Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 22 Mar 2023 17:01 IST

1. ఈ ఏడాది రాష్ట ప్రజల జీవితాల్లో వెలుగులు ఖాయం: చంద్రబాబు

శోభకృత్‌ నామ సంవత్సరంలో రాష్ట్రానికి అన్నీ శుభాలే జరగాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘వైకాపా అరాచక పాలనలో రాష్ట్రం నాలుగేళ్లు కష్టాల్లోనే ఉంది. ఈ ఏడాది నుంచి ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు రావడం ఖాయం. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్లేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్‌

భాజపా పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్‌ చేసిన వారిని అరెస్ట్‌ చేస్తున్నారని.. తెలంగాణలో మాత్రం ఏకంగా సీఎం, మంత్రులను దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. పరుష పదాలతో ట్వీట్‌ చేసినందుకు భాజపా పాలిత రాష్ట్రం కర్ణాటకలో కన్నడ నటుడు చేతన్‌ను అరెస్ట్‌ చేసిన విషయాన్ని కేటీఆర్‌ తన ట్విటర్‌లో ప్రస్తావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. టీఎస్‌పీఎస్సీలో అవకతవకలకు ఐటీ శాఖే కారణం: రేవంత్‌రెడ్డి

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో గవర్నర్‌ తనకున్న విచక్షణాధికారాలను వినియోగించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. పేపర్‌ లీకేజీపై కాంగ్రెస్‌ నేతలు బుధవారం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. సిట్‌ విచారణను ఎదుర్కోవాల్సిన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శి, సెక్షన్‌ ఆఫీసర్‌ను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ.. మరో ఆందోళనకు సిద్ధమైన భాజపా

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై భాజపా మరో ఆందోళనకు సిద్ధమైంది. ‘మా నౌకరీలు మాగ్గావాలె’ నినాదంతో ఈనెల 25న ఇందిరాపార్క్‌ వద్ద నిరుద్యోగ మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరుద్యోగ యువతతో కలిసి ధర్నా చేపట్టనుంది. ఈ అంశంపై భాజపా రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో బండి సంజయ్‌ బుధవారం సమావేశమై చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘రోహిత్‌-కోహ్లీ’ మరో రెండు పరుగులు చేస్తే.. ప్రపంచ రికార్డే

భారత్‌-ఆస్ట్రేలియా(IND vs AUS)ల మధ్య సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే చెన్నైలో జరుగుతోంది. తొలి వన్డేలో గెలిచి.. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో విఫలమై చిత్తుగా ఓడిన రోహిత్‌ సేనకు కీలక పోరు ఇది. అయితే.. ఈ సిరీస్‌లో పెద్దగా రాణించని రోహిత్‌-కోహ్లీ (Rohit Sharma-Virat Kohli)ల ముందు ఓ ప్రపంచ రికార్డు వేచి ఉంది. వీరిద్దరూ కలిసి మరో 2 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన జంటగా నిలవనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


రివ్యూ: దాస్‌ కా ధమ్కీ


6. మోదీ వ్యతిరేక పోస్టర్ల కలకలం.. 100 ఎఫ్‌ఐఆర్‌లు, ఆరుగురి అరెస్ట్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి వ్యతిరేకంగా దేశ రాజధానిలో వేల సంఖ్యలో పోస్టర్లు (Posters) వెలవడం కలకలం సృష్టించింది. ‘మోదీ హఠావో దేశ్‌ బచావో’ పేరుతో నగరంలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వీటిపై చర్యలకు ఉపక్రమించిన దిల్లీ పోలీసులు.. ఇప్పటివరకు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దిల్లీలోని బ్రిటన్‌ హైకమిషన్‌ బయట బారికేడ్లు తొలగింపు..!

లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఖలిస్థాన్‌ (Khalistan) మద్దతుదారులు చేసిన దుశ్చర్యను భారత్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. భారత హైకమిషన్‌ వద్ద భద్రతా వైఫల్యంపై తీవ్రంగా మండిపడ్డ భారత్‌.. అటువంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రిటన్‌ రాయబారికి సమన్లు కూడా జారీ చేసింది. ఈ పరిణామాల నడుమ భారత్‌ ప్రతిచర్యకు దిగినట్లు కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ రెండో ర్యాంక్‌ స్థాయి అధికారి హతం..!

పాకిస్థాన్‌(Pakistan)కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ(ISI)లో రెండో అత్యున్నత అధికారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఐఎస్‌ఐలో బ్రిగేడియర్‌ హోదాలో పనిచేస్తున్న ముస్తఫా కమాల్‌ బార్కీ ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ పేర్కొంది. ఈ ఎన్‌కౌంటర్‌ దక్షిణ వజీరిస్థాన్‌లోని అంగూర్‌ అడ్డలో చోటు చేసుకొన్నట్లు పాక్‌ పత్రిక డాన్‌ తెలిపింది. ఈ ఎన్‌కౌంటర్‌ను ముస్తఫా లీడ్‌ చేస్తుండగా తూటాలు తగిలినట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వికెట్ల మధ్య ఫాస్టెస్ట్‌ రన్నర్‌ ఎవరు..? వరస్ట్‌ రన్నర్‌ ఎవరు..? కోహ్లీ సమాధానాలివే..

పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధానత్యనిస్తాడో తెలిసిందే. మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే ఈ ఆటగాడు.. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తుతాడు. సింగిల్స్‌ను డబుల్స్‌గా సులువుగా మార్చుతాడు. ఇలా వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీసే ఎందరో దిగ్గజ బ్యాటర్లతో కోహ్లీ పిచ్‌ షేర్‌ చేసుకున్నాడు. వారిలో మాజీ కెప్టెన్‌ ధోనీ ఒకరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దేశంలో మరిన్ని ఎయిర్‌పోర్టులనూ నిర్వహిస్తాం: అదానీ ఎయిర్‌పోర్ట్స్‌

భవిష్యత్‌లో మరిన్ని ఎయిర్‌పోర్టులను నిర్వహించేందుకు బిడ్లు దాఖలు చేస్తామని అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ (Adani Airports) సీఈఓ అరుణ్‌ బన్సల్‌ తెలిపారు. భారత్‌లో అతిపెద్ద విమానాశ్రయ నిర్వహణ సంస్థగా నిలవడమే తమ లక్ష్యమని బుధవారం ఓ కార్యక్రమంలో వెల్లడించారు. భారత్‌లో మరికొన్ని ఎయిర్‌పోర్టులను కూడా ప్రభుత్వం ప్రైవేటీకరించబోతోందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని