Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 30 Jan 2023 17:03 IST

1. TS HighCourt: తొలగిన ప్రతిష్టంభన... గవర్నర్‌ ప్రసంగంతోనే బడ్జెట్‌ సమావేశాలు

రాష్ట్ర బడ్జెట్‌ ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. బడ్జెట్‌ను గవర్నర్‌ ఇప్పటి వరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ఇటు ప్రభుత్వ, అటు రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదులు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Rahul Gandhi: ‘ఆ సమయంలో కన్నీళ్లొచ్చాయి’.. గడ్డకట్టే మంచులోనూ రాహుల్ ప్రసంగం

గడ్డకట్టే చలిలో భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra) ముగింపు సభ జరిగింది. ఒకవైపు మంచు కురుస్తున్నా లెక్క చేయకుండా కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రసంగాన్ని కొనసాగించారు. ముగింపు సభలో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో లాల్‌చౌక్‌లో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. IND vs NZ: బ్యాటర్లకు ‘పిచ్‌’ ఎక్కించింది.. ‘సుడులు’ తిప్పిన బౌలర్లు

లఖ్‌నవూ పిచ్‌.. బ్యాటర్ల గుండెల్లో ‘సుడులు’ తిప్పేసింది. వంద పరుగుల లక్ష్యమే కదా.. టీ20ల్లో ఆడుతూ పాడుతూ ఛేదించేస్తారని అంతా అనుకొన్నారు. కానీ, బ్యాటర్ల సామర్థ్యానికి సవాల్‌ విసురుతూ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్‌లో విజయం భారత పక్షమైనా.. చిన్న లక్ష్యాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించిన న్యూజిలాండ్‌ పోరాటం కూడా ప్రశంసలు కురిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Philips: ఫిలిప్స్‌లో మళ్లీ కోతలు.. ఈసారి 6000 మంది తొలగింపు

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫిలిప్స్‌ (Philips) మరోసారి కోతల (Job Cuts)ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మరో 6 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైన స్లీప్‌ రెస్పిరేటర్స్‌లో లోపాల కారణంగా భారీ నష్టాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. కంపెనీ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగుల కోతల ప్రకటన వెలువడటం మూడు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
 
5. Pakistan: మసీదులో బాంబు పేలుడు..

పాకిస్థాన్‌(Pakistan)లో ముష్కరులు మరోసారి పేట్రేగిపోయారు. ఓ మసీదు లక్ష్యంగా బాంబు దాడికి పాల్పడాడు. పెషావర్‌(Peshawar)లోని ఓ మసీదులో సోమవారం భారీ బాంబు పేలుడు (Bomb blast) సంభవించింది. ఈ ఘటనలో 28మంది మృతిచెందగా.. సుమారు 150మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. పెషావర్‌లోని పోలీస్‌ లైన్స్‌ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం  మసీదులో ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Imran Khan: ఒకే ఒక్కడు.. ఏకంగా 33 స్థానాల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పోటీ

పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగబోయే జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన ఒక్కరే 33 స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం జరిగిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌ - ఇ- ఇన్సాఫ్‌ (పీటీఐ) కోర్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వైస్‌ ఛైర్మన్‌ షా మహ్మద్‌ ఖురేషీ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Budget 2023: డిజిటల్‌ రూపాయికి ఏమిస్తారు..?

డిజిటల్‌ కరెన్సీ దిశగా భారత్‌ ఇప్పుడే తొలి అడుగు వేసింది. గతేడాది సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ)ని దేశానికి పరిచయం చేసింది. దీనిని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం సీబీడీసీ హోల్‌సేల్‌, సీబీడీసీ-రిటైల్‌ కరెన్సీలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. వీటిపై రానున్న బడ్జెట్‌లో కేంద్రం మరింత స్పష్టతను తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్‌

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) భాజపాపై ఉన్న అసంతృప్తిని మరోసారి బయటపెట్టారు. భాజపాతో మళ్లీ కలిసి పనిచేసే అంశాన్ని తోసిపుచ్చిన ఆయన.. వారితో జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో తమ నుంచి కాషాయ పార్టీనే లాభపడిందన్న నీతీశ్‌.. వారికి దూరంగా ఉండే ఓ వర్గం ఓట్లతోనూ భాజపా ప్రయోజనం పొందిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

2023 మొదటి నెల సంక్రాంతి సినిమాల సందడితో ముగిసింది. చివరి వారంలో షారుఖ్‌ ‘పఠాన్‌’తో బాక్సాఫీస్‌ కళకళలాడింది. ఇక ఫిబ్రవరిలో కొత్త చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలా ఈ వారం అటు థియేటర్‌ ఇటు ఓటీటీలో వస్తున్న కొత్త చిత్రాలేవో చూసేద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. SKY: వాషింగ్టన్ సుందర్ విషయంలో నాదే తప్పు.. వైరల్‌గా మారిన సూర్య వ్యాఖ్యలు

ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-1తో సమంగా నిలిచింది. ఈ క్రమంలో జట్టును గెలిపించిన సూర్యకుమార్‌ యాదవ్‌ చేసిన కీలక వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ అతడేం చెప్పాడు.. ఎందుకు చెప్పాడో తెలియాలంటే.. దీనిపై ఓ లుక్కేయండి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని