Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. రివ్యూ: రంగ మార్తాండ.. సినిమా ఎలా ఉందంటే?
కృష్ణవంశీ అనగానే ‘గులాబి’, ‘నిన్నే పెళ్లాడతా’ మొదలుకొని విజయవంతమైన ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. కొంచెం విరామం తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమా ‘రంగమార్తాండ’. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కి రీమేక్‌గా రూపొందింది. ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలక పాత్ర పోషించారు. బ్రహ్మానందం తన నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది?కృష్ణవంశీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టేనా? రివ్యూ కోసం క్లిక్ చేయండి
2. Srinivas Goud: పారిపోయినోళ్లను వదిలేసి మహిళపైనా మీ ప్రతాపం?: శ్రీనివాస్‌గౌడ్
దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని ఎందుకు రప్పించడం లేదని భాజపా నేతలను తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్సీ కవితను రోజూ విచారణకు పిలిచి గంటల కొద్దీ కూర్చోబెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. CM Jagan: ‘గోరుముద్ద’ మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు: సీఎం జగన్
పాఠశాల విద్యార్థులు పౌష్టికాహార లోపంతో బాధపడకూడదని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రాగి జావ అందిస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ‘జగనన్న గోరుముద్ద’ పథకంలో భాగంగా రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిల్లలకు సదుపాయాలు కల్పించడం సహా మేథో వికాసం పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. Brahmanandam: చనిపోయే వరకూ కమెడియన్‌గానే ఉంటా: బ్రహ్మానందం
కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రంగమార్తాండ’ (Rangamarthanda). ఈ సినిమా ఉగాది కానుకగా రేపు (మార్చి 22) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో బ్రహ్మానందం (Brahmanandam) మాట్లాడారు. తాను చనిపోయేవరకూ కమెడియన్‌గానే అలరిస్తుంటానని చెప్పారు. కామెడీ బ్రాండెడ్ బ్రహ్మానందంగా ఉండడానికే తాను ఇష్టపడతానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్
ప్రపంచ క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) బ్యాటింగ్ శైలి విభిన్నం. అతడు క్రీజ్‌లో ఉన్నాడంటే ఎంతటి భీకర బౌలర్ అయినా సరే తడబాటుకు గురి కావాల్సిందే. సాధారణంగా బ్యాటర్లు సెంచరీ, డబుల్, ట్రిబుల్ సెంచరీ మార్క్‌కు చేరువగా వచ్చినప్పుడు ఆచితూచి ఆడుతూ ఉంటారు. కానీ, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం బౌండరీతోనే ఆ మార్క్‌ను దాటేయాలని భావిస్తుంటాడు. ఇలాగే పాక్‌తో ముల్తాన్ టెస్టులోనూ సిక్స్‌లు కొట్టేందుకు ప్రయత్నించగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin) వారించాడని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. iQoo Z7 5G: ₹17 వేలకే ఐకూ 5జీ ఫోన్.. ఫీచర్లు ఇవిగో..!
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో సబ్ బ్రాండ్ ఐకూ (iQoo) మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఐకూ జడ్7 5జీ (iQoo Z7 5G) పేరిట ఈ మొబైల్‌ను మంగళవారం లాంచ్ చేసింది. భారత్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఈ మొబైల్‌ను రూపొందించినట్లు ఐకూ వెల్లడించింది. రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తున్న ఈ ఫోన్ విక్రయాలు నేటి నుంచే (మార్చి 21) ప్రారంభమవుతున్నాయి. మరి ఫీచర్లపై లుక్కేద్దామా? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. Amritpal Singh: ‘80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?’.. అమృత్‌పాల్ పరారీపై న్యాయస్థానం ఆగ్రహం
‘‘మీ వద్ద 80 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వారంతా ఏం చేస్తున్నారు? అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh) ఎలా తప్పించుకున్నాడు?’’ అంటూ పంజాబ్- హరియాణా హైకోర్టు(Punjab- Haryana High Court) మంగళవారం పంజాబ్(Punjab) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరారీలో ఉన్న ఖలిస్థానీ(Khalistan) సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. Medvedev: క్షిపణి రావొచ్చు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి: ఐసీసీకి మెద్వదేవ్ వార్నింగ్
క్షిపణులతో దాడి చేయగలమంటూ అంతర్జాతీయ న్యాయస్థానాని(ICC)కి హెచ్చరికలు జారీ చేశారు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్(Dmitry Medvedev). రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin)కు ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఈ తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. Jio 5G: ఏపీలోని మరో 9 పట్టణాల్లో జియో 5జీ సేవలు
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Jio 5g) తన 5జీ సేవలను దేశంలోని మరిన్ని నగరాలు/ పట్టణాలకు విస్తరించింది. నేటి నుంచి (మార్చి 21) మరో 16 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 41 నగరాలు/ పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన 5జీ పట్టణాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 9 పట్టణాలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. TSPSC: రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రాల లీకేజీ కేసులో పోలీసు కస్టడీలో నాలుగో రోజు సిట్ అధికారులు నిందితులను విచారించారు. ఇవాళ్టి దర్యాప్తులో పలు కీలక అధారాలను సిట్ అధికారులు సేకరించినట్టు సమాచారం. పరీక్ష రాసిన గోపాల్, నీలేష్‌కు నీలేష్ సోదరుడు రాజేంద్రనాయక్ డబ్బులు సమకూర్చినట్టు గుర్తించారు. మేడ్చల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్ శ్రీనివాస్ ద్వారా మరికొంత నగదు ఇప్పించినట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
తప్పులు సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం
-
India News
Odisha Train Accident: చనిపోయాడనుకొని ట్రక్కులో ఎక్కించారు.. రైలు ప్రమాద ఘటనలో దారుణం
-
Crime News
Road Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురి దుర్మరణం
-
India News
Indian Railway: కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో పగుళ్లు
-
Ts-top-news News
Yadadri: యాదాద్రిలో భక్తులకు బ్యాటరీ వాహన సేవలు
-
India News
Ashwini Vaishnaw: రెండు రోజులు ఘటనా స్థలిలోనే.. కార్మికుల్లో ఒకడిగా కేంద్రమంత్రి వైష్ణవ్