Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11.01 నిమిషాలకు 15,497 మెగా వాట్ల విద్యుత్ (అత్యధిక పీక్ డిమాండ్) నమోదు అయ్యిందని వెల్లడించారు. మార్చి నెల ఆరంభం నుంచే 15,000 మెగా వాట్ల విద్యుత్ వినియోగం నమోదు అవుతూ వస్తోందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. తెలంగాణకు ఏమీ ఇవ్వని మోదీ మనకెందుకు: మంత్రి కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరో సారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ ప్రాధాన్యతలో తెలంగాణ లేదని.. అలాంటప్పుడు రాష్ట్ర ప్రజల ప్రాధాన్యతలో మాత్రం ప్రధాని మోదీ, భాజపా ఎందుకుండాలని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమీ ఇచ్చేది లేదని మోదీ సర్కారు తేల్చి చెప్పిందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. తమిళనాట ‘పెరుగు’ వివాదం.. పేరు మార్పుపై రగడ
హిందీ భాష విషయంలో కేంద్రంతో విభేదాలు కొనసాగుతున్న వేళ.. తమిళనాడు (Tamil Nadu)లో మరో వివాదం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ‘పెరుగు (Curd)’ పేరును మార్చడమే ఇందుక్కారణం. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఏంటీ టోల్ ట్యాక్స్.. ఎందుకు చెల్లించాలి!
రాష్ట్రంలోని రోడ్లను ఉపయోగించడానికి ప్రతి వాహనదారుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వాహనం బరువు, తయారైన సంవత్సరం, సీటింగ్ కెపాసిటీ, ఇంజిన్ రకాలను బట్టి ఈ ట్యాక్స్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఈ ట్యాక్స్ చెల్లించాం కదా అని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనంతో రౌండ్స్ కొట్టొచ్చని అనుకోవద్దు. ఎందుకంటే మళ్లీ ఆ రోడ్డుపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. అమెరికాలో భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
హెచ్1బీ వీసా (H1B Visa)తో అమెరికా (USA) పని చేస్తున్న విదేశీ సాంకేతిక నిపుణులకు, ఉద్యోగులకు అనుకూలంగా అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు ‘సేవ్ జాబ్స్ యూఎస్‌ఏ’ సంస్థ దాఖలు చేసిన దావాను యూఎస్ జిల్లా న్యాయమూర్తి తన్యా చుక్తాన్ కొట్టివేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్!
దేశంలో కరోనా(corona) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మరోసారి కలకలం రేగుతోంది. ఈ వైరస్‌బారిన పడిన వారి సంఖ్య ఇటీవలి కాలంలో రోజురోజుకీ పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే అమాంతం 40శాతం మేర కేసులు పెరిగి దేశవ్యాప్తంగా 3,016 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రాహుల్ గాంధీపై దావా వేస్తా: లలిత్ మోదీ
‘మోదీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఇలాంటి సమయంలో ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi).. రాహుల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో తనపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్నందుకు గానూ.. కాంగ్రెస్ నేతపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. చాలా కార్లు అమ్మేసిన విరాట్.. కారణం చెప్పేసిన స్టార్ బ్యాటర్
ఐపీఎల్ 16వ (IPL 2023) సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ కొత్త టాటూతో కనువిందు చేయనున్నాడు. మరోవైపు తనకు కార్లంటే విపరీతమైన ఇష్టమని, ఒకప్పుడు చాలా కార్లు తన గ్యారేజీలో ఉండేవని, అయితే వాటిలో కొన్నింటిని అమ్మేసినట్లు చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఆలయంలో మెట్లబావిలో పడిన భక్తులు.. 11 మంది మృతి
మధ్యప్రదేశ్‌లో శ్రీ రామనవమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలి.. అందులో భక్తులు పడిపోయారు. ఇందౌర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పటేల్ నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పైనున్న ఫ్లోరింగ్‌పై కూర్చున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. నిర్మలాజీ.. మీరు గ్రేట్.. ఆ పాప కోసం రూ. ఏడు లక్షలు వదిలేశారు!
కాంగ్రెస్ (congress) ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) ట్విటర్ వేదికగా ఒక గుడ్‌న్యూస్‌ను పంచుకున్నారు. అలాగే ఆ మంచికి కారణమైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman)కు కృతజ్ఞతలు తెలియజేశారు. అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఒక చిన్నారికి మంత్రి అందించిన తోడ్పాటే థరూర్ స్పందనకు కారణమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
భారీ వాహనాలను అనుమతించి..అవస్థలు పెంచారు!
-
Crime News
Cyber Crime: ఉచిత థాలీ ఎరలో దిల్లీ మహిళ
-
Ap-top-news News
Heat Waves: నేడు, రేపు వడగాడ్పులు!
-
India News
PM Modi: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
-
Crime News
పెళ్లింట మహావిషాదం.. ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ