Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 02 Dec 2022 17:05 IST

1. ‘అమరరాజా’ రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయం: మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా సంస్థ ముందుకొచ్చింది. విద్యుత్‌ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అమరరాజా సంస్థతో హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, అమరరాజా సంస్థ ఛైర్మన్, ఎండీ గల్లా జయదేవ్‌, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఎం జగన్‌ సభలకు హాజరయ్యేందుకే డ్వాక్రా సంఘాలు: చంద్రబాబు

మహిళా శక్తి అంటే ఏంటో మళ్లీ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని రాష్ట్రంలోని మహిళలను ఎవరు పైకి తీసుకొచ్చారో.. ఎవరు మోసం చేస్తున్నారో బేరీజు వేసుకోవాలని మహిళలకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కొవ్వూరులోని డ్వాక్రా, అంగన్వాడీ, పొదుపు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గే..!..కాంగ్రెస్‌ మాట తప్పనుందా?

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా తిరిగి కొనసాగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ కీలక వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. పార్టీ అగ్రనేత చెప్పిన ‘ ఒకే వ్యక్తి.. ఒకే పదవి’ విధానానికి గండి పడినట్లవుతుంది. డిసెంబరు 7 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఎవరిని కొనసాగిస్తారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శ్రద్ధా నన్ను వదిలేస్తానని బెదిరించింది.. నార్కో పరీక్షలో ఆఫ్తాబ్‌..!

సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలాకు గురువారం నార్కో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆఫ్తాబ్‌ వెల్లడించినట్లు సమాచారం. శ్రద్ధా తనను వదిలి వెళ్లిపోతానని బెదిరించిందని, అందుకే ఆమెను చంపేశానని నిందితుడు వైద్యులకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆదోని నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు.. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు తెలుగమ్మాయి

ఏపీకి చెందిన యువ క్రీడాకారిణి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆ జట్టులో కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి శర్వాణి ఎంపికైంది. డిసెంబర్‌ 9 నుంచి 20 వరకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు జట్టులో స్థానం సంపాదించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Review: అడివి శేష్‌ ‘హిట్‌ 2’ రివ్యూ!


6. 13,000 మంది ఉక్రెయిన్‌ సైనికుల మృతి..!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటోంది. ఉక్రెయిన్‌ వైపు భారీ సంఖ్యలో సైనికులు మరణించారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు మైఖైలో పొడొల్యాక్‌ వెల్లడించారు. 10,000 నుంచి 13,000 మంది వరకు తమ సైనికులు మరణించి ఉంటారని పేర్కొన్నారు. యుద్ధం మొదలై దాదాపు తొమ్మిది నెలలు దాటినా ఇరు పక్షాల నుంచి మృతుల సంఖ్యపై కచ్చితమైన వివరాలు వెలువడలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రికీ పాంటింగ్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అస్వస్థతకు గురయ్యాడు. మ్యాచ్‌ కామెంట్రీ చేస్తూ అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆస్ట్రేలియా మీడియా సంస్థలు వెల్లడించాయి. పాంటింగ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. లాభాల జైత్రయాత్రకు బ్రేక్‌.. 18,700 దిగువకు నిఫ్టీ!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుస ఎనిమిది రోజుల లాభాల నుంచి శుక్రవారం విరామం తీసుకున్నాయి. ఉదయమే నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. మరోవైపు వరుస లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాలను స్వీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఓటీటీలో ‘రామ్‌సేతు’.. ‘ఊర్వశివో రాక్షసివో’ ఎప్పుడంటే?

అక్షయ్‌కుమార్‌ కీలక పాత్రలో నటించిన యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘రామ్‌సేతు’. అక్టోబరు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో డిసెంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చూడాలంటే అద్దె ప్రాతిపదికన రూ.199 చెల్లించి చూడాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రోహిత్‌, ధావన్‌కు అతడు ప్రత్యామ్నాయం: సాబా కరీం

రానున్న వన్డే ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా సన్నద్ధతను మొదలుపెట్టింది. ఈ టోర్నమెంట్ ముంగిట న్యూజిలాండ్‌తో టీ20 ఫలితం నిరాశపరిచిన విషయం తెలిసిందే. దీంతో డిసెంబర్‌ 4న బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌ కోసం జట్టు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ సాబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్‌ రాహుల్‌ను రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తానని తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు