Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. Chandrababu: ప్రజలు గమనించారు.. జగన్ మళ్లీ గెలిచే పరిస్థితి లేదు: చంద్రబాబు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ప్రజా విజయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ప్రజా తీర్పును జగన్ సర్కార్‌పై తిరుగుబాటుగా చూడాలన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్లు రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారని.. చైతన్యం, బాధ్యతతో వచ్చి ఓట్లేశారన్నారు. నాలుగేళ్లలో జగన్ విధ్వంస పాలన కొనసాగించారని చంద్రబాబు విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. Mohan Babu: చిరంజీవికి నాకూ మధ్య ఎలాంటి విభేదాల్లేవు: మోహన్‌బాబు
చిరంజీవి (Chiranjeevi)తో తనకు ఎలాంటి విభేదాల్లేవని స్పష్టం చేశారు నటుడు మోహన్‌బాబు (MohanBabu). వీలు కుదిరినప్పుడల్లా మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉంటామని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్‌బాబుని చిరంజీవితో నెలకొన్న వివాదాలపై స్పందించమని విలేకరి కోరగా.. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. Trump - Musk: అదే జరిగితే ట్రంప్ మళ్లీ గెలవడం ఖాయం.. మస్క్ జోస్యం
తనని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదే జరిగితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. RBI Ombudsman: ఫిర్యాదు చేసినా మీ బ్యాంక్ స్పందించడం లేదా? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
ఒకప్పటితో పోలిస్తే బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. బ్యాంకులతో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు, ఫోన్ పే, గూగుల్ పే వంటి నగదు చెల్లింపు సంస్థలు అందుబాటులోకి రావడంతో బ్యాంకింగ్ సేవలు సులభతరం అయ్యాయి. ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తినా క్షణాల్లో పరిష్కరించుకునే అవకాశమూ లభిస్తోంది. అయితే, కొన్ని ఫిర్యాదుల విషయంలో మాత్రం నెలలు గడిచినా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి సమాధానం దొరకదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి దిల్లీ పోలీసులు
దిల్లీ పోలీసులు ఆదివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటికి చేరుకున్నారు. మహిళలపై ఇంకా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంపై ఆయన నుంచి స్పష్టత తీసుకోవడానికి పోలీసులు ఈరోజు ఇంటికి చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. Accident: కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి!
బంగ్లాదేశ్(Bangladesh)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. Kishan Reddy: స్వప్నలోక్ అగ్నిప్రమాదం.. చాలా దురదృష్టకరం: కిషన్‌రెడ్డి
రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భవనాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని తెలిపారు. ఆదివారం స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. Nani - Dasara: టీమ్ ఇండియా స్టార్‌లకు పేర్లు పెట్టిన నాని.. ఎవరికేం పేరు ఇచ్చాడంటే?
‘ధరణి’ అవతారం ఎత్తి ఈ నెల 30న థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాడు నాని. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘దసరా’ (Dasara Movie) సినిమా ఆ రోజే వస్తోంది మరి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నాని ఆదివారం విశాఖపట్నం వచ్చాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే ప్రారంభానికి ముందు కాసేపు సందడి చేశాడు. మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, ఎమ్మెస్కే ప్రసాద్, ఆరోన్ ఫించ్‌తో మాట్లాడాడు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు నాని. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. Putin: మేరియుపోల్‌లో పుతిన్ పర్యటన.. ఉక్రెయిన్ యుద్ధంలో నాశనమైన నగరం
సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దురాక్రమణ (Ukraine Crisis) మొదలుపెట్టిన రష్యా.. అనేక నగరాల్లో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తీర ప్రాంతమైన మేరియుపోల్‌నూ పూర్తిగా నాశనం చేసింది. మరుభూమిగా మారిన ఆ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) ఆకస్మిక పర్యటన చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం ముగిసిన తర్వాత ఆక్రమిత భూభాగాల్లో పుతిన్ పర్యటించడం ఇదే తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. MLC Kavitha: దిల్లీకి బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దిల్లీకి బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. దిల్లీ మద్యం కేసులో (Delhi Liqour Scam) ఈనెల 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Sriharikota: నింగిలోని దూసుకెళ్లిన ఎన్వీఎస్-01
-
Politics News
Karnataka: సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు నీటిపారుదల
-
Crime News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
-
Sports News
MS Dhoni: రిజర్వ్‌డే మ్యాచ్.. గత చరిత్రను ధోనీ తిరగరాస్తాడా...?
-
India News
Population Census: లోక్‌సభ ఎన్నికల ముందు జనాభా లెక్కింపు లేనట్లే..!
-
Movies News
Telugu movies: చిన్న చిత్రాలదే హవా.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!