Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. TSPSC ప్రశ్నపత్రం లీకేజీ.. రూ.1.63 కోట్ల లావాదేవీలు: సిట్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.ఈ కేసులో ఇప్పటివరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతుల మారిన నగదు వివరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: రేవంత్ రెడ్డి
పార్టీ, ప్రజల కోసం పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. నాయకుడిగా మారేందుకు యూత్ కాంగ్రెస్ (Youth Congress) ఓ వేదిక అని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేనే దీనికి ఉదాహరణ అని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని సీఎం హామీ ఇచ్చారు: వెంకట్రామిరెడ్డి
ఏపీ ఎన్జీవో నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని శుక్రవారం కలిశారు. ఉద్యోగ సంఘాల నేతల్లో ఏపీ ఉద్యోగ ఐకాస అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శివారెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, తదితరులు ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ లేని ఫించను ఇవ్వాలని సీఎంను కోరామని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. రాఘవ్ బెయిల్ 15 నుంచి 5 రోజులకు కుదింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ్‌కు బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దిల్లీ హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. మాగుంట రాఘవ్ బెయిల్‌ను 15 రోజుల నుంచి ఐదు రోజులకు కుదించింది. ఈనెల 12న స్థానిక కోర్టులో హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ‘ఏక్‌నాథ్ శిందేను ట్రాప్ చేయాలన్నది మీరేగా’: అమృతా ఫడణవీస్‌కు బుకీ మెసేజ్..!
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత (Amruta Fadnavis)ను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానీ (Anil Jaisinghani)ని అమృతా ఫడణవీస్ సాయంతోనే పట్టుకున్నట్లు పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత.. ఎందుకంటే..?
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఘోర ప్రమాదం (Odisha Train Tragedy) బాలేశ్వర్ ప్రజలకు ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఆ ప్రమాదానికి సంబంధించిన వార్తలు వింటేనే వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇక, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను బహానగా ప్రభుత్వ పాఠశాల (Bahanaga High School)లో భద్రపర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. అక్రమ బొగ్గు గని కూలి ముగ్గురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లెందరో?!
ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్(Dhanbad)లో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని(coal mine)లో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో అక్రమంగా తవ్వకాలు కొనసాగుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది చిక్కుకొని ఉంటారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం 10.30గంటల సమయంలో భారత్ కోకింగ్‌కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)లోని భౌరా కాలరీ ప్రాంతంలో చోటుచేసుకోగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. శరద్ పవార్‌కు బెదిరింపు.. స్పందించిన ‘మహా’ డిప్యూటీ సీఎం!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు బెదిరింపు సందేశాలు రావడంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ‘‘ఏ నాయకుడినైనా బెదిరించడం.. సోషల్‌మీడియాలో తమ భావాలు వ్యక్తపర్చే క్రమంలో హద్దులు దాటి ప్రవర్తించడాన్ని ఉపేక్షించం. ఈ ఘటనపై పోలీసులు చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటారు’’అని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. దేశంలో పెరుగుతోన్న షుగర్.. బీపీ బాధితులు!
దేశంలో (India) మధుమేహుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ జనాభాలో 11.4 శాతం మంది.. దీని బారిన పడినట్లు ది లాన్సెట్ (The Lancet) డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలాజీ జర్నల్ నివేదికలో వెల్లడైంది. అలాగే.. 35.5 శాతం ప్రజలు అధిక రక్తపోటు (Hypertension)తో బాధపడుతున్నట్లు తేలింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)తో కలిసి మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ అధ్యయనం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. పెద్ద ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే చిన్న చిన్న ఎఫ్‌డీలే మేలు! ఎలాగంటే?
ఇన్వెస్ట్‌మెంట్ అనగానే భారతీయులకు మొదట ఫిక్స్‌డ్ డిపాజిటే (Fixed Deposit) గుర్తొస్తుంది. భద్రత, కచ్చితమైన రాబడే అందుకు కారణం. అయితే, చాలా మంది ఒకే బ్యాంకులో పెద్ద మొత్తంలో ఎఫ్‌డీ (Fixed Deposit) చేస్తే ఎలాంటి సమస్యా ఉండదనుకుంటారు. కానీ, అది అంత ప్రయోజనకరమైన మార్గం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి.. పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ప్రయోజనాలు ఎక్కువని చెబుతుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pakistan: అఫ్గాన్ సైనికుడి కాల్పులు.. ఇద్దరు పాక్ పౌరులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Vande Bharat: కాషాయ రంగులో ‘వందేభారత్’.. రైల్వే మంత్రి వివరణ ఇదే!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?