Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. రూ.6250 కోట్లతో మెట్రో రెండో ఫేజ్.. డిసెంబరు 9న భూమిపూజ: కేటీఆర్
మెట్రో రైలు రెండో విడత పనులకు డిసెంబరు 9న సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. 31 కిలోమీటర్ల చేపట్టే మెట్రో నిర్మాణానికి సుమారు రూ.6,250 కోట్ల ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. వైకాపాను దెబ్బ కొట్టాలంటే ప్రధానికి చెప్పను.. నేనే చేస్తా: పవన్
‘‘వైకాపా రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? మా వాళ్లను బెదిరిస్తారా? మాకు ఎవరూ అండగా ఉండకూడదా? రాజకీయం మీరే చేయాలా? మేం చేయలేమా? చేసి చూపిస్తాం.. ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి తీరుతాం’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తామని.. మాకు ఓట్లు వేసినా, వేయకపోయినా అండగా ఉంటానని చెప్పారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులతో ఆయన సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. సిరిసిల్ల నేతన్నకు ప్రధాని ప్రశంస.. మన్ కీ బాత్‌లో కొనియాడిన మోదీ
జీ20 కూటమికి నేతృత్వం వహించడం భారత్‌కు దక్కిన గౌరవమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై కూటమిలో మనదేశ పాత్ర ఎంతో కీలకం కానుందన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లాకు చెందిన నేతన్న యెల్ది హరిప్రసాద్ తనకు ఓ బహుమతి పంపినట్లు తెలిపారు. జీ-20కి భారత్ నేతృత్వం వహించనున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా జీ-20లోగోను మగ్గంపై నేసి తనకు పంపినట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. దీదీ.. ఆ ధైర్యం ఉంటే అడ్డుకోండి: సువేందు సవాల్
పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో మరోసారి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశం తెరపైకి వచ్చింది. సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోనివ్వమంటూ ఇప్పటికే పలుమార్లు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ తేల్చిచెబుతుండగా.. కమలనాథులు మాత్రం ఈ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. తాజాగా, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని.. ధైర్యం ఉంటే దాన్ని అడ్డుకోవాలని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రోజర్ వీడ్కోలు.. నా జీవితంలో కొంత భాగం అతడితోనే ఉండిపోయింది: నాదల్
రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్ ప్రస్తుత తరంలో టెన్నిస్ దిగ్గజాలు. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన వీరిద్దరిలో రోజర్ ఫెదరర్ ఇటీవల ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో లావెర్ కప్ వేదికగా చివరి మ్యాచ్‌ను ఆడేశాడు. ఈ సందర్భంగా రఫేల్ నాదల్, ఫెదరర్ భావోద్వేగానికి గురై కంటతడిపెట్టిన ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఏప్రిల్-అక్టోబరు మధ్య 17% తగ్గిన బంగారం దిగుమతులు
దేశంలో గిరాకీ తగ్గడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి. 2022 ఏప్రిల్-అక్టోబరు మధ్య పసిడి దిగుమతుల విలువ 17 శాతం తగ్గి 24 బిలియన్ డాలర్లకు చేరినట్లు కేంద్ర వాణిజ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే సమయంలో భారత్ 29 బిలియన్ డాలర్లు విలువ చేసే బంగారాన్ని దిగుమతి చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు
2023 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. గత నెల 16న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కైరోలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన భారత ప్రధాని మోదీ ఆహ్వానాన్ని ఈజిప్ట్ అధ్యక్షుడికి అందించారు. ‘ది అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్’ అధ్యక్షుడు తొలిసారి ముఖ్య అతిథిగా రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొననున్నారని విదేశాంగశాఖ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలతో చైనా సదస్సు..!
హిందూ మహాసముద్ర ప్రాంతంలోని 19 దేశాలతో చైనా గత వారం కీలక సదస్సు నిర్వహించింది. ‘‘షేర్డ్ డెవలప్‌మెంట్: థియరీ అండ్ ప్రాక్టీస్ ఫ్రం ది ప్రాస్పెక్టివ్ ఆఫ్ బ్లూ ఎకానమీ’’ పేరిట యునాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్‌లో దీనిని నిర్వహించింది. ది చైనా ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ కోపరేషన్ ఏజెన్సీ (సీఐడీసీఏ)ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి భారత్‌కు ఆహ్వానం అందలేదని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. సంజూ శాంసన్‌ను తీసుకోకపోవడానికి కారణమిదే: శిఖర్ ధావన్
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్ బుధవారం జరగనుంది. అయితే కీలకమైన రెండో వన్డేలో సంజూ శాంసన్‌ను భారత్ పక్కన పెట్టడంపై సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సంజూను తుది జట్టులో తీసుకోకపోవడంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శిఖర్ ధావన్ క్లారిటీ ఇచ్చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. హడలెత్తిస్తున్న షార్క్‌బోట్ మాల్‌వేర్.. ఆ యాప్‌లను తొలగించమన్న గూగుల్!
యూజర్ డేటా లక్ష్యంగా సైబర్‌నేరగాళ్లు మరో కొత్త మాల్‌వేర్‌ను యాప్‌ల ద్వారా ప్లేస్టోర్‌లోకి ప్రవేశపెట్టారు. బిట్‌డిఫెండర్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ మాల్‌వేర్ వివరాలను వెల్లడించింది. షార్క్‌బోట్ పేరుతో పిలిచే ఈ మాల్‌వేర్‌ను ఆరు యాప్‌ల ద్వారా ప్లేస్టోర్‌లోకి ప్రవేశపెట్టినట్లు బిట్‌డిఫెండర్ తెలిపింది. ఎక్స్-ఫైల్ మేనేజర్, ఫైల్‌వాయోజర్, ఫోన్‌ఏఐడీ, క్లీనర్, బూస్టర్ 2.6, లైట్ క్లీనర్ ఎమ్ అనే యాప్‌లలో ఈ మాల్‌వేర్ ఉన్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
UNO: స్వచ్ఛమైన తాగునీటికి దూరంగా 26 శాతం ప్రపంచ జనాభా
-
Crime News
vizag: విశాఖలో భవనం కూలిన ఘటన.. అన్నాచెల్లెలు మృతి
-
India News
నా భార్యను దోమలు కుడుతున్నాయ్.. పోలీసులకు యువకుడి ఫిర్యాదు
-
Politics News
MP Raghurama: అమరావతిపై మరోసారి అరాచకం: రఘురామ
-
Ap-top-news News
Andhra News: ఆంధ్రప్రదేశ్‌లో తుక్కు పాలసీ అమలు.. తొలుత ప్రభుత్వ శాఖల్లో!
-
World News
Antarctica: పశ్చిమ అంటార్కిటికాలో 3 లక్షల టన్నుల మంచు మాయం