Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 24 Mar 2023 17:06 IST

1. చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంపై తెదేపా అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు గాలి మాత్రమేనని రాబోయే ఎన్నికల్లో సునామీ వస్తుందని వైకాపాను ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. ఈ సునామీలో వైకాపా నేతలు అడ్రస్‌ లేకుండా కొట్టుకొనిపోవడం ఖాయమని అన్నారు. వైకాపా తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి శుక్రవారం తెలుగుదేశంలో చేరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రూ.6,356 కోట్లు మురిగిపోయాయి: ఏపీ ఆర్థికస్థితిపై కాగ్‌ నివేదిక

ఏపీ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్‌ నివేదికను కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్ (కాగ్‌) సమర్పించింది. 2022 మార్చి 31 తేదీతో ముగిసిన సంవత్సరానికి సంబంధించిన నివేదికను కాగ్‌ కార్యాలయం అందజేసింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, రెవెన్యూ, రవాణా తదితర అంశాలపై నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చిన రూ.6,356 కోట్ల గ్రాంట్ మురిగిపోయిందని.. గత ఏడాదితో పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు రూ.24,257 కోట్ల మేర పెరిగాయని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

కాంగ్రెస్‌(Congress) పార్టీకి లోక్‌సభలో పెద్ద షాక్‌ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం(Lok Sabha secretariat)  నిర్ణయం తీసుకుంది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు ఆయనకు రెండెళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన మరుసటి రోజే.. ఆ  తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం లోక్‌సభ సచివాలయం చర్యలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘అతడు ఆరెంజ్‌ క్యాప్‌ గెలిస్తే దిల్లీ క్యాపిటల్సే ఛాంపియన్‌’

క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐపీఎల్‌ (IPL 2023)  సిద్ధమవుతోంది. మార్చి 31 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు తమ తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో చేరిపోయి ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. ఈ సీజన్‌లో ఏ జట్టు విజేతగా నిలుస్తుంది? ఏ ఆటగాడు అత్యధిక పరుగులు చేస్తాడనే వాటిపై అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సాఫ్ట్‌ డ్రింక్స్‌ విషయంలోనూ ‘జియో’ వ్యూహం..!

భారత సాఫ్ట్‌ డ్రింక్స్‌ మార్కెట్లో ఏళ్లుగా విదేశీ కంపెనీలైన కోకాకోలా, పెప్సీదే హవా. సరళీకరణ విధానాలతో దేశంలోకి ప్రవేశించిన ఆ రెండు కంపెనీలు.. తమదైన వ్యూహాలతో మార్కెట్‌పై పట్టు సాధించాయి. మధ్యలో చాలా దేశీయ కంపెనీలు వాటికి గట్టి పోటీనివ్వాలని భావించినా అవేవీ సఫలం కాలేదు. చాలా ఏళ్లు తర్వాత ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్‌ (Reliance) అధినేత ముకేశ్‌ అంబానీ ఒకప్పటి ఫేమస్‌ డ్రింక్‌ ‘కాంపా’ను (Campa drinks) తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Video: 23.23.23.. ఇదీ దేవుడి స్క్రిప్టే జగన్!: చంద్రబాబు

6. జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం (MP)పై అనర్హత వేటు పడింది. అయితే, అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30రోజులు గడువు ఉండటంపై కోర్టు నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ ఆయన అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మా పిల్లలు టిక్‌టాక్‌ వాడరు.. ఆ కంపెనీ సీఈవో ఆసక్తికర సమాధానం..!

ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌(TikTok) ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధం ఎదుర్కొంటోంది. భద్రతా కారణాల దృష్ట్యా పలు దేశాలు దీనిపై చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ సంస్థ సీఈఓ షో జి చ్యూ(Shou Zi Chew) యూఎస్‌ కాంగ్రెస్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్రమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీ పిల్లలు టిక్‌టాక్‌ వాడుతున్నారా..?’ అని కాంగ్రెస్ సభ్యులు ఆయన్ని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆటగాళ్ల పనిభార నిర్వహణ.. అవసరమైతే ఐపీఎల్‌లో ఆడటం మానేయండి: రవిశాస్త్రి

ప్రపంచకప్‌ సమీపిస్తున్నందున అన్ని జట్లు సన్నాహాలు మొదలెట్టాయి. ఇలాంటి తరుణంలో కీలక ఆటగాళ్లు గాయాలబారినపడుతుండటం భారత్‌ని కలవరపెడుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్‌ పంత్ ఎప్పటికి కోలుకుంటాడనే దానిపై స్పష్టత లేదు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా, శ్రేయస్ అయ్యర్‌ అందుబాటులోకి రావడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హిండెన్‌బర్గ్‌ ఎఫెక్ట్‌.. జాక్‌డోర్సే సంపదలో ₹4,327 కోట్లు ఆవిరి!

అమెరికాకు చెందిన ఆర్థిక సేవలు, మొబైల్‌ బ్యాంకింగ్‌ సంస్థ ‘బ్లాక్‌’పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సంపద భారీగా తగ్గింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన వెంటనే బ్లాక్‌ షేర్లు భారీ ఎత్తున పతనమయ్యాయి. దీంతో డోర్సే సంపదలో 526 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.4,327 కోట్లు) ఆవిరయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత్‌పై అమృత్‌పాల్‌ విషకుట్ర ఇదీ..!

అతడి పేరు అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh).. ఏడాది క్రితం వరకు అనామకుడు.. ఎవరో వెనుకుండి కథ నడిపినట్లు దాదాపు ఆరు నెలల్లో పాపులర్‌ అయ్యాడు. భారత్‌ నుంచి రాష్ట్రాన్ని విడదీయాలంటూ పాకిస్థాన్‌ భాషను మాట్లాడటం మొదలుపెట్టాడు. అందుబాటులో ఉన్న అవకాశాలను.. అమాయక ప్రజల భావోద్వేగాలను వాడుకొంటూ ప్రైవేటు సైన్యం ఏర్పాటుకు కుట్రపన్నాడు. అంతేకాదు.. సిక్కుల టాప్‌ సంస్థనే హైజాక్‌ చేయడానికి రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని