Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Jun 2023 17:08 IST

1. తెదేపా అధికారంలో ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తయ్యేది: చంద్రబాబు

తెలుగు ప్రజలు ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల కోసం నిరంతరం తెదేపా శ్రమించిందన్నారు. ఎన్టీఆర్‌.. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఏపీలో రెండో తరం సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం జగన్‌

రైతులకు తక్కువ ఖర్చుతో ఆధునిక వ్యవసాయ పరికరాలను తీసుకురావాలనే ఉద్దేశంతో ‘వైఎస్‌ఆర్‌ యంత్రసేవ’ పథకం ప్రారంభించినట్లు ఏపీ సీఎం జగన్‌ అన్నారు. గుంటూరులోని చుట్టగుంటలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం కింద వ్యవసాయ పరికరాల పంపిణీని సీఎం ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను ఆయన పంపిణీ చేశారు. దీంతో పాటు రూ.125.48 కోట్ల రాయితీ మొత్తాన్ని విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘ఐదు గ్యారంటీల’కు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌.. ఈ ఏడాదే అమలు!

ఎన్నికల ముందు తాము ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఐదు గ్యారంటీలను అమలు చేసేందుకు కేబినెట్‌ నిర్ణయించిందన్నారు. కులమత వివక్ష లేకుండా వీటిని అమలు చేస్తామన్నారు. ఇందులో కొన్ని పథకాలను తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని.. మహిళల కోసం తీసుకువస్తున్న గృహలక్ష్మి పథకాన్ని మాత్రం ఆగస్టు 15న ప్రారంభిస్తామని సిద్ధరామయ్య వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలుంటాయని భావిస్తున్నా: ప్రీతమ్‌ ముండే

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan Sharan Singh) అంశంపై భాజపా నేతలు స్పందించడం లేదని, అతడిపై చర్యలు తీసుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం వెనకాడుతోందటూ విమర్శలు వస్తున్న తరుణంలో మహారాష్ట్ర భాజపా ఎంపీ ప్రీతమ్‌ ముండే స్పందించారు. రెజ్లర్ల ఫిర్యాదును తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. భూమి నుంచి చెవిపగిలిపోయే శబ్దాలు.. వణికిపోతున్న ప్రజలు

కేరళ (Kerala)లోని ఓ చిన్న గ్రామంలో భూమి నుంచి భారీ శబ్దాలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇలాంటి వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం.. ఈ మిస్టరీ శబ్దాలకు (Mysterious sounds) కారణాలను తెలుసుకునేందుకు నిపుణులను రంగంలోకి దించుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

6. ప్రయాణికురాలి బాంబు బూచి.. విమానాశ్రయంలో కలకలం!

మహారాష్ట్రలోని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (Mumbai Airport)లో ఓ ప్రయాణికురాలు చేసిన హడావుడి కలకలం రేపింది. పరిమితికి మించి లగేజీ తీసుకొచ్చిన ఆమె.. దానికయ్యే అదనపు ఛార్జీలను చెల్లించేందుకు నిరాకరిస్తూ, తన బ్యాగులో బాంబు (Bomb Threat)  ఉందని పేర్కొనడం భద్రతాసిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించింది. చివరకు అలాంటిదేమీ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

7. బ్రిజ్‌భూషణ్‌కు యూపీ షాకిచ్చిందా..?వాయిదా పడిన ఎంపీ ర్యాలీ

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌(Brij Bhushan Singh)కు ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సోమవారం అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ వాయిదా పడింది. తనకున్న మద్దతును చూపించుకునేందుకు ఈ ర్యాలీని నిర్వహించాలనుకున్నారు. కాగా, వాయిదా విషయాన్ని బ్రిజ్‌భూషణ్‌ ఫేస్‌బుక్‌ ప్రకటన ద్వారా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. చైనా మనసు మారలేదు.. తైవాన్‌ను వదిలేది లేదు..!

క్రెయిన్‌(Ukraine)పై రష్యా యుద్ధం తర్వాత పరిణామాలను చూసి తైవాన్‌(Taiwan)పై ఆక్రమణ విషయంలో చైనా(china) పునరాలోచనలో పడిందనే ప్రచారం ఏమాత్రం నిజం కాదని బ్రిటన్‌కు చెందిన ది ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌(ఐఐఎస్‌ఎస్‌) సంస్థ నివేదిక తేల్చిచెప్పింది. తైవాన్‌పై దాడి విషయంలో బీజింగ్‌ వైఖరిలో లేదా వ్యూహంలో ఏమాత్రం మార్పులేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. కోర్టు బోనెక్కనున్న రాకుమారుడు.. 130 ఏళ్లలో తొలిసారి!

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ III రెండో తనయుడు ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry), ఆయన సతీమణి మెర్కెల్‌ (Meghan Markle)లు కొంతకాలంగా వరుస వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమపై చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఓ వార్తా సంస్థపై హ్యారీతోపాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణకు రానుంది. ఈ కేసులో కోర్టుకు హాజరై బోనులో నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ‘ఆ పతకాలు మీవి మాత్రమే కాదు.. ఎలాంటి తొందరపాటు నిర్ణయం వద్దు’: కపిల్ సేన విన్నపం

భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌(Brij Bhushan Sharan Singh)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెజ్లర్లు(Wrestlers) తమ నిరసనను తీవ్రతరం చేస్తున్నారు. ఆయన్ను అరెస్టు చేయాలని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమ పతకాలను గంగా నదిలో కలిపేస్తామని హెచ్చరించారు. అందుకు గడువు కూడా పెట్టారు. ఈ సమయంలో 1983 క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కపిల్ దేవ్‌ నేతృత్వంలోని జట్టు(1983 World Cup Winners) రెజ్లర్లకు విన్నపం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు