Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. పనితీరు మార్చుకోండి.. 32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహణలో 32 మంది ఎమ్మెల్యేలు వెనకబడ్డారని సీఎం జగన్ వెల్లడించారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమం అమలు తీరు ఎలా ఉందనేదానిపై ప్రతి 3 నెలలకోసారి సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమం ఆశించిన రీతిలో జరగట్లేదని భావించిన సీఎం జగన్.. నిఘావిభాగం ద్వారా ప్రజాప్రతినిధుల పనితీరుపై సర్వే నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. పాలు, కూరగాయల వాళ్లకీ ఉద్యోగులు లోకువయ్యే పరిస్థితి: బండి శ్రీనివాసరావు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూలి కన్నా దారుణంగా ఉందని ఏపీ ఎన్జీవో సంఘం నేత బండి శ్రీనివాసరావు అన్నారు. పాలు, కూరగాయలు, బ్యాంకుల వాళ్ల దగ్గర కూడా ఉద్యోగులు లోకువయ్యే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. నన్ను విమర్శించండి.. కానీ, ఫ్యామిలీ జోలికొస్తే..: ఎలాన్ మస్క్
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ (Twitter) గురువారం పలువురు జర్నలిస్టుల ఖాతాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అమెరికాలో ప్రధాన పత్రికలైన న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన పాత్రికేయులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే, దీనికి కారణాన్ని మాత్రం ట్విటర్ (Twitter) ప్రత్యేకంగా వెల్లడించలేదు. ఇటీవలి కాలంలో ట్విటర్ (Twitter) అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk)తో పాటు సామాజిక మాధ్యమంలో చేస్తున్న మార్పులపై వీరు కథనాలు రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ముగిసిన మూడో రోజు ఆట.. బంగ్లా లక్ష్యం 513 పరుగులు
భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసమయానికి 12 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. మిగిలిన రెండు రోజుల్లో ఇంకా 471 పరుగులు చేస్తే బంగ్లా విజయం సాధిస్తుంది. అంతకుముందు శుబ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా శతకాలు సాధించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. జారిపడ్డ శశిథరూర్.. కాలికి గాయం
కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కాలికి గాయమైంది. గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన.. మెట్లు దిగుతుండగా కాలుజారి కిందపడ్డారు. ఈ క్రమంలో ఎడమ కాలి మడమ బెణికింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్నందున నియోజవర్గ పరిధిలో తాను హాజరుకావాల్సి ఉన్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు శశిథరూర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ‘కరెంట్ చౌర్యం.. హత్యానేరమేం కాదు’: 16ఏళ్ల శిక్ష తగ్గించిన సుప్రీంకోర్టు
విద్యుత్ చౌర్యం కేసులో ఓ వ్యక్తికి 18 ఏళ్ల శిక్ష విధిస్తూ కింది కోర్టులు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) తప్పుబట్టింది. కరెంట్ చోరీ (Power Theft).. హత్యా నేరమేమీ కాదని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం అతడి శిక్షను రెండేళ్లకు తగ్గించింది. ఈ కేసులో హైకోర్టు సరైన తీర్పు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఫిఫా ఫైనల్‌కు అర్జెంటీనా.. ట్రెండింగ్‌లో SBI పాస్‌బుక్!
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ‘ఫుట్‌బాల్(Football)’ మేనియా సాగుతోంది. ఖతార్ వేదికగా ఫిఫా ప్రపంచ కప్(FIFA World Cup 2022) పోటీలు జరుగుతోన్న నేపథ్యంలో.. సాకర్ అభిమానుల హడావుడి అంతా ఇంతా కాదు. భారత్‌లోనూ ఈ జోష్ కనిపిస్తోంది. ఇటీవల సెమీ ఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియాపై అర్జెంటీనా(Argentina) విజయం సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. టెస్టుల్లో తొలి శతకం బాదిన గిల్.. ఇదే జోరు కొనసాగిస్తే కేఎల్‌కు ఎసరు!
దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న శుబ్‌మన్ గిల్ (Shubman Gill) వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే వెనుదిరిగినా .. రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలగా ఆడి శతకం పూర్తి చేసుకున్నాడు. 147 బంతుల్లోనే అతడు మూడంకెల స్కోరును అందుకున్నాడు. టెస్టుల్లో అతడికిదే తొలి శతకం కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. దిల్లీలో ఘోరం..విద్యార్థినిని మొదటి అంతస్తు నుంచి విసిరేసిన టీచర్
దేశ రాజధాని దిల్లీ (Delhi)లో ఘోరం జరిగింది. చదువు చెప్పాల్సిన టీచరే.. ఓ విద్యార్థినిని మొదటి అంతస్తు కిటికీ నుంచి కిందికి విసిరేసింది. తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్ దిల్లీ (Central Delhi) పాఠశాలలో బాధిత విద్యార్థిని ఐదో తరగతి చదువుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. అర్జున్‌పై ఆ ఒత్తిడి వద్దు.. కుమారుడి తొలి శతకంపై స్పందించిన సచిన్
గోవా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న అర్జున్ తెందూల్కర్ గుజరాత్‌పై తన తొలి మ్యాచ్‌లో రంజీ శతకాన్ని నమోదు చేశాడు. దీనిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు, సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. 1988 రంజీ అరంగేట్ర మ్యాచ్‌లో సచిన్ తెందూల్కర్ సైతం ఇదే విధంగా శతకం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా తన కుమారుడి విషయంలో సచిన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అర్జున్‌పై ఒత్తిడి లేకుండా చూసేందుకే తాను ప్రయత్నిస్తానని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Justin Trudeau : నిజ్జర్ విషయంలో అమెరికన్లు మాతోనే : జస్టిన్ ట్రూడో
-
Asian Games: షూటింగ్లో మరో రెండు స్వర్ణాలు.. టెన్నిస్‌లో రజతం
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 19,550 ఎగువన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి