Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 20 Mar 2023 17:02 IST

1. ఇది ఆరంభమే.. వచ్చే సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇవాళ చీకటి రోజు అని తెదేపా అధినేత చంద్రబాబు  అన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవమానాలకు గురిచేసినా వెనక్కి తగ్గబోమని.. రాష్ట్ర ప్రజల కోసం భరిస్తామని చెప్పారు. పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆరంభం మాత్రమేనని.. వచ్చేది సునామీ అన్నారు. ఆ సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల్లేకుండా ఈ దాడులేంటి?: పవన్‌కల్యాణ్‌

ఏపీ అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు. అర్థవంతమైన చర్చలు లేకుండా ఈ దాడులేంటని వైకాపాను ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ఎమ్మెల్యేపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పేపర్‌ లీకేజీ కేసు.. సిట్‌ నోటీసులకు భయపడేది లేదు: రేవంత్‌రెడ్డి

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్‌ లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్‌ లీకేజీపై ఆరోపణలు చేస్తున్న వారందరికీ సిట్‌ నోటీసులు జారీ చేస్తోంది. దీనిలో భాగంగా తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సహా మరికొందరికి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. 2016 గ్రూప్‌-1 ఫలితాల్లోనూ అక్రమాలు జరిగాయని.. కేటీఆర్‌ ఆఫీస్‌ నుంచే లీకేజీ వ్యవహారం మొత్తం నడిచిందని ఆదివారం రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ధోనీ నా ఆస్తులేం తీసుకోలేదు..: హర్భజన్‌

టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ (MS Dhoni)తో మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh)కు విభేదాలున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై భజ్జీ తాజాగా స్పందించాడు. ‘ధోనీతో గొడవలు ఉండటానికి ఆయన నా ఆస్తులేం తీసుకోలేదు కదా’ అంటూ వదంతులకు (Rift Rumours) చెక్‌ పెట్టాడు. అసలు వీరి మధ్య విభేదాలున్నట్లు వార్తలు ఎలా వచ్చాయి..? భజ్జీ ఏం చెప్పాడు..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. క్రెడిట్‌ సూయిజ్‌ సంక్షోభానికి బీజం పడింది అక్కడే..!

అమెరికా బ్యాంకింగ్‌ రంగంలో వరుస పతనాలను మరిచిపోక ముందే స్విట్జర్లాండ్‌కు చెందిన అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) అంశం తెరపైకి వచ్చింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ బ్యాంక్‌.. ఇటీవల కాలంలో పతనావస్థకు చేరింది. 2008 నాటి సంక్షోభ పరిస్థితులు మరోసారి తలెత్తకూడదన్న ఉద్దేశంతో స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్విస్‌ కేంద్రంగా పనిచేసే యూబీఎస్‌ గ్రూప్‌తో  (UBS group) చర్చలు జరిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత పర్యటనలో జపాన్‌ ప్రధాని కిషిదా.. మోదీతో భేటీ..!

భారత పర్యటనలో భాగంగా జపాన్‌ (Japan) ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా (Fumio Kishida) సోమవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. భారత్‌-జపాన్‌ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంలో భాగంగా ఇరువురు నేతలు విస్తృత అంశాలపై చర్చలు జరిపినట్లు పీఎం కార్యాలయం వెల్లడించింది. సుమారు 27గంటల పాటు కిషిదా పర్యటన భారత్‌లో కొనసాగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇక సీల్డ్ కవర్లు ఆపేద్దాం: ఓఆర్‌ఓపీ కేసులో ఘాటుగా స్పందించిన సుప్రీం

అర్హులైన మాజీ సైనికులకు వన్‌ ర్యాంకు-వన్‌ పెన్షన్‌ (ఓఆర్‌ఓపీ) బకాయిల గురించిన అభిప్రాయాలను సీల్డ్‌ కవర్‌ (Sealed Cover)లో సమర్పించడంపై సోమవారం సుప్రీంకోర్టు(supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంప్రదాయానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నియంత విలాస నౌక.. నేటికీ సగం నీళ్లలోనే!

ఇరాక్‌పై అమెరికా సంకీర్ణ దళాల దండయాత్రకు నేటికి 20 ఏళ్లు పూర్తయ్యింది. 2003 మార్చి 20న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, పోలాండ్‌లకు చెందిన పదాతిదళాలు ఇరాక్‌లోకి ప్రవేశించాయి. భారీ విధ్వంసాన్ని సృష్టించే ఆయుధాల ఏరివేత, దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ ఉగ్రవాదానికి అందిస్తోన్న మద్దతు నిర్మూలన, ఇరాకీయులను విముక్తులను చేయడమే లక్ష్యంగా చెబుతూ.. దాదాపు 1.70 లక్షలకుపైగా సైనికులు ఇరాక్‌ వీధుల్లో అడుగుపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘సూర్య’ ప్రతాపం టీ20లకేనా?.. SKYని డీకోడ్‌ చేసేశారా?

టీ20ల్లో ఆడటం చాలా కష్టం.. ఈ పొట్టి క్రికెట్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట అదరగొడుతున్న సూర్య కుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav).. వన్డేల్లోకి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాడు. మెరుపుల సంగతి పక్కన పెడితే.. కనీసం పరుగులు రావడం లేదు. దీంతో SKYకి ఏమైంది అనే చర్చ మొదలైంది! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అమృత్‌పాల్‌ కోసం మూడో రోజు వేట.. మామ, డ్రైవర్‌ లొంగుబాటు

పరారీలో ఉన్న వివాదాస్పద మతబోధకుడు, ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) కోసం పంజాబ్‌ పోలీసుల (Punjab Police) వేట మూడో రోజు కొనసాగుతోంది. రహదారులపై భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానంగా ఉన్న ప్రతి వాహనాన్ని ముమ్మరంగా సోదా చేస్తున్నారు. మరోవైపు, అమృత్‌పాల్‌ మామ హర్జిత్‌ సింగ్‌, డ్రైవర్‌ హరప్రీత్‌ సింగ్‌ నిన్న రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జలంధర్‌ రూరల్‌ సీనియర్‌ ఎస్పీ స్వరణ్‌ దీప్‌ సింగ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని