Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 23 Feb 2023 17:11 IST

1. తెదేపాలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) తెలుగుదేశం (TDP) పార్టీలో చేరారు. గురువారం మధ్యాహ్నం గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరిలోని తెదేపా పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. వందలాది వాహనాల్లో కన్నా అనుచరులు నినాదాలు చేస్తూ ఆయన వెంట వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మార్చి2 నుంచి పోలీసు ట్రాన్స్‌పోర్టు విభాగంలో అభ్యర్థులకు ట్రేడ్‌ టెస్ట్‌

మార్చి 2 నుంచి పోలీసు ట్రాన్స్‌పోర్టు విభాగంలో డ్రైవింగ్‌, మెకానిక్‌ అభ్యర్థులకు ట్రేడ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్టు తెలంగాణ పోలీసు నియామక మండలి (TSLRPB) తెలిపింది. వీరితో పాటు విపత్తు నిర్వహణ, ఫైర్‌ విభాగంలో డ్రైవర్‌ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొంది. ప్రాథమిక పరీక్ష పూర్తయి దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.  వివేకా హత్యకేసులో సీఎం జగన్‌ అడ్డంగా దొరికిపోయారు: చంద్రబాబు

అమరావతి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా (BJP)ను వీడి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) తెలుగుదేశం (TDP) పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)  తెలిపారు. కన్నాకు తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. జగన్‌ (CM Jagan) పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆసీస్‌తో సెమీస్‌.. పూజా ఔట్.. హర్మన్‌ ఆడటంపై అనుమానాలు..!

మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens T20 World Cup 2023) టీమ్‌ఇండియా సెమీస్‌కు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో కీలకమైన పోరుకు సిద్ధమవుతోన్న తరుణంలో భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌ టీ20 ప్రపంచకప్‌ నుంచే వైదొలగగా.. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్‌ కౌర్ కూడా ఆసీస్‌తో సెమీస్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటుందో లేదోననే అనిశ్చితి కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విమానం నుంచి దించి పవన్‌ ఖేడా అరెస్టు.. దిల్లీ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత

దేశ రాజధాని దిల్లీ (Delhi)లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌ (Congress) ప్లీనరీ సెషన్‌కు హాజరయ్యేందుకు బయల్దేరిన ఆ పార్టీ సీనియర్‌ నేత పవన్‌ ఖేడా (Pawan Khera)ను దిల్లీ ఎయిర్‌పోర్టులో అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను విమానం నుంచి దించేశారు. హైడ్రామా అనంతరం ఆయనను అస్సాం పోలీసులు అరెస్టు చేసినట్లు కాంగ్రెస్‌ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మరోసారి మంచు గుప్పిట్లో అమెరికా.. 1500కుపైగా విమానాలు రద్దు!

అమెరికా(America) మరోసారి శీతాకాలపు మంచు తుపాను(Winter Storm) గుప్పిట్లో చిక్కుకుంది. అగ్రరాజ్యం పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా మంచు కురుస్తోంది. దీంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వేలాది విమానాలు రద్దయ్యాయి. లాస్ఏంజెల్స్(Los Angeles) సమీపంలో సాధారణంగా వెచ్చగా ఉండే ప్రాంతాలకు భారీ హిమపాతం హెచ్చరికలు జారీ అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పన్నీర్‌కు సుప్రీం షాక్‌.. పళనికే అన్నాడీఎంకే పగ్గాలు

తమిళనాట అన్నాడీఎంకే (AIADMK) ఆధిపత్య పోరులో మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో గట్టి ఎదురుదెబ్బ తగలిగింది. పార్టీ జనరల్‌ సెక్రటరీగా ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ఎన్నిక సరైందేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ కొనసాగేలా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఏకకాలంలో సమస్యల పరిష్కారం.. భారత్‌తో భవిష్యత్తుపై ఆశ!

భవిష్యత్తుపై భారత్‌ ఆశను కలిగిస్తోందని మైక్రోసాఫ్ట్‌(Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్(Bill Gates) పేర్కొన్నారు. ప్రపంచం అనేక సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలోనూ పెద్ద సమస్యలను ఒకేసారి పరిష్కరించగలదనీ ఆ దేశం నిరూపించినట్లు తాజాగా తన బ్లాగ్‌ ‘గేట్స్ నోట్స్(Gates Notes)’లో తెలిపారు. ఈ క్రమంలోనే వ్యవసాయం, వాతావరణ మార్పుల విషయంలో క్షేత్రస్థాయిలో ఆవిష్కర్తలు, నిపుణులు సాధిస్తోన్న ప్రగతిని పరిశీలించేందుకు త్వరలో భారత్‌కు వస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. రోహిత్‌.. నువ్వు ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టు: భారత క్రికెట్‌ దిగ్గజం

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌పై రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్‌ఇండియా  వరుసగా రెండు టెస్టులను గెలిచింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆసీస్‌పై తొలి టెస్టులో అద్భుత శతకంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌ అందుకొన్నాడు. అయితే, రోహిత్ ఉత్తమంగానే బ్యాటింగ్‌ చేస్తున్నప్పటికీ.. ఓ విషయంలో మాత్రం క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. నా పరువు పోయింది.. రూ. కోటి చెల్లించు..!

ఇద్దరు సీనియర్ అధికారిణుల మధ్య వ్యక్తిగత ఫైట్ కర్ణాటకలో తీవ్ర సంచలనంగా మారింది. రోహిణీ సింధూరి వ్యక్తిగత చిత్రాలను బయటపెడుతూ ఐపీఎస్‌ అధికారిణి రూపా మౌద్గిల్ చేసిన ఆరోపణలు.. ఎన్నికల ముందు బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వాన్ని చికాకుపెడుతున్నాయి. ఇక వీరి వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే తాను పోరాడుతున్నట్లు రూప తాజాగా పోస్టు పెట్టగా.. సింధూరినేమో ఆమెకు లీగల్‌ నోటీసులు పంపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని