Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 09 Dec 2022 16:57 IST

1. నా ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వసాధారణం: కేసీఆర్‌ 

దేశ రాజధాని దిల్లీలో ఈనెల 14న భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)(BRS) కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ తెలిపారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనేది భారాస నినాదమని చెప్పారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తన ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వసాధారణమని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వాహనాల్లో 100 మందితో వచ్చి.. సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్‌

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మన్నెగూడలో కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని అపహరించిన ఘటన కలకలం రేపింది. డీసీఎం, కార్లలో 100మందికి పైగా యువకులతో వచ్చిన నవీన్‌రెడ్డి  తమ కుమార్తెను తీసుకెళ్లినట్టు దామోదరెడ్డి, నిర్మల దంపతులు ఆరోపించారు. ఇంట్లోని సామగ్రి, సీసీ కెమెరాలు, కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. గతంలో నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు యువతి కుటుంబ సభ్యులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అనురాగ్ ఠాకూర్‌ ఇలాకాలో ఒక్క సీటూ గెలవని భాజపా..!

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly election Results).. కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur)కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో భాజపా (BJP) ఓటమికి ఆయనే కారణమంటూ విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఇక, ఆయన సొంత నియోజకవర్గంలో భాజపా ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విజయం సరే.. ఇప్పుడు కాంగ్రెస్‌ ముందు ‘సీఎం’ సవాల్..!

హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్‌ (Congress) పార్టీ ఇప్పుడు తదుపరి సవాల్‌ను పరిష్కరించేందుకు సిద్ధమవుతోంది. అదే.. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం. ఈ పదవికి ఆశావహుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ సిద్ధాంతాలకు లోబడి పార్టీని, రాష్ట్రాన్ని ముందు నడిపించే వ్యక్తిని సీఎం పదవిలో కూర్చోబెట్టడం హస్తం పార్టీకి పెద్ద సవాలే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వాళ్లు టీమ్‌ఇండియా ఆటగాళ్లలా కనిపించడం లేదు.. మాజీ కోచ్‌ మండిపాటు

ప్రస్తుత ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే అసలు వీరు టీమ్‌ఇండియా(Team india) జట్టులోనే ఉన్నారా అనే అనుమానం కలుగుతోందంటూ భారత మాజీ కోచ్‌ మదన్‌ లాల్‌(Madan lal) ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లా(Bangladesh)తో తొలి వన్డేలో 1 వికెట్‌ తేడాతో ఓడిన భారత్‌.. రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై ఈ మాజీ కోచ్‌ విరుచుకుపడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


రివ్యూ: గుర్తుందా శీతాకాలం


6. 18 గంటలు ఏకధాటిగా ప్రయాణించిన తాపస్‌ యూఏవీ..!

బెంగళూరుకు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఈ) అభివృద్ధి చేస్తున్న మానవ రహిత విమానం(యూఏవీ) ‘తాపస్‌ 201’ను ఇటీవల విజయవంతంగా పరీక్షంచారు. ఈ విషయాన్ని డీఆర్‌డీవో వెల్లడించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌లో నిర్వహించిన పరీక్షల్లో 18 గంటలపాటు ఈ యూఏవీ ఎగిరింది. ఇది మేల్‌ (మీడియం ఆల్టిట్యూడ్‌, లాంగ్‌ ఎండ్యూరెన్స్‌) కేటగిరిలోకి వస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వారు స్పందించి ఉంటే శ్రద్ధా బతికేది.. మీడియా ముందు తండ్రి ఆవేదన

తన కుమార్తెను అతి దారుణంగా హత్య చేసిన ఆఫ్తాబ్‌ పూనావాలా (Aaftab Poonawala)ను ఉరితీయాలని శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) తండ్రి వికాస్‌ డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా హత్య (Shraddha Murder) కేసులో దిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మృతురాలి తండ్రి వికాస్‌ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. స్పేస్‌ఎక్స్‌ జాబిల్లి యాత్రకు భారత నటుడి ఎంపిక..!

స్పేస్‌ఎక్స్‌ జాబిల్లి యాత్రలో ప్రయాణించే అవకాశం భారత్‌కు చెందిన ఓ నటుడికి లభించింది. జపాన్‌ బిలియనీర్‌ యుసాకు మేజవా రిజర్వు చేసుకొన్న స్పేస్‌ఎక్స్‌ యాత్ర కోసం ఎంచుకొన్న బృందంలో ‘బాల్‌వీర్‌’ ఫేమ్‌ దేవ్‌ జోషికి స్థానం దక్కింది. యుసాకు గతేడాది ప్రపంచ వ్యాప్తంగా సృజనాత్మక వ్యక్తుల కోసం అన్వేషణ చేపట్టారు. ఈ క్రమంలో పలువురిని తన ప్రైవేటు స్పేస్‌ఎక్స్‌ ఫ్లైట్‌లో క్రూగా ఎంచుకొన్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. క్లీన్‌స్వీప్‌ గండం గట్టెక్కేనా..? టీమ్‌ఇండియాని గెలిపించేదెవరు?

వరుసగా రెండు ఓటములు.. ముగ్గురికి గాయాలు.. బంగ్లాదేశ్‌తో చివరి వన్డేకి ముందు టీమ్‌ఇండియా పరిస్థితి ఇదీ. సిరీస్‌లో నామమాత్రమైన మ్యాచ్‌ అయినప్పటికీ..  టెస్టులకు ముందు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలంటే భారత్‌ తప్పక గెలవాల్సిందే. విజయం చేరువగా వచ్చి బోల్తా పడిన  జట్టును మూడో వన్డేలో గెలిపించే ఆటగాడు ఎవరు? బంగ్లా చేతిలో క్లీన్‌స్వీప్‌ కాకుండా పరువు కాపాడి ‘స్టార్‌’గా మారేది ఎవరు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వన్‌ప్లస్‌ నుంచి 4K టీవీ.. ధర, ఫీచర్లివే

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్‌ (OnePlus TV) మరో కొత్త టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. వై సిరీస్‌లో 55 అంగుళాల 4K టీవీనీ తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ 55 Y1S ప్రో (OnePlus TV Y1S Pro)గా పేర్కొనే ఈ టీవీ ధరను కంపెనీ రూ.39,999గా నిర్ణయించింది. ఇంతకీ ఇందులో ఉన్న ఫీచర్లేంటి? ఎప్పుడు నుంచి లభ్యమవుతుందో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని