Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 25 Mar 2023 17:05 IST

1. పేపర్‌ లీకేజీకి మంత్రి కేటీఆర్‌ నిర్వాకమే కారణం: బండి సంజయ్‌

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్‌ లీకేజీకి మంత్రి కేటీఆర్‌ నిర్వాకమే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి  సీఎం కేసీఆర్‌ మాట్లాడటం లేదని.. సీఎం కుమారుడు (కేటీఆర్‌) మాత్రమే స్పందిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీని నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద భాజపా చేపట్టిన ‘మా నౌకరీలు మాగ్గావాలే’ దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భాజపాకు ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైంది: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశ యువత చాలా నష్టపోతోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చైనా నుంచి బయటకు వస్తున్న వ్యాపారవేత్తలను ఆకర్షించడంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్ నివేదికపై ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ స్పందించారు. ఎన్‌పీఏ ప్రభుత్వానికి దేశ ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 27న ₹300 దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 27న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన ₹300 దర్శన టికెట్ల కోటాను ఈనెల 27న ఉదయం 11గంటలకు వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు తితిదే వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాహుల్‌పై అనర్హత.. భాజపా సెల్ఫ్‌ గోల్‌: శశిథరూర్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన భారతీయ జనతా పార్టీ (BJP) సెల్ఫ్‌గోల్‌గా అభివర్ణించారు. రాహుల్‌ అనర్హత విషయంలో లోక్‌సభ సచివాలయం గంటల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టిన ఆయన.. ఈ ఒక్క ఘటన విపక్షాలు ఏకమవ్వడానికి కారణమైందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సూర్యకుమార్‌కు అవకాశాలివ్వండి.. ప్రపంచకప్‌లో దుమ్మురేపుతాడు: యువీ

టీమ్ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌  (Suryakumar Yadav) ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని వన్డే జట్టు నుంచి తప్పించి టీ20లకే పరిమితం చేయాలని కొంతమంది మాజీలు, క్రికెట్‌ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, సూర్యకుమార్‌ యాదవ్‌కు భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) మద్దతుగా నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చైనాపై పొగడ్తల వర్షం కురిపించిన యాపిల్‌ సీఈఓ..!

వాణిజ్య యుద్ధం మొదలుకొని.. సాంకేతికపరంగా, భౌగోళిక-రాజకీయపరమైన విషయాల్లో అమెరికా(America), చైనా(China) మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ సమయంలో చైనాలో పర్యటించారు అమెరికా టెక్ దిగ్గజం యాపిల్‌ సీఈఓ టిమ్ కుక్‌. అలాగే డ్రాగన్‌ను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మోదీ కళ్లల్లో నాకు భయం కన్పించింది: రాహుల్‌ గాంధీ

అదానీపై ప్రశ్నించినందుకే కేంద్ర ప్రభుత్వం తనపై అనర్హత వేటు వేసిందన్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ఈ విషయంపై నేడు ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన ఆయన మోదీ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. అదానీ గురించి అడిగినప్పుడు ప్రధాని మోదీ కళ్లల్లో భయాన్ని చూశానని అన్నారు. ఇలాంటి అనర్హతల వంటివి తనను ఏమీ చేయలేవని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నెలాఖరులో గుడ్‌న్యూస్‌.. చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు పెంపు..?

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గానూ కేంద్రం మార్చి నెలాఖరులో కొత్త వడ్డీ రేట్లను సవరించనుంది. జనవరి- మార్చి త్రైమాసికానికి గానూ గతంలో కొన్ని చిన్న మొత్తాల పథకాలపై వడ్డీ రేట్లు పెంచినప్పటికీ.. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన పథకాల జోలికి పోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘చైనాను అభినందిస్తున్నా..!’ బైడెన్‌ వీడియో వైరల్‌

అమెరికా, చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆయా అంశాలపై ఇరు దేశాలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటాయి. అలాంటిది.. ఏకంగా అమెరికా అధ్యక్షుడే చైనాను ప్రశంసించడం గమనార్హం! అదీ.. కెనడా పార్లమెంటు వేదికగా. అయితే, కెనడాకు బదులుగా ఆయన చైనా అని పొరపాటుగా పలకడమే దీనికి కారణం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ సమయంలో బయటకు కూడా రావాలనుకోలేదు: సమంత

మయోసైటిస్‌ వ్యాధి నుంచి క్రమంగా కోలుకుంటున్నట్లు అగ్ర కథానాయిక సమంత తెలిపారు. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తాజాగా ఆరోగ్య పరిస్థితి గురించి సామ్‌ చెప్పుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు