Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Published : 08 Mar 2023 16:58 IST

1. మా తల్లిదండ్రులు ఎప్పుడూ మాకు ఆ భావన కల్పించలేదు: కేటీఆర్‌

మానవ వనరులు, సాంకేతికతను వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. యువత ఎక్కువగా ఇంజినీర్‌, డాక్టర్‌, లాయర్‌ అవ్వాలని ఇంట్లో చెప్తారని.. వ్యాపారవేత్తలు ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌ తాజ్‌ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన ‘వి హబ్‌’ 5వ వార్షికోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మినిట్స్‌ వివరాలు ఇవ్వకపోతే యథావిధిగా ఉద్యమం: బొప్పరాజు

ప్రభుత్వ హామీలన్నీ లిఖిత పూర్వకంగా ఇస్తే ఉద్యమ కొనసాగింపుపై పునరాలోచన చేస్తామని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అది కూడా బుధవారం సాయంత్రంలోగా  మినిట్స్‌ కాపీలు ఇస్తే రేపటి నల్ల రిబ్బన్ల నిరసన విరమిస్తామన్నారు. లేదంటే యథావిధిగా నిరసన కొనసాగుతుందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి స్పష్టంగా చెప్పినట్లు బొప్పరాజు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌ను పట్టించుకునే స్థితిలో లేరు: బండి

మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత భారాసకు లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భారాసలో మహిళా విభాగమే లేదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్సీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. తొలి ఐదేళ్ల పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. భారాస మహిళా అధ్యక్షురాలు ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ధోనీ, కోహ్లీ.. ఎవరిని ఎంచుకుంటారు..? అదిరిపోయే సమాధానమిచ్చిన ఆర్సీబీ బ్యాటర్‌

ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ.. వీరిద్దరూ భారత క్రికెట్‌ చరిత్రను తిరగరాసిన ఆటగాళ్లే. తమ ఆటతో టీమ్‌ఇండియాను మరోస్థాయికి తీసుకెళ్లారు. వీరికి అంతర్జాతీయంగానూ అభిమానులు ఉన్నారు. యువ క్రికెటర్లు వీరి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు. అందులో ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీకి ఆడుతున్న ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ఎల్లీస్‌ పేర్రీ ఒకరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నేవీ హెలికాప్టర్‌.. నీటిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

భారత నౌకాదళానికి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్‌కు ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్‌ను అత్యవసరంగా నీటిపై దించారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. నేవీకి చెందిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌) రోజువారీ శిక్షణలో ఉండగా ఈ ఘటన జరిగినట్లు నేవీ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అర్చనా గౌతమ్‌తో అసభ్య ప్రవర్తన.. ప్రియాంకా గాంధీ పీఏపై కేసు!

కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi) వ్యక్తిగత సహాయకుడు సందీప్‌ సింగ్‌పై వేధింపుల కేసు నమోదయ్యింది. తన కుమార్తెను చంపుతానని సందీప్‌ బెదిరించినట్లు బిగ్‌బాస్‌ ఫేమ్‌, కాంగ్రెస్‌ నేత అర్చనా గౌతమ్‌ (Archana Gautam) తండ్రి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి తనకు ఎదురైన ఘటనను వివరిస్తూ అర్చన కూడా ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జనాభా పెంచేందుకు చైనా అవస్థలు.. వధువులకు సొమ్ము ఇవ్వడంపై చర్యలు

చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోవడంతో  ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా  జననాలను పెంచేందుకు చర్యలు చేపట్టింది. పెళ్లి సమయంలో వధువుకు సొమ్ము ముట్టజెప్పే సంప్రదాయాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టింది. చైనాలో వరుడు తన సంపదను వధువు వద్ద ప్రదర్శించడానికి, ఆమెను పెంచినందుకు అత్తింటివారికి సొమ్ములు ముట్టజెప్పే సంప్రదాయం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ నగరాన్ని ఆక్రమిస్తే.. ఇక రష్యాను అడ్డులేనట్లే..!

బక్ముత్ నగరాన్ని ఆక్రమిస్తే.. తూర్పు ఉక్రెయిన్‌(Ukraine)లోని కీలక నగరాల్లో దూసుకెళ్లడానికి ఇక రష్యా(Russia)కు అడ్డు ఉండదని యూఎస్ మీడియా కథనం పేర్కొంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ( Volodymyr Zelensky)ని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. బక్ముత్‌ తర్వాత రష్యా బలగాలు ఇతర ప్రాంతాల్లోకి దూసుకెళ్లగలవని తమకు అర్థమైందని జెలెన్‌స్కీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మాజీ ఉద్యోగికి సారీ చెప్పిన ఎలాన్‌ మస్క్‌.. ఎందుకంటే?

ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ మాజీ ట్విటర్‌ ఉద్యోగితో ఆయన చేసిన చాట్ చర్చనీయాంశంగా మారింది. అయితే, తాను వాస్తవ పరిస్థితులేంటో తెలుసుకోకుండా మాట్లాడానని.. అందుకు క్షమించాలని సదరు ఉద్యోగిని మస్క్‌ కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అక్రమంగా ప్రవేశిస్తే రువాండాకు తరలిస్తాం..! రిషి సునాక్‌ హెచ్చరిక

దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారిపై ఇక కఠినంగా వ్యవహరిస్తామని బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ హెచ్చరించారు. అక్రమ మార్గాల ద్వారా చొరబడే వారిని శరణార్థిగా పరిగణించేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. బోట్ల ద్వారా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నవారికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్‌ కొత్తగా తీసుకువచ్చిన విధానానికి సంబంధించిన వివరాలను రిషి సునాక్‌ మీడియా ముందు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని