Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం బుధవారం బలహీనపడిందని పేర్కొంది. రాగల 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ముందస్తు ఎన్నికలపై మంత్రులకు క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం జగన్ మంత్రులకు క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. ఇవాళ మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులతో సీఎం జగన్ దాదాపు గంటసేపు చర్చించారు. ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై మంత్రులతో మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని సీఎం జగన్ తేల్చి చెప్పినట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. వివేకానందరెడ్డి రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. హత్యాస్థలిలో లభించిన లేఖను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈకేసు సీబీఐకి బదిలీ అయిన వెంటనే 2021 ఫిబ్రవరి 11న లేఖను దిల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు వివేకా లేఖను సీబీఐ పంపింది. దీంతో పాటు గతంలో వైఎస్ చేతిరాతతో ఉన్న లేఖలను కూడా సీఎఫ్‌ఎస్‌లకు పంపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సిట్ దూకుడు.. అభియోగపత్రంలో 37మంది నిందితుల పేర్లు!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు దూకుడు పెంచారు. నిందితులపై అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. ఇందులో 37మంది నిందితులను చేర్చనున్నారు. న్యాయసలహా తీసుకొని వచ్చే వారంలో అభియోగపత్రం దాఖలు చేసే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు-2023’ పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు మంత్రివర్గంలో నిర్ణయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కందుకూరులో దారుణం.. మహిళపై ముగ్గురు అత్యాచారయత్నం
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని మాచవరం రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మూగ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాధిత మహిళ వారి నుంచి తప్పించుకొని పెట్రోల్ బంక్‌లోకి వెళ్లింది. బంక్‌లో పని చేస్తున్న సిబ్బంది మహిళను నిందితుల చెర నుంచి రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. అనురాగ్ ఠాకూర్‌తో భేటీ.. రెజ్లర్ల 5 డిమాండ్లు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన నిరసనలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఆందోళనపై స్పందించిన కేంద్రప్రభుత్వం వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు నేడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ముందు రెజ్లర్లు 5 డిమాండ్లను ఉంచినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ప్రపంచంలో ప్రవాసులకు అత్యంత ఖరీదైన నగరం న్యూయార్క్
ప్రవాసులు నివసించడానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా (Expensive City) న్యూయార్క్ (New York) నిలిచింది. గతంలో ఈ స్థానంలో ఉన్న హాంకాంగ్ (Hong Kong) ఇప్పుడు ద్వితీయ స్థానానికి చేరింది. మరోవైపు అద్దెలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్ ఈ జాబితాలో తొలి ఐదు స్థానాల్లోకి ఎగబాకింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. అన్నదాతలకు గుడ్‌న్యూస్.. పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం(Union Government) శుభవార్త చెప్పింది. 2023-24 ఖరీఫ్ సీజన్‌కు గాను పలు రకాల పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఇక ఏడాదికి రెండు సినిమాలు.. పెళ్లిపైనా స్పందించిన ప్రభాస్!
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ఓం రౌత్ (Om raut) దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ డ్రామా చిత్రం.. ‘ఆది పురుష్’ (Adipurush). కృతిసనన్ (Kriti Sanon), సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), సన్నీ సింగ్ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీరిలీజ్ (Adipurush Pre Release Event) ఈవెంట్ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Srinivas Goud: మోదీ క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలి: శ్రీనివాస్‌గౌడ్
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?
-
Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్
-
Guntur: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం