Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 26 Sep 2022 17:02 IST

1. సమ్మె కోసం ఆర్జీయూకేటీ విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి నచ్చింది: కేటీఆర్‌

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో గత కొంత కాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకుగానూ విద్యార్థులతో నేరుగా మాట్లాడడానికి ఇవాళ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ వర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం ఆర్జీయూకేటీకి చేరుకున్న మంత్రులు విద్యార్థులను కలిసి వారితో మాట్లాడారు. పూర్తిస్థాయి వీసీ, బోధకులను నియమించాలని, ఇతర  డిమాండ్లను పరిష్కరించాలంటూ జూన్‌లో ఆర్జీయూకేటీ విద్యార్థులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ ప్రభుత్వ అప్పీళ్లపై సుప్రీం ఆగ్రహం.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జరిగిన పర్యావరణ నష్టానికి ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లాయర్లకు ఫీజు చెల్లింపులో ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి పర్యావరణ రక్షణపై కనిపించడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలవరం నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ప్రిన్సిపల్‌ బెంచ్‌ ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్లు జరిమానా విధించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. జగన్‌, షర్మిలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదని తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్ పేరు పెడుతూ సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. గులాం నబీ ఆజాద్‌ కొత్త పార్టీ పేరు ఇదే..

కాంగ్రెస్‌తో అయిదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని పార్టీని వీడిన సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యయాన్ని మొదలుపెట్టారు. ‘డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ’ పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. జమ్మూలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆజాద్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ పేరుతో పాటు జెండాను కూడా విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. రాజస్థాన్‌ సంక్షోభం ఎఫెక్ట్‌.. గహ్లోత్‌ను పోటీ నుంచి తప్పిస్తారా?

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపిస్తోంది. రాష్ట్ర పరిణామాల నేపథ్యంలో పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీఎం అశోక్‌ గహ్లోత్‌ పోటీపై అనిశ్చితి నెలకొంది. గహ్లోత్‌ వర్గీయుల మూకుమ్మడి రాజీనామా వ్యవహారంపై అధిష్ఠానం అసంతృప్తి చెందింది. గహ్లోత్‌ వర్గంపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. మరోవైపు, గహ్లోత్‌ను అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఆసీస్‌తో సిరీస్‌ ముగించాం సరే.. భారత్‌కు కలిసొచ్చిందేంటి.. లోపాలేంటి?

ఆసియా కప్‌లో ఘోర పరాభవంతో డీలాపడిన అభిమానులకు.. ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయంతో జోష్ తెచ్చింది టీమ్‌ఇండియా. సరిగ్గా 28 రోజుల్లో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి పోరు.. ఈలోపు దక్షిణాఫ్రికాతో మాత్రమే టీ20 సిరీస్‌ మిగిలి ఉంది. స్వదేశంలోనే సెప్టెంబర్‌ 28 నుంచి సఫారీలతో మూడు టీ20లు ఆడనుంది. ఈ క్రమంలో ఆసీస్‌తో సిరీస్‌లో భారత్‌కు కలిసొచ్చిన సానుకూలాంశాలు ఏమున్నాయి..? పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. సంక్షోభంలో పాకిస్థాన్‌.. నాలుగేళ్లలో ఐదో ఆర్థికమంత్రి రాజీనామా

గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌ (Pakistan) ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం మొదలు ఇటీవల భారీ వరదల వంటి వరస సవాళ్లతో (Economic Crisis) ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో ఆ దేశ ఆర్థికశాఖ మంత్రులు ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేకపోతున్నారు. తాజాగా ఆ దేశ ఆర్థిక మంత్రి (Finance Minister) ఇస్మాయిల్‌ కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా గడిచిన నాలుగేళ్లలోపే ఐదో ఆర్థిక మంత్రి ఆ పదవిని వీడనున్నారు.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. యూఎస్‌ మీడియాపై జై శంకర్ ఘాటు విమర్శలు..!

అమెరికా మీడియాపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ విమర్శలు గుప్పించారు. భారత్‌పై పక్షపాత ధోరణిలో కథనాలు ప్రచురితం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. మీడియాలో రాజకీయాలు నడుస్తున్నాయంటూ.. కశ్మీర్‌ అంశంపై అగ్రదేశంలో జరిగిన చర్చ గురించి స్పందించారు. ‘నేను ఇక్కడి మీడియాను గమనిస్తున్నాను. కొన్ని మీడియా సంస్థల కవరేజ్‌లో పక్షపాత ధోరణి కనిపిస్తోంది’ అని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. డెత్‌ ఓవర్లపై రోహిత్‌ శర్మ ఏమన్నాడంటే..?

నిర్ణయాత్మక పోరులో అద్భుత ప్రదర్శన చేసి రోహిత్‌ సేన సిరీస్‌ను కైవసం చేసుకోవడంతోపాటు టీ20 ప్రపంచకప్‌ ముందు తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది. నిన్న హైదరాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే అన్ని విభాగాల్లో రాణించినప్పటికీ.. టీమ్‌ఇండియాను ఇప్పటికీ డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ ఇబ్బంది పెడుతూనే ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. అణుదాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవల సైనిక సమీకరణ ప్రకటన చేసిన నాటి నుంచి పశ్చిమ దేశాల్లో అణుభయాలు పెరిగిపోయాయి. ఉక్రెయిన్‌ యుద్ధ భూమిలో ఓటమి తప్పించుకోవడానికి రష్యా చిన్నసైజు టాక్టికల్‌  అణు బాంబును వాడొచ్చనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ప్రైవేటుగా ఓ సందేశం రష్యాకు చేరింది. రష్యా అణు యుద్ధం మొదలుపెడితే తీవ్ర పరిణామాలు తప్పవని ఈ సందేశంలో పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని