Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 09 Feb 2023 17:22 IST

1. జగన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు

సీఎం జగన్‌, ఆ పార్టీ నేతల తీరు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి రెండుకళ్లు లాంటి అమరావతి, పోలవరంను దెబ్బతీశారని మండిపడ్డారు. ‘‘రాష్ట్ర రాజధానిపై నిన్న కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించింది’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా.. షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. త్వరలో ఖాళీ కానున్న స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు (మొత్తం 13), తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మరోసారి అడ్డుకున్న పోలీసులు.. స్టూల్‌పైనే నిల్చుని నిరసన తెలిపిన లోకేశ్

‘యువగళం’ (Yuvagalam) పాదయాత్రలో తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. చిత్తూరు (Chittoor) జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆత్మకూరు నుంచి 14వ రోజు లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభించారు. దారిపొడవునా ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వారి ప్రవర్తన బాధాకరం.. విపక్షాలు విసిరే బురదలోనూ ‘కమలం’ వికసిస్తుంది: మోదీ 

తమ ప్రభుత్వంపై విపక్షాలు ఎంతగా బురదచల్లినా ‘కమలం’ మరింతగా వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. అదానీ వ్యవహారంపై రాజ్యసభ(Rajya Sabha)లో విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తూ తన ప్రసంగానికి అడ్డు తగలడంపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరు ఎంపీల భాష, ప్రవర్తిస్తున్న తీరు, చేస్తోన్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నాగ్‌పుర్‌ పిచ్‌ ఏం చెబుతోంది?

ఆస్ట్రేలియా జట్టు భయపడినంతా జరిగింది. బోర్డర్‌ - గావస్కర్‌ (Border - Gavaskar) ట్రోఫీ తొలి టెస్టులో ఆ జట్టు బ్యాటర్లలో అత్యధికులు కుదురుకోకముందే పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో పిచ్‌ గురించి వాళ్లు ఇన్నాళ్లుగా వ్యక్తం చేసిన భయం నిజమే అని తేలింది. దీంతో తొలి టెస్టు (Ind vs Aus First Test)లో ఆసీస్‌కు కష్ట కాలం మొదలైంది. రఫ్‌గా ఉన్న ఈ పిచ్‌పై పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గూగుల్‌ షేర్లకు ‘బార్డ్‌’ దెబ్బ.. 100 బి.డా. మార్కెట్‌ విలువ ఆవిరి!

కృత్రిమ మేధ (AI) విషయంలో తామేమీ తక్కువ కాదంటూ చాట్‌జీపీటీకి (chatGPT) పోటీగా బార్డ్ (Bard) పేరిట గూగుల్‌ (Google) తీసుకొచ్చిన చాట్‌బాట్‌ ఆదిలోనే షాకిచ్చింది. ప్రమోషనల్‌ వీడియోలో చిన్న తప్పిదం ఆ కంపెనీ షేర్లపై పెను ప్రభావమే చూపింది. దీంతో గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ (Alphabet Inc) మార్కెట్‌ విలువ ఏకంగా 100 బిలియన్‌ డాలర్లు ఆవిరైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కాంగ్రెస్‌పై విమర్శల వేళ.. శశిథరూర్‌కు ప్రధాని కృతజ్ఞతలు..

పార్లమెంట్‌లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది.  తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు నిన్న గట్టిగా బదులిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi).. యూపీయే పాలనపై దుమ్మెత్తిపోశారు. ఆ సమయంలో మధ్యలో ఓసారి తన ప్రసంగాన్ని ఆపి మరీ.. కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ (Shashi Tharoor)కు ధన్యవాదాలు తెలిపారు. ఇంతకీ థరూర్‌కు ప్రధాని ఎందుకు కృతజ్ఞతలు చెప్పారు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పేటీఎంలో రూపే క్రెడిట్‌ కార్డుతో యూపీఐ చెల్లింపులు

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm Payments Bank) వినియోగదారులు ఇకపై రూపే క్రెడిట్‌ కార్డ్‌తో (Rupay credit card) యూపీఐ (UPI) చెల్లింపులు చేయొచ్చు. తమ రోజువారీ లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగించే లక్షల మంది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేవు : కేంద్రం

న్యాయవ్యవస్థ(Judiciary)లో రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం, నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు (Reservation) కల్పించడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, జడ్జీలుగా నియమించే సమయంలో ప్రాతినిధ్యం లేని వర్గాలను దృష్టిలో ఉంచుకొని సిఫార్సు చేయాలని జడ్జీలు, కొలీజియంకు సూచించినట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మళ్లీ ప్రేమలో పడిన బిల్‌గేట్స్‌..?

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ (Bill Gates) మళ్లీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మెలిందాతో విడాకులు తీసుకున్న ఆయన.. ఏడాది నుంచి ఒరాకిల్‌ దివంగత సీఈవో భార్య పాలా హర్డ్‌(Paula Hurd)తో డేటింగ్‌ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆరు పదుల వయసున్న ఈ జంట ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని కెమెరా కళ్లకు చిక్కడంతో వారిపై  డేటింగ్ ఊహాగానాలకు బలం చేకూరినట్లయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు