Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 26 Sep 2023 17:10 IST

1. KTR: అమృతకాల సమావేశాల్లో తెలంగాణపై మోదీ విషం చిమ్మారు: మంత్రి కేటీఆర్‌

అమృతకాల సమావేశాల్లో ప్రధాని మోదీ తెలంగాణపై ఎందుకు విషం చిమ్మారని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ అంటే చాలు.. భాజపా నేతలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘పదే పదే తెలంగాణ ఏర్పాటును మోదీ కించపరుస్తున్నారు. తెలంగాణపై పగబట్టినట్లు మాట్లాడుతున్నారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని పదే పదే అంటున్నారు.’’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Chandrababu Arrest: ఆంధ్రాలో పంచాయితీ.. అక్కడే తేల్చుకోవాలి: కేటీఆర్‌

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం.. ఆంధ్రా పంచాయితీ అక్కడే తేల్చుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను తెదేపా, వైకాపా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. TS High Court: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై విచారణ వాయిదా

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో విచారణ బుధవారానికి వాయిదా పడింది. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Ap Govt-GPS: మరోసారి జీపీఎస్‌ బిల్లులో మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం

గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌) బిల్లులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. బిల్లులో లోపాలను సవరిస్తూ మరోమారు కేబినెట్‌ ఆమోదానికి పంపించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ఇ-ఫైల్‌ ద్వారా బిల్లును మంత్రులకు సర్క్యులేట్‌ చేసింది. జీపీఎస్‌లో ప్రతిపాదించిన పెన్షన్‌ టాప్‌ అప్‌పై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ ప్రతిపాదనలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Madhya Pradesh Elections: ‘మామ’ మనసులో కుర్చీ టెన్షన్‌.. అసెంబ్లీ సీటుపై సస్పెన్స్‌!

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల (Madhya Pradesh Elections) వేడి రాజుకుంటోంది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు భాజపా (BJP) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు విడతల్లో ఇప్పటికే 78 మంది అభ్యర్థులను ప్రకటించింది. జాతీయ స్థాయి నాయకులను కూడా రంగంలోకి దించుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Nara Lokesh: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: రాష్ట్రపతిని కోరిన లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం తెదేపా ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌లతో కలిసి లోకేశ్‌ రాష్ట్రపతిని కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జగన్‌ పాలన, ప్రతిపక్షాల అణచివేతపై రాష్ట్రపతికి వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ODI World Cup 2023: కపిల్‌ దేవ్‌ కిడ్నాప్‌.. వీడియోతో సహా పోస్టు చేసిన గంభీర్‌..!

భారత్‌లో అక్టోబర్‌ నుంచి ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) ప్రారంభమవుతున్న వేళ మాజీ సూపర్‌ స్టార్‌ కపిల్‌దేవ్‌ (Kapil Dev) కిడ్నాప్‌నకు గురయ్యారు. ఈ విషయాన్ని మాజీ బ్యాటర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) వీడియోతో సహా ట్విటర్‌లో సెప్టెంబర్‌ 25 తేదీన పోస్టు చేశారు. దీనిలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కపిల్‌దేవ్‌ చేతులు బంధించి.. నోటికి గుడ్డ కట్టి బలవంతంగా లాక్కెళుతున్నట్లు ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. IndiGo Chief: అత్యంత పోటీ ఉన్న ఏవియేషన్ మార్కెట్ లో భారత్‌ ఒకటి : ఇండిగో చీఫ్‌

ప్రపంచంలోనే అత్యంత పోటీ ఉన్న ఏవియేషన్‌ (aviation) మార్కెట్ లో భారత్‌ ఒకటిని ఇండిగో (IndiGo) సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ (Pieter Elbers) మంగళవారం అన్నారు.
దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌ (AIMA) సదస్సులో ఆయన మాట్లాడుతూ..‘పౌర విమానయాన (Indian aviation) రంగంలో భారత్‌ ఒక అద్భుతం, ప్రపంచంలోని విమానయాన మార్కెట్లలో ఎక్కువ పోటీ ఉన్న దేశాలలో భారత్‌ ఒకటి’ అని ఆయన అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Vivek Ramaswamy: అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే.. వివేక్‌ రామస్వామి కీలక వ్యాఖ్యలు

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన అమెరికా 2021లో కొవిడ్‌ వల్ల 5.9 లక్షల కోట్ల డాలర్ల సంపదను కోల్పోయింది. అప్పటి నుంచి అగ్రరాజ్యం వృద్ధి రేటు దాదాపు మందగమనంలోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దానిపై రిపబ్లికన్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Asian Games: 10వేల మంది ఉన్న స్టేడియంలో పోయిన ఫోన్‌.. కనిపెట్టారిలా..!

పోగొట్టుకున్న ఫోన్‌ దొరకడం అంటే చాలా కష్టమే..! అదీనూ స్విచ్చాఫ్‌ చేసిన ఫోన్‌ (Phone) రద్దీ ప్రదేశాల్లో పోతే.. ఇక దానిపై ఆశలు వదలుకోవాల్సిందే..! చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games 2022) ఓ క్రీడాకారిణికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 10వేల మంది ఉన్న స్టేడియంలో ఆమె తన మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకుంది. అయితే అదృష్టమేంటంటే.. ఆ ఫోన్‌ ఆమెకు దొరికింది. ఆసియా గేమ్స్‌ వాలంటీర్లు ఎంతో కష్టపడి 24 గంటల్లోనే ఆమె ఫోన్‌ను కనిపెట్టేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని