Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated : 23 Sep 2022 17:35 IST

1. రెండు రోజుల్లో 1140 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌: హరీశ్‌రావు

రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టత ఇచ్చారు. వైద్య కళాశాలల్లో 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. వీటితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ)లోనూ వైద్యుల కొరత తీర్చేందుకు మరో పది రోజుల్లో వెయ్యి మంది వైద్యులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. చంద్రబాబు హైదరాబాద్‌కు లోకల్‌.. కుప్పంకు నాన్‌లోకల్‌..: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని మహిళల జీవితాల్లో ఎంతో మార్పు కనిపిస్తోందని.. అమ్మఒడి ద్వారా అక్కాచెల్లెళ్లకు తోడుగా నిలబడ్డామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. 45-60 మధ్య వయసు మహిళలకు రూ.18,750 చొప్పున సాయాన్ని విడుదల చేశారు. మొత్తంగా 26.39 లక్షల మందికి రూ.4,949 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. జాతీయ స్థాయిలో మహాకూటమి..? సోనియాతో భేటీ కానున్న లాలూ, నీతీశ్‌..!

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోన్న ప్రధాన రాజకీయ పార్టీలు.. కేంద్రంలో భాజపాను ఎదుర్కొనే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఏకతాటిపైకి వచ్చేందుకు సంప్రదింపులు జరుపుతోన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను దూరం పెడుతూ వస్తున్నాయి. ఇటువంటి సమయంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌, ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికపై అతిగా మాట్లాడొద్దు..!

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సీనియర్‌ నేత శశిథరూర్‌ పోటీ చేయనుండటంపై కొందరు హస్తం పార్టీ నేతలు బహిరంగంగానే విముఖత వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నేత గౌరవ్‌ వల్లభ్‌ ఆయనపై విమర్శలు గుప్పించారు. దీంతో ఇది కాస్తా అంతర్గత విభేదాలకు దారితీస్తుండటంతో అధిష్ఠానం రంగంలోకి దిగింది. అధ్యక్ష ఎన్నికలు, పోటీ చేస్తున్న అభ్యర్థులపై పార్టీ అధికార ప్రతినిధులెవరూ అతిగా మాట్లాడొద్దని గట్టిగానే సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. టికెట్ల విక్రయానికి, హెచ్‌సీఏకు సంబంధంలేదు.. అవన్నీ ఆరోపణలే: అజహరుద్దీన్‌

భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకానికి, హెచ్‌సీఏకు సంబంధం లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ అన్నారు. టికెట్ల విక్రయం బాధ్యతను పేటీఎంకు అప్పగించినట్టు తెలిపారు. టికెట్ల విక్రయంలో పేటీఎం అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించారు. టికెట్లు ఆన్‌లైన్‌లోనే అమ్మామని.. బ్లాక్‌లో అమ్మలేదని చెప్పారు. హెచ్‌సీఏ టికెట్ల విక్రయంపై వస్తున్న వార్తాలన్నీ ఆరోపణలేనన్నారు. బ్లాక్‌లో అమ్మినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


రివ్యూ: దొంగలున్నారు జాగ్రత్త


6. టీమ్‌ఇండియా ఓటములపై దాదా ఏమన్నాడంటే..?

ఆసియాకప్‌ నుంచి టీమ్‌ఇండియా ఓటములు పెరగడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ స్పందించాడు. భారత ఆటగాళ్లు అప్రమత్తమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పరోక్షంగా చెప్పాడు. ముఖ్యంగా పెద్ద టోర్నమెంట్లలో రాణించకపోవడం ఆందోళనకర విషయమని అంగీకరించాడు. విరాట్‌ శతకంపైనా దాదా స్పందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. వెల్లువెత్తిన అమ్మకాలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు పతనం!

రేట్ల పెంపు, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈరోజు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ ఓ దశలో ఏకంగా 1,100 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 300 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌100, నిఫ్టీ మిడ్‌క్యాప్‌100 సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీలోని దాదాపు అన్ని రంగాల సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో చలించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. కేరళలో పీఎఫ్‌ఐ హర్తాల్‌ హింసాత్మకం.. హైకోర్టు సీరియస్‌

అతివాద ఇస్లామిక్‌ సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ దాడులను నిరసిస్తూ శుక్రవారం ఆ సంస్థ కేరళలో చేపట్టిన హర్తాల్‌(ధర్నా) హింసాత్మకంగా మారింది. ఈ దాడులకు వ్యతిరేకంగా పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేపట్టారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఎన్‌ఐఏ దాడులను నిరసిస్తూ పీఎఫ్‌ఐ నేడు కేరళ వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. సీఎం కుర్చీలో శిందే కుమారుడు.. సూపర్‌ సీఎం అంటూ ప్రతిపక్షం విమర్శలు!

మహారాష్ట్రలో మరో రాజకీయ దుమారం రేగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కుమారుడు శ్రీకాంత్‌ శిందే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం వివాదానికి కారణమైంది. దీనికి సంబంధించిన ఫొటో బయటకు రావడంతో విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. సూపర్‌ సీఎం అంటూ ఎద్దేవా చేశాయి. మహారాష్ట్రలోని ఎన్సీపీకి చెందిన రవికాంత్‌ వార్పే ఈ ఫొటోను షేర్‌ చేశారు. ఆ చిత్రంలో ముఖ్యమంత్రి పీఠంపై శ్రీకాంత్‌ శిందే కూర్చుని ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఉక్రెయిన్ యుద్ధం వేళ.. అది మోదీకి మాత్రమే సాధ్యం..!

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఎనిమిది నెలలు కావొస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా భారీస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ సమాజం తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో ఈ రెండింటి మధ్య శాంతి నెలకొల్పడం భారత ప్రధాని మోదీకి మాత్రమే సాధ్యమంటూ మెక్సికో వ్యాఖ్యానించడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని