Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 26 Jan 2023 17:00 IST

1. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు: తమిళి సై

తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఈమేరకు పుదుచ్చేరిలో గవర్నర్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని యత్నించారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మీరు అదే ధోరణితో మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని చూడరు: నిప్పులు చెరిగిన పవన్‌

ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ విషయం ఈటల రాజేందర్‌ మాటల్లోనే స్పష్టమైంది: రేవంత్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే ఈటల భాజపాలో చేరారని.. ఆ పార్టీ, కేసీఆర్‌ ఒక్కటే అన్న విషయం ఆయన మాటల్లోనే స్పష్టమైందని వ్యాఖ్యానించారు. భాజపాలో కూడా కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారని.. ఈటల పార్టీలో చేరిన తర్వాతనే ఆయనకు అర్థమైందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 1,363 గ్రూప్‌-3 ఉద్యోగాలకు అప్లై చేశారా? సిలబస్‌ ఇదే.. వేతనం ఎంతంటే?

తెలంగాణలో గ్రూప్‌-3 సర్వీసు ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,363 పోస్టులు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. దరఖాస్తుల పక్రియ ఈ నెల 24 నుంచే మొదలైంది. వీటిలో అత్యధిక ఉద్యోగాలు ఆర్థికశాఖలో ఉన్నాయి. గ్రూప్‌ 3 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022.. విజేతలు వీరే

2022 సంవత్సరానికిగాను క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను ఐసీసీ (ICC) ప్రకటించింది. మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఎంపికగా.. మహిళల క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ నాట్‌ స్కివర్‌ ఎంపికైంది. 2022 సంవత్సరానికి సంబంధించి వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డులు కూడా వీరినే వరించాయి. 2021లోనూ బాబర్‌ అజామ్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

కొవిడ్‌(Covid 19) నివారణకు భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన నాసికా టీకా ‘ఇన్‌కొవాక్(iNCOVACC)‌’ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ(Mansukh Mandaviya), కేంద్ర శాస్త్రసాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌(Jitendra Singh) గురువారం అధికారికంగా విడుదల చేశారు. ముక్కు ద్వారా వేసే ఈ చుక్కల మందును వాషింగ్టన్‌ యూనివర్సిటీ- సెయింట్‌ లూయీస్‌ సహకారంతో భారత్‌ బయోటెక్‌‌(Bharat Biotech) అభివృద్ధి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాక్‌ పాలకుడు గణతంత్ర వేడుకలకు వచ్చిన వేళ..

భారత గణతంత్ర దినోత్సవానికి ఓ దేశాధినేత అతిథిగా రావడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కొవిడ్‌-19 కారణంగా 2021, 2022 రిపబ్లిక్‌ డే పరేడ్‌లకు విదేశీ నేతలు ఎవరూ హాజరు కాలేదు. బరాక్‌ ఒబామా(అమెరికా), నెల్సన్‌ మండేలా(దక్షిణాఫ్రికా), పుతిన్‌(రష్యా), షింజో అబే(జపాన్‌) వంటి మహామహులు గతంలో హాజరయ్యారు. ఒకసారి పాకిస్థాన్‌ పాలకుడు.. మరోసారి చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సైనిక నేత వంటి వారు కూడా పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘మిస్టర్‌ ట్వీట్‌’గా పేరు మార్చుకున్న మస్క్‌.. యూజర్లలో అయోమయం..!

ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో పలు మార్పులకు స్వీకారం చుట్టిన విషయం తెలిసిందే. యూజర్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోల్‌ వంటివి చేపట్టిన ఆయన.. బ్లూటిక్‌కు రుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తన ట్విటర్‌(Twitter) ఖాతాలో పేరును ‘మిస్టర్‌ ట్వీట్‌’గా మార్చుకున్న మస్క్‌.. తిరిగి తన పేరును మార్చుకోలేకపోతున్నానని యూజర్లను తికమక పెట్టే ప్రకటన చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌..

ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త. ఈ ఏడాది ఐపీఎల్ (IPL) 2023లో ఆడతాడో లేదోననే ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే వార్త వెలుగులోకి వచ్చింది. చాలా రోజుల తర్వాత ధోనీ బ్యాట్‌ పట్టాడు. నాలుగుసార్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించిన మిస్టర్‌ కూల్‌.. ఎట్టకేలకు ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. క్వాడ్‌లో భారత్‌ అందుకే చేరింది: పాంపియో

చైనా (China) దురహంకార చర్యలను నిలువరించడానికే క్వాడ్ (Quad) కూటమిలో భారత్‌ చేరిందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో (Mike Pompeo) అన్నారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబించే భారత్‌.. చైనా దుందుడుకు చర్యల కారణంగా తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందని తన తాజా పుస్తకం ‘నెవర్‌ గివ్‌ యాన్‌ ఇంచ్‌: ఫైటింగ్‌ ఫర్‌ ది అమెరికా ఐ లవ్‌’లో పాంపియో  పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని