Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 12 Mar 2023 17:11 IST

1. సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. ఏఐజీలో వైద్యపరీక్షలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వైద్య పరీక్షల కోసం ప్రగతిభవన్‌ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ‘‘సీఎం కేసీఆర్‌కు పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడింది. కడుపునొప్పితో సీఎం ఆసుపత్రికి వచ్చారు. ఎండోస్కోపి, సిటీ స్కాన్‌ చేశాం. కేసీఆర్‌ కడుపులో చిన్న అల్సర్‌ ఉన్నట్టు గుర్తించాం. సీఎంకు మిగతా వైద్య పరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జనసేనలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు.. పవన్‌ సమక్షంలో చేరిక

ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, వైకాపాకు చెందిన పలువురు నేతలు జనసేనలో చేరారు. ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేన కండువా కప్పుకొన్నారు. వారితో పాటు భీమిలి వైకాపా నేతలు శ్రీచంద్ర రావు, దివాకర్‌ తదితరులు పార్టీలో చేరారు. వాళ్లందరినీ పవన్‌ సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నా: ఎమ్మెల్యే రాజయ్య

ఇటీవల జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ధర్మాసాగర్‌ మండలం జానకీపురం గ్రామ సర్పంచి పూసపల్లి నవ్య ఇంటికి ఆదివారం మధ్యాహ్నం రాజయ్య వచ్చారు. దీంతో సర్పంచి ఇంటి వద్దకు పోలీసులు భారాస కార్యకర్తలు చేరుకున్నారు. అధిష్ఠానం సూచన మేరకు, నవ్య భర్త ప్రవీణ్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినట్లు రాజయ్య తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామిపై కేసు నమోదు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్‌ పళనిస్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘అమ్మా మక్కళ్‌ మున్నేట్ర కజగం పార్టీకి చెందిన కార్యకర్తపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన మీద కేసు పెట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో పళనిస్వామి చెన్నై నుంచి మధురైకి వెళ్తున్నారు. శివగంగలో జరగనున్న ఓ పార్టీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పయనమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తీరిన టెస్టు సెంచరీ దాహం.. మూడున్నరేళ్ల తర్వాత విరాట్ శతకం

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) దాదాపు 1200 రోజుల నుంచి మోస్తున్న బరువును దింపేసుకున్నాడు. వన్డేలు, టీ20ల్లో సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరు కోసం దాదాపు మూడున్నరేళ్లపాటు వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా ఆసీస్‌తో అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కారు టైరు పేలడం మానవ నిర్లక్ష్యమే.. బీమా సంస్థ పరిహారం చెల్లించాల్సిందే..!

వాహనం టైరు పేలడం యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ కాదని.. అది మానవ నిర్లక్ష్యమేనని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి బీమా సంస్థ పరిహారం అందించాలని ట్రై బ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. కారు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం విపత్తు కిందకే వస్తుందని, అందుకు పరిహారం చెల్లించేందుకు నిరాకరిస్తూ ఓ బీమా సంస్థ చేసిన అప్పీలును బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విమానంలో వ్యక్తి స్మోకింగ్‌.. కాళ్లు, చేతులు కట్టేసి కూర్చోబెట్టి..!

విమానాల్లో ఇటీవల కొంతమంది ప్రయాణికుల ప్రవర్తన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడం, నిబంధనలను అతిక్రమించే ఘటనలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటు పౌరవిమానయాన సంస్థలు కూడా హెచ్చరిస్తూనే ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చరిత్రలో భయంకర అగ్ని పర్వతాలు.. వణుకు పుట్టించాయి!

ఇండోనేసియా(Indonesia)లోని మౌంట్‌ మెరాపి శనివారం విస్ఫోటం చెందింది. దాంతో వేడి వాయువులు, లావా, బూడిద వెలువడుతున్నాయి. ఫలితంగా సమీప పరిసర ప్రాంతాలు సూర్యకాంతికి కూడా నోచుకోలేదు. చరిత్రలో కొన్ని భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించాయి. వాటి కారణంగా అనేక చోట్ల భారీ బిలాలు, సరస్సులు, కొత్త ప్రదేశాలు ఏర్పడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. నా సమాధి తవ్వాలని కాంగ్రెస్‌ కలలు కంటోంది.. కానీ..!

తనకు గోతులు తవ్వాలని కాంగ్రెస్‌, కలలు కంటోందని.. తాను మాత్రం దేశాభివృద్ధి, పేదల వికాసంలో నిమగ్నమై ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రూ.199కే డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5 సహా 18 ఓటీటీలు!

ఇరవై ఐదుకి పైగా ఓటీటీల్లోని కంటెంట్‌ను ‘టాటా ప్లే బింజ్‌’ (Tata Play Binge) ఒకే యాప్‌, వెబ్‌సైట్‌ కిందకు తీసుకొచ్చింది. సులభంగా చెప్పాలంటే ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో అనేక ఓటీటీ (OTT Services)ల్లోని కంటెంట్‌ను వీక్షించొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టాటా ప్లే డీటీహెచ్‌ కస్టమర్లకు కూడా బింజ్‌ అందుబాటులో ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని