Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. KTR: మనవాళ్లు ఎవరో అప్పుడే తెలుస్తుంది: కేటీఆర్
తెలంగాణ సాధనలో భారాస (అప్పటి తెరాస) ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. Nizamabad: మోదీ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు.. బైపాస్ రోడ్డు మూసివేత
నిజామాబాద్ జిల్లాలోని ఇందూరులో భాజపా ఆధ్వర్యంలో జనగర్జన సభ జరుగుతోంది. ఈ సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ సభ కావడంతో ప్రజలు, కార్యకర్తలు సభా స్థలానికి భారీగా చేరుకుంటున్నారు. దీంతో సభా ప్రాంగణం అంతా జనంతో నిండిపోయింది. స్థలం లేక సభకు వచ్చే గేట్లను పోలీసులు మూసివేస్తున్నారు. ప్రాంగణం బయట ఉన్న ప్రజలను పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. స్థలం లేకపోవడంతో ప్రజలు రాకుండా పోలీసులు బైపాస్ రోడ్డును మూసివేశారు.
3. Angallu case: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. అంగళ్లు కేసులో జోక్యానికి సుప్రీం నిరాకరణ
అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనలో తెదేపా నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటిషన్లను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో తెదేపా నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. Kanna Lakshminarayana: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: కన్నా లక్ష్మీనారాయణ
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, తెదేపా (TDP) నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఓటమి భయంతోనే చంద్రబాబును (Chandrababu) అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. Nara Bhuvaneshwari: అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది: నారా భువనేశ్వరి
వైకాపా ప్రభుత్వం అడ్డదారిలో వెళ్తోందని.. ధైర్యంగా ఎదుర్కోవాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరిని రాజధాని అమరావతి రైతులు కలిశారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ.. ‘‘రైతుల త్యాగాలు వృథా కావు. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది. క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఓట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదే మన ఆయుధం’’ అని భువనేశ్వరి అన్నారు.
6. Pawan Kalyan:పేదల కడుపు కొడుతూ.. నిజంగా క్లాస్‌వార్ చేస్తుంది జగనే: పవన్ కల్యాణ్
తెలుగుదేశం - జనసేన సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక చేనేతలకు మంచిరోజులు వస్తాయని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణ మండపంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చి అర్జీలు అందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పేదల కడుపు కొడుతూ ముఖ్యమంత్రి జగన్ క్లాస్ వార్ చేస్తున్నారని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ కొనేటప్పుడు ఏమేం చూడాలి? ఇంతకీ ఏమిటీ నాయిస్ క్యాన్సిలేషన్?
ఒకప్పుడు ఇయర్ ఫోన్స్ అంటే వైర్‌తో కూడిన హెడ్‌సెట్టే. కానీ, ఇప్పుడు వాటి స్థానంలో వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ (Earphones) వచ్చి చేరాయి. ఇప్పుడు ఎవరి చెవిలో చూసినా సింపుల్‌గా ఇమిడిపోయే టీడబ్ల్యూఎస్ (True wireless Stereo) ఇయర్‌బడ్సే దర్శనమిస్తున్నాయి. వెయ్యి రూపాయల నుంచి రూ.25వేల వరకు వివిధ కంపెనీల ఇయర్‌బడ్స్ (Earbuds) ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. మరి వీటిని కొనుగోలు చేసేటప్పుడు ఏమేం చూడాలి? ఇయర్‌బడ్స్ విషయంలో తరచూ వినిపించే ANC, ENC అంటే ఏమిటి? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. Nobel Prize: భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్
ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల (Nobel Prize) ప్రకటన కొనసాగుతోంది. భౌతిక శాస్త్రం (Physics)లో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు ఈ ఏడాది నోబెల్ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. Asteroid: లక్ష్యం లేకుండా సంచరిస్తున్న భారీ గ్రహశకలం.. భూమికి సమీపంగా వస్తోందట!
అంతరిక్షంలో (Space) లక్ష్యం లేకుండా సంచరిస్తున్న ఓ భారీ గ్రహశకలాన్ని (Asteroid) శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఒక స్థిర మార్గం, గమ్యం లేకుండా ప్రయాణించడం ఆందోళనకు గురిచేస్తోంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆ ‘కాస్మిక్ నొమాడ్’ కొన్ని సార్లు ఖగోళ వస్తువులు, ఇతర గ్రహాలకు దగ్గరగా వస్తున్నట్లు తెలిసింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భూమికి అతి సమీపంగా వెళ్లే గ్రహశకలాలతో ఓ జాబితాను తయారు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ChinaRajappa: రాష్ట్రంలో వైకాపా పాలనను తరిమికొడదాం: చినరాజప్ప
తెదేపా (TDP) నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా పోరాడాలని చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చినట్లు తెలుగుదేశం సీనియర్ నేత చినరాజప్ప (ChinaRajappa) తెలిపారు. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారని, న్యాయపోరాటంలో గెలుస్తామని చెప్పినట్లు వివరించారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును ములాఖత్ ద్వారా చినరాజప్ప కలిశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా చంద్రబాబుకు అండగా నిలిచి, వైకాపా పాలనను తరిమికొడదామని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TTD: వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు: ఈవో ధర్మారెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
Nagarjuna Sagar: సాగర్ వద్ద కొనసాగుతున్న పహారా.. ఏపీ పోలీసులపై కేసు నమోదు
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. -
గ్రానైట్‌పై విద్యుత్తు పిడుగు
‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’ -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Rishab Shetty: నేను చెప్పింది ఇప్పటికి అర్థం చేసుకున్నారు.. తన స్పీచ్‌పై రిషబ్ శెట్టి పోస్ట్
-
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!