Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...
1. ఆస్కార్‌కు ప్రతిపాదనలు పంపితే.. మోదీకి ఉత్తమ నటుడు అవార్డు: మంత్రి కేటీఆర్
దేశ సంపదను ప్రధాని మోదీ.. అదానీకి దోచిపెడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. భాజపా తెలంగాణకు పట్టిన దరిద్రమని దుయ్యబట్టారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు 12 మంది తెదేపా సభ్యుల సస్పెన్షన్
శాసనసభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 12 మంది తెదేపా ఎమ్మెల్యేలు, వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. సస్పెండైన తెదేపా ఎమ్మెల్యేల్లో బెందాళం అశోక్, కింజరాపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. పేపర్ లీకేజీ వ్యవహారం.. మరోసారి అట్టుడికిన టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాలు
తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్నంతా ఆందోళనలతో అట్టుడికిన హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాలు రెండో రోజూ నిరసనలతో హోరెత్తిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. నాన్న హత్యలో వారి ప్రమేయం ఉందని నమ్ముతున్నా: వివేకా కుమార్తె సునీతారెడ్డి
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య(Viveka Murder Case) చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన కుమార్తె సునీతారెడ్డి అన్నారు. ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని చెప్పారు. వివేకా వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఐసీసీ ర్యాంకులు.. అశ్విన్ నంబర్‌వన్.. దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీలో అదరగొట్టిన భారత ఆటగాళ్లు ఐసీసీ (ICC) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకొచ్చారు. తాజాగా ఐసీసీ ర్యాంకులను విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో.. ఆసీస్‌తో నాలుగో టెస్టులో సెంచరీ సాధించిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (705) ఏకంగా ఎనిమిది స్థానాలను మెరుగు పర్చుకున్నాడు. ప్రస్తుతం 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. రైతులకు నెల నెలా ₹3వేల పింఛన్.. అర్హత ఏంటి? ఎంత చెల్లించాలి?
రైతుకు ఆసరా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టింది. రైతుల రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను ఇస్తోంది. పెట్టుబడి సాయం కోసం పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే, వయసు పైబడిన రైతులకు ఆర్థికంగా తోడుగా నిలవాలనే ఉద్దేశంతోనే అమలు చేస్తున్న మరో పథకమే ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఫ్లూ కలవరం.. పుదుచ్చేరిలో పాఠశాలలకు సెలవులు..!
దేశంలో పలుచోట్ల హెచ్3ఎన్2 క్రమంగా విజృంభిస్తుండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తి కొనసాగుతున్నందున పది రోజులపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అన్ని స్కూళ్లలో 8వ తరగతి వరకు సెలవులు ఇస్తున్నామని.. మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కేరళ అసెంబ్లీలో గందరగోళ దృశ్యాలు.. ఎమ్మెల్యేలను బలవంతంగా తరలించి..!
కేరళ అసెంబ్లీ(Kerala Assembly)లో బుధవారం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. స్పీకర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన విపక్ష ఎమ్మెల్యేలను.. పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. భద్రతా సిబ్బంది వారిని తీసుకెళ్తోన్న తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. జర్మనీలో భారీ ఉప్పు కొండ.. దాంతో 114 ఫుట్ బాల్ మైదానాలను కప్పేయొచ్చు!
తమ అవసరాల కోసం భూమి లోపల దొరికే ఖనిజ లవణాలను వెలికి తీస్తుంటారు. అలా తీసిన ముడి సరకులో ఇతర పదార్థాలు కూడా కలిసుంటాయి. వాటిని శుద్ధి చేసి వేరు చేయాల్సి ఉంటుంది. జర్మనీ(Germany)లో కొన్ని వేల టన్నుల ఉప్పు(Salt)ను వేరు చేసి కొండగుట్టలా మార్చారు. సెంట్రల్ జర్మనీ(Germany)లోని హెర్రింజన్ పట్టణంలో భారీ ఉప్పు(Salt) కొండ దర్శనమిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. అశ్విన్ ‘ట్విటర్ ఖాతా’ కష్టాలు.. పరిష్కరించాలని మస్క్‌కు వేడుకోలు
టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఇంటర్వ్యూలు, వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉండేందుకు ఇష్టపడతాడు. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ముగియడంతో అశ్విన్‌కు విరామం దొరికింది. దీంతో ట్విటర్‌లోకి వచ్చేసిన అశ్విన్.. తన ఖాతా సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎలాన్ మస్క్‌కు రిక్వెస్ట్ పెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: అషు కారు ప్రయాణం.. నిఖిత ‘రెడ్’ హొయలు
-
India News
Viral video: మహిళను కారులోకి లాక్కెళ్లి.. కొట్టడంపై DCW సీరియస్!
-
Sports News
Steve Smith: సూపర్ మ్యాన్‌లా స్మిత్.. క్యాచ్ ఆఫ్ ది సెంచరీ చూస్తారా?
-
Politics News
Komatireddy: రెండ్రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేస్తా: ఎంపీ కోమటిరెడ్డి
-
Sports News
IND vs AUS: విరాట్ ఔట్.. గావస్కర్ తీవ్ర అసంతృప్తి!
-
World News
Modi: చైనా నెటిజన్లలోనూ ‘మోదీ’ పాపులర్.. నిక్‌నేమ్ కూడా పెట్టారట..!