Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 24 Jan 2023 17:19 IST

1. Rohit Sharma: వన్డేల్లో రోహిత్‌.. మూడంకెల కోసం మూడేళ్ల నిరీక్షణకు తెర!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్లు సెంచరీలతో మోతమోగించారు. మూడేళ్ల నిరీక్షణకు తెర దించుతూ భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ (101) వన్డేల్లో శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 83 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను తాకాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా 2020 జనవరి 19వ తేదీన ఆస్ట్రేలియా మీద చివరిసారిగా రోహిత్‌ మూడంకెల స్కోరును నమోదు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Pawankalyan: తెలంగాణలో ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషం: పవన్‌ కల్యాణ్‌

తెలంగాణ రాజకీయాల్లో జననసేన పాత్రపై ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ భవిష్యత్‌పై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జగిత్యాల జిల్లా నాచుపల్లిలో ఏర్పాటు చేసిన జనసేన తెలంగాణ కార్యనిర్వాహకుల సమావేశంలో పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజారాజ్యం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Twitter: అద్దె చెల్లించని ట్విటర్‌.. కోర్టులో యజమాని దావా

బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలో క్రమంగా కొత్త రూపు సంతరించుకుంటున్న ట్విటర్‌ (Twitter) ఆర్థిక కష్టాలతో సతమతమవుతోంది. చివరకు అద్దె కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్‌ (Twitter) ప్రధాన కార్యాలయానికి సంబంధించిన అద్దెను చెల్లించడంలో తాజాగా విఫలమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Prabhas: ప్రభాస్‌ ‘సలార్‌’లో రాకీభాయ్‌.. ఐదు భాగాల్లో ‘కేజీయఫ్‌’

‘కేజీయఫ్‌2’(KGF2) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. ఈ సినిమాతో యశ్‌(Yash) పేరు ఒక బ్రాండ్‌లాగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రూ.1250కోట్లు వసూళ్లు చేసింది. తాజాగా కేజీయఫ్‌(KGF) అభిమానులకు హోంబాలే ఫిల్మ్స్‌ నిర్వాహకులు అదిరిపోయే న్యూస్‌ చెప్పారు. ‘కేజీయఫ్‌’ మొత్తం ఐదు భాగాల్లో  తీస్తున్నట్టు చెప్పారు. అయితే ఇప్పటికే రెండు భాగాలు విడుదలైన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Google Layoffs: దారుణ పరిస్థితులను నివారించడానికే ఆ నిర్ణయం: పిచాయ్‌

కంపెనీ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు (Layoffs) విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని గూగుల్‌ (Google) సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) అన్నారు. ఈ విషయంలో ‘‘స్పష్టమైన, కచ్చితమైన, ముందస్తుగా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే సమస్య మరింత పెద్దదై పరిస్థితి చాలా దారుణంగా మారి ఉండేది’’ అని ఆయన అన్నట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Andhra News: జీవో నెంబరు1పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు

జీవో నెంబరు1పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదనలు కొనసాగాయి. సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ..నిన్నటి వరకు జీవో నెంబరు 1ని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.  జీవో నెంబరు 1పై కాంగ్రెస్‌, తెదేపా, భాజపా నుంచి కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ముగ్గురు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Rahul Gandhi: రుజువులు అక్కర్లేదు.. దిగ్విజయ్‌ వ్యాఖ్యలను ఖండించిన రాహుల్‌ గాంధీ

మెరుపుదాడుల(సర్జికల్‌  స్ట్రైక్స్‌)పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్ (Digvijaya Singh) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మన సైనికులను కాంగ్రెస్‌ పార్టీ అవమానిస్తోందంటూ భాజపా నేతలు దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) దీనిపై స్పందిస్తూ.. దిగ్విజయ్‌ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఆయన అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Pawan Kalyan: కొండగట్టులో ‘వారాహి’కి పవన్‌ పూజలు.. భారీగా తరలివచ్చిన అభిమానులు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిచారు. అనంతరం తన ప్రచార రథం ‘వారాహి’కి వేదపండితులతో శాస్త్రోక్తంగా పూజలు చేయించిన తర్వాత దాన్ని ఆయన ప్రారంభించారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు కొండగట్టుకు భారీగా తరలివచ్చారు. గజమాలతో ఆయన్ను సత్కరించారు. అభిమానులకు ఓపెన్‌టాప్‌ వాహనం నుంచి పవన్‌ అభివాదం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Shubman Gill: ప్రపంచ రికార్డును సమం చేసి గిల్‌..!

టీమ్‌ ఇండియా యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) మరో రికార్డును బద్దలు కొట్టాడు. 23 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు బాబర్‌ అజామ్‌ పేరిట ఉన్న 360 (3 మ్యాచ్‌ల్లో) పరుగుల రికార్డును సమం చేశాడు. ఇక భారత్‌లో తరపున గతంలో విరాట్‌ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో 283 పరుగులు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Crime news: ‘ఫిబ్రవరి 14కల్లా బాయ్‌ఫ్రెండ్‌ ఉండాల్సిందే..’ కాలేజీ ఫేక్‌ నోటీస్‌పై కేసు నమోదు

ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే(Valentine's Day)కు ముందు తమ కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థినికీ తప్పనిసరిగా బాయ్‌ఫ్రెండ్‌ ఉండాల్సిందేనని యాజమాన్యం ఆదేశించినట్టుగా వచ్చిన ఓ ఫేక్‌ నోటీస్‌ తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారం ఒడిశా(Odisha)లోని జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఎస్‌వీఎం అటానమస్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సంతకంతో ఉన్న ఈ నోటీసు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు