Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. తెదేపాతో భాజపా పొత్తు ఊహాగానాలే..: బండి సంజయ్
వచ్చే ఎన్నికల్లో తెదేపాతో భాజపా పొత్తు ఉంటుందనేది ఊహాగానాలే అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఊహాజనిత కథనాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తెదేపా అధినేత చంద్రబాబు కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. గతంలో మమత, స్టాలిన్, నీతీశ్ కూడా మోదీ, అమిత్‌షాను కలిశారని గుర్తుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం
తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించారు. నెల్లూరులోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యాలయం నుంచి ఆయన వస్తుండగా సుమారు 10మంది బైక్‌లపై వచ్చి కర్రలతో దాడికి యత్నించారు. వెంటనే తెదేపా కార్యకర్తలు, ఆనం అనుచరులు వారిని అడ్డుకుని ప్రతిఘటించడంతో దుండగులు అక్కడికి నుంచి పరారయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. హెల్త్ టూరిజంలో టాప్ 10 దేశాల్లో భారత్: కిషన్‌రెడ్డి
ఆరోగ్య పర్యాటకంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జీ 20 హెల్త్ వర్కింగ్ గ్రూప్‌నకు సంబంధించి మూడో సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రపంచానికే హైదరాబాద్ ఫార్మసీ, వ్యాక్సిన్ రాజధాని అని చెప్పారు. నాణ్యమైన వైద్య విధానాలు భారత్‌లో శతాబ్దాల క్రితమే ఉన్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. 28 మంది ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రాలేదు: మంత్రి బొత్స
ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ల్లో మొత్తం 695 మంది ఏపీ వాసులు ప్రయాణించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి వివరాలు వెల్లడించారు. ఏపీ ప్రయాణికుల్లో 553 మంది సురక్షితంగా ఉన్నారని.. 92 మంది తాము ట్రావెల్ చేయలేదని తెలిపినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. తెలంగాణలోనూ భాజపాను తుడిచిపెట్టేస్తాం: రాహుల్ గాంధీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పరంపరను కొనసాగిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లోనూ భాజపా (BJP) తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని.. యావత్తు దేశం విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని భాజపాపై నిప్పులు చెరిగారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన హోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఒడిశా ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇంతకుముందు 288 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పిన అధికారులు.. మృతదేహాల లెక్కింపులో పొరపాట్లు జరిగినట్లు చెప్పారు. ‘‘ కొన్ని మృతదేహలను రెండు సార్లు లెక్కించారు. సంఘటన స్థలంలో లెక్కించి, ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మరోసారి లెక్కపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటు చేసుకొంది. ఆదివారం ఉదయం కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి రామేశ్వర్ తెలి, మరో ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ విమానాన్ని గువాహటి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఏమిటీ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ..?
ఒకే పట్టాలపై ఏకకాలంలో రెండు రైళ్లు ఉండకుండా చూస్తూ పట్టాలను కేటాయించే సమగ్రమైన సిగ్నల్ వ్యవస్థ ఇది. రైలు ప్రయాణాలు సురక్షితంగా జరిగేలా చేయడం.. సిగ్నల్స్‌లో ఎటువంటి అవాంఛిత మార్పులు రాకుండా చూడటం దీని ప్రాథమిక విధి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రయాణించే మార్గం పూర్తిగా సురక్షితం అని తనిఖీల్లో తేలేవరకు రైలుకు సిగ్నల్స్ ఇవ్వకుండా ఆపి ఉంచుతుంది. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ వినియోగంలోకి వచ్చిన అనంతరం రైళ్లు ఢీకొనడాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం.. ప్రమాద తీవ్రతకు అదీ ఓ కారణమే : రైల్వే బోర్డు
ఒడిశాలో రైలు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 275 మంది మృతి చెందారు. ఈ క్రమంలోనే రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు స్పందించింది. సిగ్నలింగ్‌లో సమస్య కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని వెల్లడించింది. అయితే, దీనిపై రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్ దిగ్భ్రాంతి
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident)పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ హృదయ విదారక వార్త వినగానే తన మనసు చలించిపోయిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. భారత్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించిన విషాద వార్త విని తన హృదయం ముక్కలైందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Imran Tahir - MS Dhoni: ధోనీని అధిగమించిన ఇమ్రాన్ తాహిర్.. అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పిన వెటరన్ ప్లేయర్!
-
Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత ‘వారాహి’ యాత్ర
-
TS News: త్వరలో నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం: హరీశ్ రావు
-
US visa: అమెరికాలో చదువు.. రికార్డు స్థాయిలో 90వేల వీసాలు జారీ
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
TS High Court: నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టు స్టే