Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...
1. తెలంగాణలో ‘ఫాక్స్‌కాన్’ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం: ఛైర్మన్ యాంగ్ లియూ
తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఫాక్స్‌కాన్ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ఛైర్మన్ యాంగ్ లియూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా తనకు, తన బృందానికి మంచి ఆతిథ్యం ఇచ్చారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత గ్రీటింగ్ కార్డుతో తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఉమెన్స్ డే సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవు.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ రోజున రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కంచుకోటలో కాదు.. మీ పార్టీ గెలవని చోట పోటీ చేయగలరా?: జగన్‌కు లోకేశ్ సవాల్
ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామిక వేత్తలు చెప్పారని.. ప్రముఖ కంపెనీలు బైబై ఏపీ అంటున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. రాష్ట్రంలో జగన్ (CM Jagan) ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు నిల్.. గంజాయి ఫుల్ అన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శించారు. పీలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు బెయిల్ మంజూరు
మద్యం కుంభకోణం కేసు (Delhi liqour scam)లో అరెస్టయిన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాస్‌పోర్టు అప్పజెప్పాలని, రూ.2లక్షల పూచీకత్తు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. బ్యాట్‌పై ‘ధోనీ’ పేరు రాసుకుని.. గుజరాత్‌పై అర్ధ సెంచరీ బాదేసి..
తొలి మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభమై కేవలం రెండు రోజులే అయినా.. ఉత్కంఠకు కొదవలేదు. అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న మహిళా క్రికెటర్లు.. మైదానంలో అద్భుతాలు చేస్తున్నారు. ఆదివారం గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants), యూపీ వారియర్స్ (UP Warriorz) మధ్య జరిగిన లీగ్ మ్యాచే అందుకు ఉదాహరణ. ఓడిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకున్న యూపీ జట్టు.. గుజరాత్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ₹1.5 కోట్ల ఆస్తిని ప్రభుత్వం పేరిట రాసిన 85ఏళ్ల వృద్ధుడు.. ఎందుకంటే?
సొంత పిల్లలపై కోపంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నాథూ సింగ్ అనే 85 ఏళ్ల వృద్ధుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రూ.1.5 కోట్లు విలువ చేసే తన ఆస్తిని ప్రభుత్వం పేరిట వీలునామా రాశారు. తాను మరణించిన తర్వాత శవాన్ని వైద్యకళాశాలకు అప్పగించాలని కోరారు. తన కొడుకు, కూతుళ్లు కనీసం తన శవాన్ని కూడా తాకొద్దని వీలునామాలో పేర్కొనడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. హెలిప్యాడ్‌పై ప్లాస్టిక్.. యడియూరప్ప హెలికాప్టర్‌కు తప్పిన ముప్పు
కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి, భాజపా (BJP) సీనియర్ నేత బి.ఎస్. యడియూరప్ప (BS Yediyurappa)కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దిగాల్సిన హెలిప్యాడ్‌పై ప్లాస్టిక్ పేరుకుపోవడంతో.. చివరి నిమిషంలో పైలట్ ల్యాండింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఉదయం యడియూరప్ప, మరికొంతమంది భాజపా నేతలతో కలిసి కలబుర్గి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. తిహాడ్ జైలుకు సిసోదియా.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఆమ్‌ఆద్మీ నేత, దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు (Manish Sisodia) మరోసారి చుక్కెదురయ్యింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో మార్చి 20వరకు ఆయన తిహాడ్ జైల్లో ఉండనున్నారు. ఐదు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న ఆయన్ను నేడు దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ‘మీ అందం సీక్రెట్ చెప్పండి సర్’: యువతి ప్రశ్న.. థరూర్ ఆసక్తికర జవాబు
కాంగ్రెస్ (Congress) ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చాలా అందంగా ఉంటారని కొనియాడిన ఓ మహిళా అభిమాని.. అందుకు సీక్రెట్ ఎంటో చెప్పాలంటూ థరూర్‌ను అడిగింది. దీనికి కాంగ్రెస్ నేత చెప్పిన సమాధానం నవ్వులు పూయించింది. ఈ ఆసక్తికర సంభాషణ నాగాలాండ్ పర్యటనలో చోటుచేసుకుంది. శశి థరూర్ (Shashi Tharoor) ఇటీవల నాగాలాండ్ (Nagaland) రాష్ట్రంలో పర్యటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. అప్రమత్తంగా ఉండండి.. చైనా సైన్యం ఏ క్షణమైనా చొరబడొచ్చు..
ఈ ఏడాది చైనా సైన్యం ఏ క్షణమైనా తమ భూభాగంలోకి చొరబడే ప్రమాదం ఉందని తైవాన్ రక్షణ మంత్రి చూ-కూ-చెంగ్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య తైవాన్ జలసంధి సమీపంలో ఘర్షణ వాతావరణంతో ఈ పరిస్థితి నెలకొంది. తైవాన్ చుట్టుపక్కల ఇటీవల కాలంలో చైనా సైన్యం కదలికలు బాగా పెరిగిపోయాయి. దీంతోపాటు దాదాపు రోజువారీగా చైనా విమానాలు తైవాన్ సమీపంలోకి రావడం మొదలుపెట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్