Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

టాప్ 10 న్యూస్‌: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 02 Oct 2022 17:13 IST

1. పార్టీ పేరును భాజపా మార్చుకోవాలి: కేటీఆర్‌ మరో వ్యంగ్యాస్త్రం

మునుగోడు ఉప ఎన్నికపై భాజపా కోర్‌ కమిటీ సమావేశమైన నేపథ్యంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఘాటు విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఈనెల 15లోపు వస్తుందంటూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ పేర్కొన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తనదైన శైలిలో మరో వ్యంగ్యాస్త్రంతో కూడిన ట్వీట్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ స్పీడు పెంచండి: భాజపా నేతలకు సునీల్‌ బన్సల్ దిశానిర్దేశం

తెలంగాణలో ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ వేగవంతం చేయాలని భాజపా ముఖ్యనేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ సూచించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికతో పాటు హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక, ప్రజాగోస-భాజపా భరోసా, పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన కార్యక్రమాలపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. వారికి గాంధీ సిద్ధాంతాలు చెప్పడం సులువే.. కానీ, ఆచరించడమే కష్టం

గాంధీ సిద్ధాంతాలను వల్లించడం కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి సులభంగానే ఉంటుంది కానీ, ఆయన అడుగు జాడల్లో నడవడం మాత్రం కష్టమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా మహాత్ముడికి నివాళులు అర్పించిన ఆయన.. జాతిపితను చంపిన సిద్ధాంతమే గడిచిన ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానత్వం, విభజనవాదాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ‘విండ్‌మ్యాన్ ఆఫ్‌ ఇండియా’ తులసీ తాంతీ ఇకలేరు

ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తాంతీ (64) కన్నుమూశారు. ఆయనకు భార్య గీతా, కుమారుడు ప్రణవ్‌, కుమార్తె నిధి ఉన్నారు. గుండెపోటుతో ఆయన శనివారం సాయంత్రం మరణించినట్లు కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశం ముగించుకొని తిరిగొచ్చిన ఆయన పుణెలో ఉండగా ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు డ్రైవర్‌కు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. పాక్‌ జట్టును ఇరుకున పెట్టిన కోచ్‌ ప్రసంగం: వీడియో వైరల్‌

హోరాహోరీగా సాగుతున్న ఏడు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్‌ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. గడాఫీ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఆరో టీ20లో 8 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్‌.. 3-3తో సిరీస్‌ను సమం చేసింది. ఈ మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పాక్‌ బౌలింగ్‌ కోచ్‌ షాన్‌ టైట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. గుజరాత్‌లో కేజ్రీవాల్‌పై బాటిల్‌తో దాడి?

గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో జరిగిన గర్బా కార్యక్రమంలో పాల్గొన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను విసిరారని ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నాయకులు ఆదివారం తెలిపారు. అయితే అది ఆయనకు తగలలేదని, తలపై నుంచి వెళ్లి పక్కకు పడిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. అందుకోసమే కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగా: ఖర్గే

కాంగ్రెస్‌(Congress) పార్టీని బలోపేతం చేసేందుకే ఎన్నికల బరిలోకి దిగాను తప్ప ఎవరినో ఎదిరించడానికి కాదని ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థి మల్లికార్జున ఖర్గే(Mallikargjun Kharge) స్పష్టంచేశారు. అనేకమంది సీనియర్లు, యువ నేతలు తనను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారన్నారు. ‘ఒకే వ్యక్తికి ఒకే పదవి’ సిద్ధాంతాన్ని అనుసరించి నామినేషన్‌ వేసిన రోజే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ టీజర్‌ టాక్‌ ఏంటంటే?

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఇతిహాసగాథ ‘ఆదిపురుష్‌’ (Adipurush). రామాయణం ఇతివృత్తంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. దసరా కానుకగా ఆదివారం ‘ఆదిపురుష్‌’ టీజర్‌ (Adipurush teaser)ను అయోధ్య వేదికగా విడుదల చేస్తున్నారు. 1.40 నిమిషాల పాటు సాగే టీజర్‌ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతోంది. రాముడిగా ప్రభాస్ కనిపించిన తీరు చాలా బాగుందని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఇక షాపింగ్ సులువుగా.. మ్యాప్స్‌లో విజువల్‌ వండర్‌!

వెబ్‌ బ్రౌజింగ్‌కు గూగుల్ సెర్చ్‌ ఇంజిన్‌ ఓ ప్రత్యామ్నాయంలా మారిపోయింది. ఇతర కంపెనీల సెర్చ్‌ ఇంజిన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ రిజల్ట్‌తో యూజర్లకు మెరుగైన సేవలను అందిస్తుండటంతో ఎక్కువ మంది గూగుల్‌నే ఉపయోగిస్తున్నారు. తాజాగా ఆన్‌లైన్ షాపింగ్, గూగుల్‌ మ్యాప్స్‌కు సంబంధించి సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. మరి, ఆ ఫీచర్లేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. 10మందిని అదుపులోకి తీసుకున్న సిట్‌ పోలీసులు

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ)లో క్రియాశీలకంగా ఉన్నారన్న నిఘావర్గాల సమాచారంతో హైదరాబాద్‌ ముసారాంబాగ్‌లో నివాసముంటున్న జావేద్‌ను సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై జరిగిన బాంబుదాడి కేసులో జావేద్‌ను నిందితుడిగా అనుమానించి విచారించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని