Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 24 Nov 2022 17:06 IST

1. పులివెందులోనూ వైకాపాకు ఓటమి తప్పదు: చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 175 స్థానాల్లోనూ గుండు సున్నా తప్పదని తెదేపా అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. ఆఖరికి సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులోనూ ఓటమి తప్పదన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని స్పందన ఇటీవల కర్నూలు పర్యటనలో చూశానని చంద్రబాబు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్‌ నోటీసులు

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో విచారణకు హాజరుకావాలని సిట్‌ పేర్కొంది. ఈనెల 29న బంజారాహిల్స్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించింది. దర్యాప్తులో భాగంగా ఎంపీ రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్‌ సేకరించినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెరపైకి కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. ఇంతకు ఏం జరిగింది..?

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను ఎదుర్కొనేందుకు విపక్షాలకు చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో భాజపాకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో అధికారంలో ఉన్న సొంత పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గ్రామాల వివాదం దీనికి కారణమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌ కొట్టివేత

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురి నిందితుల కస్టడీ పిటిషన్‌ను అవినీతి నిరోధక శాఖ (అనిశా) ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ముగ్గురు నిందితులను ఇదివరకే రెండ్రోజుల కస్టడీకి అనుమతించామని.. మరోసారి కస్టడీకి ఇవ్వడం కుదరని సిట్ అధికారులకు తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి మరింత సమాచారం తెలుసుకోవడానికి సిట్‌ అధికారులకు ఇంతకుముందే రెండ్రోజుల అనుమతిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌కు అప్పగింతపై సుప్రీంకోర్టుకు వెళతా.. అనుమతి కోరిన నీరవ్‌ మోదీ!

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తనను భారత్‌కు అప్పగించాలన్న తీర్పును యూకే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడానికి అనుమతి కోరుతూ లండన్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మానసిక అనారోగ్యం దృష్ట్యా తనను భారత్‌కు అప్పగించొద్దంటూ ఆయన చేసుకున్న విన్నపాన్ని ఇటీవలే కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కృష్ణ కన్నుమూత.. మహేశ్‌బాబు తొలి ఎమోషనల్‌ పోస్ట్‌.. లవ్యూ నాన్న..!

సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం తెలుగు సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది మహేశ్‌బాబు కుటుంబానికి తీరని వేదనను కలిగించింది. సోదరుడు రమేశ్‌బాబు, తల్లి ఇందిర, తండ్రి కృష్ణల మరణాలు ఒకదాని వెంట ఒకటి జరగడంతో మహేశ్‌ మానసికంగా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఇటీవల కన్నుమూసిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేశ్‌బాబు తొలిసారి స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి ₹21 వేలు..?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ  (EPFO)కు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఓ గుడ్‌న్యూస్‌ చెప్పే అవకాశం ఉంది. పెన్షన్‌ స్కీమ్‌కు సంబంధించి ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రూ.15వేలుగా ఉన్న వేతన పరిమితిని రూ.21 వేలకు త్వరలోనే పెంచనుందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులు, యజమానులు చెల్లించే వాటా పెరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గవర్నర్‌ తన హద్దులన్నీ దాటారు.. శరద్‌ పవార్‌ విమర్శలు

ఛత్రపతి శివాజీపై గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ(Bhagat Singh Koshyari) చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌(Sharad pawar) మండిపడ్డారు. గవర్నర్‌ అన్ని హద్దులూ దాటారని విమర్శించారు. అలాంటి వ్యక్తులకు కీలక పదవులు ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు. గత వారం ఔరంగాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శివాజీ మహారాజ్‌ పాత రోజులకే ఓ ఐకాన్‌ అంటూ గవర్నర్‌ కోశ్యారీ చేసిన వ్యాఖ్యల పట్ల ఎన్సీపీతో పాటు ఉద్ధవ్‌ సారథ్యంలోని శివసేన వర్గం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాక్‌ ఆర్మీచీఫ్‌గా ఇమ్రాన్‌ విరోధి అసీమ్‌ మునీర్‌..!

పాక్‌ సైన్యం ఇమ్రాన్‌ఖాన్‌కు పెద్ద షాక్‌ ఇచ్చింది. ఆయనకు బద్ధవిరోధిగా పేరున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ను పాక్‌ ఆర్మీ చీఫ్‌గా నియమిస్తూ ప్రధాని షహెబాజ్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయాన్ని పాక్‌ సమాచారశాఖ మంత్రి మరియం ఔరంగజేబ్‌ ట్విటర్‌లో ప్రకటించారు. తొలుత ఈ పదవి కోసం లెఫ్టినెంట్‌ జనరళ్లు అసీమ్‌ మునీర్‌, షహిర్‌ షంషాద్‌ మిర్జా, అజర్‌ అబ్బాస్‌, నుమాన్‌ మహమ్మద్‌, ఫయాజ్‌ హమీద్‌లు పోటీపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జర్మనీపై సూపర్‌ విక్టరీ: ‘శుభ్రత’తో జపాన్‌ సెలబ్రేషన్స్‌

సాధారణంగా ఆటలో ఏ జట్టయినా సంచలన విజయం సాధిస్తే ఆ తర్వాత ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలుతారు. ఇక అభిమానుల సందడైతే సరేసరి..! బాణసంచా పేల్చుతూ వేడుకలు చేసుకుంటారు. కానీ, జపాన్‌ మాత్రం ఇందుకు భిన్నం. ఫిఫా ప్రపంచకప్‌లో జర్మనీపై చారిత్రక విజయం సాధించిన జపాన్‌.. ‘శుభ్రత’తో సంబరాలు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని