Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Jan 2023 17:12 IST

1. రిపబ్లిక్‌ డే ఘనంగా నిర్వహించాల్సిందే.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

గణతంత్ర దినోత్సవ వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిపబ్లిక్‌ డే వేళ పరేడ్‌ నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని స్పష్టం చేసింది. ఈ వేడుకలకు ప్రజలను అనుమతించాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అవినాష్‌రెడ్డికి మూడు రోజుల క్రితమే మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏకంగా 20 స్థానాలు ఎగబాకిన గిల్‌.. నంబర్‌వన్‌ బౌలర్‌గా సిరాజ్‌

ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ల్లో సత్తా చాటిన టీమ్‌ఇండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ర్యాంకును అందుకున్నాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, హేజిల్‌వుడ్ లాంటి ఆటగాళ్లను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.  729 రేటింగ్‌ పాయింట్లతో సిరాజ్‌ తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా పేసర్‌ హేజిల్‌ వుడ్ 727 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో, న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్ 708 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గూగుల్‌కు అమెరికాలోనూ భారత్‌ తరహా చిక్కులు!

టెక్ దిగ్గజం గూగుల్‌కు అమెరికాలోనూ చిక్కులు మొదలయ్యాయి. భారత్‌ తరహాలోనే అమెరికా ప్రభుత్వం సైతం గూగుల్‌ ఆన్‌లైన్‌ యాడ్‌ మార్కెట్‌ విధానాలను తప్పుబట్టింది. ఈ మేరకు ఎనిమిది రాష్ట్రాలతో కలిసి అక్కడి కేంద్ర ప్రభుత్వ న్యాయ విభాగం కోర్టులో దావా వేసింది. ఆన్‌లైన్‌ యాడ్‌ మార్కెట్‌లో ప్రత్యర్థులను తొలగించేందుకు గూగుల్‌ ప్రయత్నిస్తోందని ప్రభుత్వం దావాలో ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మైక్రోసాఫ్ట్‌ సేవలకు అంతరాయం.. భారత్‌ సహా పలు దేశాల్లో సర్వీసులు డౌన్‌!

ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. భారత్‌ సహా పలు దేశాల్లో అవుట్‌లుక్‌, ఎంఎస్‌ టీమ్స్‌, అజ్యూర్‌, మైక్రోసాఫ్ట్‌ 365 వంటి సేవలు బుధవారం పనిచేయడం లేదు. దీంతో వేలాది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మైక్రోసాఫ్ట్‌ దర్యాప్తు చేపట్టింది. అయితే ఎంతమంది యూజర్లపై దీని ప్రభావం పడిందనేది సంస్థ వెల్లడించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘తూర్పు లద్దాఖ్‌ వద్ద 26 గస్తీ పాయింట్లను కోల్పోయాం’

భారత్‌ తూర్పు లద్దాఖ్‌లోని మొత్తం 65 గస్తీ పాయింట్లలో 26 కోల్పోయిందని అక్కడి సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు ప్రభుత్వానికి గత వారం నివేదిక ఇచ్చారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ‘‘ప్రస్తుతం అక్కడ (తూర్పు లద్దాఖ్‌) కారాకోరం పాస్‌ నుంచి చుమూర్‌ వరకు మొత్తం 65 పెట్రోలింగ్‌ పాయింట్లు ఉన్నాయి. వీటిల్లో భారత్‌ సాయుధ బలగాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం దిల్లీకి చేరుకున్న ఆయన.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేలా వ్యవసాయం, డిజిటల్‌ డొమైన్‌, వాణిజ్యంతో సహా వివిధ రంగాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మాంటేరి పార్క్‌ హంతకుడి నుంచి తుపాకీ లాక్కొన్న యువకుడు.. వీడియో వైరల్‌

అమెరికాలోని మాంటెరీ పార్క్‌లో కాల్పులకు పాల్పడిన వృద్ధుడి నుంచి ఓ యువకుడు ధైర్యంగా ఆటోమేటిక్‌ గన్‌ను లాక్కొన్నాడు. దీంతో సదరు వృద్ధుడు మరింత మంది ప్రాణాలను తీయకుండా కాపాడినట్లైంది. దీంతో ఇప్పుడు ఆ యువకుడి ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకొంటున్నారు. ఆ యువకుడి పేరు బ్రాండన్‌ త్సే. అతడు కుటుంబం అల్‌హాంబ్రాలో ఓ డ్యాన్స్‌ హాల్‌ నిర్వహిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శ్వాసకోశ అనారోగ్యం.. ఉత్తర కొరియాలో మరోసారి లాక్‌డౌన్‌..!

ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల ఇప్పటికీ కరోనా వైరస్ ప్రభావం చూపిస్తోంది. చైనాలో వైరస్ కేసులు ఇంకా భారీగానే ఉంటున్నాయి. ఈ సమయంలో డ్రాగన్ పొరుగు దేశం ఉత్తర కొరియా తన రాజధాని నగరంలో ఐదురోజుల పాటు లాక్‌డౌన్ విధించింది. అందుకు కరోనానే కారణమని అధికారిక ఉత్తర్వుల్లో ఎక్కడా చెప్పలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. సహచరులంతా.. అతడిని మాంత్రికుడిగా అభివర్ణిస్తారు: రోహిత్‌ శర్మ

వరుసగా మూడో సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకొంది. శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్‌లను దక్కించుకొన్న విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌పైనా వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడేళ్ల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో శతకం సాధించాడు. గిల్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తూ టోర్నీలోనే అత్యధిక పరుగుల వీరుడిగా మారాడు. అలాగే కీలక సమయంలో వికెట్లను తీసిన శార్దూల్‌ ఠాకూర్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని