Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...
1. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకి తగిన గుణపాఠం చెప్పాలి: చంద్రబాబు
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపాకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పి... తెలుగుదేశం (TDP) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఎన్నికల్లో ప్రలోభాలు, బోగస్ ఓట్లతో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: భారాస కార్యకర్తల డిమాండ్
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆమెకు మద్దతుగా నగరంలోని పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారాస శ్రేణులు, నేతలు పలు చోట్ల దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో ఆందోళనకు దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. తిరుమలలో 22న ఉగాది ఆస్థానం.. 2 రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి, విష్వక్సేనులకి విశేష సమర్పణ చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. టెస్టుల్లో గిల్ అలవోకగా 8 వేల నుంచి 10 వేల పరుగులు చేయగలడు: సన్నీ
టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (Shubmna Gill) ఆసీస్‌పై సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 15వ టెస్టు ఆడుతున్న గిల్‌కిది రెండో శతకం. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) మూడో టెస్టుకు కేఎల్ రాహుల్‌కు బదులు గిల్ తుది జట్టులోకి వచ్చాడు. కానీ, మూడో టెస్టులో గొప్పగా రాణించకపోయినా.. కఠిన పిచ్‌పై ఫర్వాలేదనిపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. 10 రోజుల ముందే షేర్లు అమ్మేసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చీఫ్
అమెరికా సహా ఇతర మార్కెట్లలో బ్యాంకింగ్ స్టాక్స్ పతనానికి కారణమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) విషయంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ సంక్షోభం తలెత్తడానికి కొద్ది రోజుల ముందే బ్యాంక్ చీఫ్, సీఈవో గ్రెగ్ బెకర్ తన షేర్లు అమ్ముకున్నారని తెలిసింది. ఎస్‌వీబీ మాతృ సంస్థ అయిన ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌లో ఉన్న 3.6 బిలియ్ డాలర్ల విలువైన 12,451 షేర్లను ఫిబ్రవరి 27న విక్రయించారని ఆ గ్రూప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అలసటగా అనిపిస్తోందా?... ఇవి ట్రై చేసి చూడండి!
ఎండాకాలం (Summer) మొదలైంది.. ఎక్కడెక్కడో పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి అలసట ఆవహిస్తుంది. దాన్నుంచి ఉపశమనం పొందేందుక కాస్త టీ (Tea) లేదా కాఫీ (Coffee) తీసుకుంటాం. అప్పటికి కాస్త రిలీఫ్‌గా అనిపించినా.. కెఫిన్ (Caffeine) ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో దుష్ప్రభావాలు కలిగే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వీలైనంత వరకు కెఫిన్‌కు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. నా దగ్గర డబ్బు లేదు..నెలకు రూ.10 లక్షలు అప్పు తీసుకుంటున్నా..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)ను రూ.11వేల కోట్ల మేర మోసగించిన కేసులో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(Nirav Modi) వద్ద డబ్బులేదట. చట్టపరమైన ఖర్చులు, జరిమానాలను చెల్లించేందుకు డబ్బులు అప్పు తీసుకుంటున్నాడట. దేశం విడిచి పారిపోయిన ఈ ఆర్థిక నేరగాడు లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. అక్షర్ X కుల్‌దీప్.. నేను మాత్రం అలా చేయను: రవిశాస్త్రి
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన చైనామన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్‌కు తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతోపాటు మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌ను ఫైనల్ XIలోకి టీమ్‌ఇండియా తీసుకుంది. దీంతో కుల్‌దీప్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే బౌలర్‌గా అక్షర్ పటేల్ పెద్దగా రాణించకపోయినా.. బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంతో విమర్శల నుంచి తప్పించుకోగలిగాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఇన్ఫోసిస్‌కు మరో కీలక ఉద్యోగి గుడ్‌బై.. ప్రెసిడెంట్ మోహిత్ జోషీ రాజీనామా
ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నుంచి నెలల వ్యవధిలో మరో ఉన్నతాధికారి వైదొలిగాడు. సంస్థ ప్రెసిడెంట్ మోహిత్ జోషీ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీకి కంపెనీ శనివారం సమాచారమిచ్చింది. ‘‘ఇన్ఫోసిస్ అధ్యక్షుడు మోహిత్ జోషీ నేడు రాజీనామా చేశారు. మార్చి 11 నుంచి ఆయన సెలవులో ఉండనున్నారు. జూన్ 9, 2023.. కంపెనీలో ఆయన చివరి పనిదినం’’ అని సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఫలించిన ఆమె పోరాటం.. ఇక అక్కడ మహిళలూ టాప్‌లెస్‌గా ఈతకొట్టొచ్చు..!
స్విమ్మింగ్ పూల్స్ వద్ద దుస్తుల విషయంలో వివక్ష చూపుతున్నారంటూ ఓ మహిళ చేసిన పోరాటానికి అధికారులు దిగొచ్చారు. పబ్లిక్ పూల్స్ (Public Swimming Pools)లో పురుషులతో సమానంగా ఇక మహిళలు కూడా టాప్‌లెస్ (Topless Swimmimg)గా ఈతకొట్టేందుకు అనుమతి కల్పించారు. జర్మనీ రాజధాని బెర్లిన్ (Berlin) నగర అధికారులు ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Kejriwal: దిల్లీని గెలవాలనుకుంటే..! మోదీకి కేజ్రీవాల్ ఇచ్చిన సలహా
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/03/2023)
-
Sports News
భిన్నమైన మేళవింపులు ప్రయత్నిస్తున్నాం.. కోచ్ రాహుల్ ద్రవిడ్
-
World News
Russia: ఐఫోన్లను పడేయండి.. అధికారులకు రష్యా అధ్యక్ష భవనం ఆదేశాలు
-
Movies News
Social Look: తారల సరదా.. డాగ్‌తో తమన్నా.. పిల్లితో మృణాళ్!
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్