Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 26 Mar 2023 17:18 IST

1. రైతుల తుపాన్‌ రాబోతోంది.. ఎవరూ ఆపలేరు: కేసీఆర్‌

దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోందని, దాన్నెవరూ ఆపలేరని భారాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రైతు బంధు, 24 గంటల కరెంట్‌ అందిస్తున్నామని, రైతు బీమా ఇస్తూ.. పూర్తిగా పంటను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

కాంగ్రెస్‌ పార్టీ, అగ్రనేత రాహుల్‌ గాంధీపై భాజపా ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున చేసే పోరాటం ఆగదని ఆ పార్టీ నేతలు చెప్పారు. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ ‘సంకల్ప్‌ సత్యాగ్రహ’ పేరుతో కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. గాంధీభవన్‌లోనూ కాంగ్రెస్‌ నేతలు దీక్ష చేపట్టారు. రాహుల్‌ గొంతును అణచివేసి కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేయాలని భాజపా, మోదీ చూస్తున్నారని.. అలాంటి కుట్రలను తిప్పి కొడతామని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు.. 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఐపీఎల్‌ 2023 తర్వాత ధోనీ రిటైర్‌ అవుతాడా? చాట్‌జీపీటీ సమాధానం ఇదే..

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న మహేంద్ర సింగ్‌ ధోనీ.. కేవలం ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌-16 సీజన్‌ తర్వాత ధోనీ..  ఈ మెగా టోర్నీకీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై కెప్టెన్‌ కూల్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ధోనీ అభిమానులు మాత్రం ఈ వార్తలతో ఆందోళనకు గురవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మదుపర్లకు అలర్ట్‌.. అందుకు మార్చి 31 ఆఖరు తేదీ

మార్చి 31 పూర్తయ్యే నాటికి మ్యూచువల్‌ ఫండ్‌ మదుపర్లు నామినీని తప్పనిసరిగా ఎంపిక చేయాలి. లేదా నామినీ అవసరం లేదనైనా డిక్లషరేషన్‌ సమర్పించాలి. లేదంటే వారి ఖాతాలు స్తంభించిపోతాయి. ఫలితంగా అప్పటి వరకు చేసిన పెట్టుబడి, దానిపై వచ్చే రాబడిని తిరిగి పొందడం కుదరదు. గత ఏడాది జూన్‌ 15నే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సూరత్‌ కోర్టులో రాహుల్‌ లాయర్‌ ఎవరు..?

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం రద్దు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘మోదీ(Modi) అనే ఇంటిపేరు’పై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా నమోదైన పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసును నాలుగేళ్లుగా రాహుల్‌ తరపున వాదించిన లాయర్‌ ఎవరు? అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గాంధీ కుటుంబాన్ని BJP నిత్యం అవమానిస్తోంది : ప్రియాంక

గాంధీ కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నోసార్లు అవమానాలకు గురిచేసిందని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) పేర్కొన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబ నేపథ్యాన్ని భరించలేని భాజపా.. ‘అమరుడి కుమారుడు’ అంటూ రాహుల్‌ను నిత్యం కించపరుస్తూనే ఉందన్నారు. రాహుల్‌గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటును వ్యతిరేకిస్తూ దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద కాంగ్రెస్‌ (Congress) నేతలు చేపట్టిన ‘సత్యాగ్రహ దీక్ష’లో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అవయవదానానికి ముందుకు రావాలి.. ప్రధాని మోదీ

అవయవదానాని(Organ Donation)కి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) దేశవాసులకు పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేలా, పౌరులను ఈ దిశగా ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని రూపొందిస్తోందని చెప్పారు. ఆదివారం నిర్వహించిన 99వ ‘మన్‌ కీ బాత్‌(Mann Ki Baat)’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కరోనా(COVID 19) కేసులు పెరుగుతుండటంపైన ప్రజలను అప్రమత్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పుతిన్ కీలక నిర్ణయం.. బెలారస్‌లో అణ్వాయుధాల మోహరింపు

బెలారస్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉంచే యోచనలో ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ (Putin) తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో పాశ్చాత్య దేశాలతో రష్యాకు ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుసార్లు పుతిన్‌ అణ్వస్త్ర ప్రయోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా హెచ్చరిక కూడా అందులో భాగంగానే కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఫుల్‌ స్పీడ్‌తో వికెట్లను తాకిన బంతి.. అయినా నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్‌

క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని నమ్మశక్యం కాని సంఘటనలు చోటుచేసుకుంటాయి. శనివారం న్యూజిలాండ్, శ్రీలంక (New Zealand vs Sri Lanka) మధ్య జరిగిన తొలి వన్డేలోనూ ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌.. 49.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ జరుగుతున్నప్పుడు ఫాస్ట్‌బౌలర్‌ కాసున్ రజితా వేసిన మూడో ఓవర్‌లో నాలుగో బంతిని ఫిన్‌ అలెన్ డ్రైవ్‌ చేయబోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని