Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 04 Feb 2023 17:03 IST

1. దేశం చూపు కేసీఆర్‌ వైపు.. సంక్షేమంలో మాకు తిరుగులేదు: కేటీఆర్‌

దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిగా ఉందని చెప్పారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన విమర్శలపై కేటీఆర్‌ స్పందించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మాట్లాడిన మాటలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని కేటీఆర్‌ విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కోటంరెడ్డితోనే ప్రయాణం..ఆయనే మా ఊపిరి: నెల్లూరు మేయర్‌

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy)తోనే తమ ప్రయాణమని నెల్లూరు మేయర్‌ (Nellore mayor) పొట్లూరి స్రవంతి అన్నారు. అవసరమైతే నెల్లూరు మేయర్ పదవికి రాజీనామా చేస్తామని తెలిపారు. కార్పొరేటర్‌, మేయర్‌గా తాను ఎదగడానికి కోటంరెడ్డే కారణమని స్పష్టం చేశారు. ‘‘మా జెండా.. మా ఊపిరి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఆయన ఎటుంటే అటే నడుస్తాం’’ అని ఆమె తేల్చి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 6న తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్‌

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ జరుగుతోంది. రెండు సభల్లోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నేరుగా చర్చలోకి వెళ్లారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో శాసనసభ్యుడు వివేకానంద గౌడ్ బలపరిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లిన విషాదాన్ని మరువక ముందే ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) (vani jayaram) కన్నుమూశారు. శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.  వాణీ జయరాం తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబరు 30న జన్మించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టీమ్‌ఇండియా ‘తగ్గేదేలే’.. నెట్‌బౌలర్లుగా నలుగురు టాప్‌ స్పిన్నర్లు!

టీమ్‌ఇండియా (Team India) సాధన షురూ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), శుభ్‌మన్‌ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌.. ఇలా కీలక ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆస్ట్రేలియాతో (IND vs AUS) నాలుగు టెస్టుల సిరీస్‌ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి టెస్టుకు నాగ్‌పుర్‌ వేదికగా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌తో సవాల్‌ వద్దు: అదానీ షేర్ల పతనం నేపథ్యంలో మహీంద్రా స్పందన

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) సోషల్‌ మీడియాలో  చురుగ్గా ఉంటారు. వర్తమాన అంశాలు, హాస్యం పండించే దృశ్యాలు, స్ఫూర్తి నింపే వాక్యాలు నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. తాజాగా అదానీ గ్రూప్‌(Adani Group) షేర్ల పతనంపై స్పందించారు. పరోక్షంగా ఆ సంస్థకు మద్దతుగా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో గరిష్ఠంగా ఎంత వడ్డీ పొందొచ్చు?

పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (POMIS)లో వ్యక్తిగతంగా రూ.4.50 లక్షలు, జాయింట్‌గా రూ.9 లక్షలు డిపాజిట్‌ చేయడానికి ఇప్పటి వరకు అనుమతి ఉండేది. ఇప్పుడు ఇంకాస్త డిపాజిట్‌ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023 బడ్జెట్‌ ప్రసంగంలో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (POMIS) ఖాతా డిపాజిట్‌ పరిమితిని ఒక ఖాతాకు రూ.4.50 లక్షల నుంచి రూ.9 లక్షలకు, జాయింట్‌ ఖాతాకు రూ.15 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రోటీ చేసిన బిల్‌గేట్స్‌.. ఇది కూడా ట్రై చేయండన్న మోదీ

టెక్‌ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) చెఫ్‌గా మారారు. గరిటె తిప్పి భారత వంటకాన్ని తయారుచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో గేట్స్‌ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi). అంతేనా.. ఈసారి తృణధాన్యాలతో వంటకాలు ట్రై చేయండంటూ సలహా కూడా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చలో సింగపూర్‌.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!

అలీ బాబా గ్రూప్‌ అధినేత. చైనా (China) కుబేరుల్లో ఒకరు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై (communist government) మాట తూలినందుకు గానూ అక్కడి ప్రభుత్వం కక్షగట్టింది. ఆయన వ్యాపారాలపై ఉక్కుపాదం మోపింది. దీంతో భారీగా సంపదను కోల్పోవడమే కాదు.. పరాయి దేశమైన జపాన్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రేపు ఇదే పరిస్థితి తమకెందుకు రాకూడదు..? ఇదే అనుమానం చైనాలోని కుబేరుల్లో (Billionaires) మొదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గుబులుపుట్టిస్తున్న చైనా నిఘా నీడ.. లాటిన్‌ అమెరికాలో కన్పించిన రెండో బెలూన్‌

చైనా (China)కు చెందిన నిఘా బెలూన్లు అగ్రరాజ్యం అమెరికా (America)ను గుబులుపుట్టిస్తున్నాయి. గురువారం మోంటానా రాష్ట్ర గగనతలంలో ఓ భారీ బెలూన్‌ (Spy Balloon) కన్పించగా.. తాజాగా లాటిన్‌ అమెరికాలో మరో దాన్ని గుర్తించినట్లు పెంటగాన్‌ శుక్రవారం రాత్రి వెల్లడించింది. ‘‘లాటిన్‌ అమెరికా (Latin America) గగనతలం మీదుగా ఓ బెలూన్‌ ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని