లకు లాక్‌ విధించుకునే ఆప్షన్‌ ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పడుతూ తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘బలగం’ (Balagam). చిన్న సినిమాగా విడుదలైన ఇది.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో భారీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పాత రోజులను గుర్తు చేస్తూ.. తెలంగాణలోని పలు పల్లెటూర్లలో ఈ సినిమాని వీధుల్లో తెరలు కట్టి ప్రదర్శిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని