Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 30 May 2023 20:57 IST

1. Hyderabad: ‘గ్యాంగ్’ ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి.. సికింద్రాబాద్‌లో భారీ చోరీ

ఐటీ అధికారులమంటూ సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెల్లర్స్‌లో పట్ట పగలు దోపిడీకి పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకన్న పోలీసులు వారి నుంచి ఏడు బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Chandrababu: వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు

వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలోకి రాగానే ప్రజా వేదిక కూల్చివేతకు ఆదేశాలు ఇస్తూ ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. సీఎంగా జగన్ ఇచ్చిన తొలి ఆదేశాలు, ప్రజా వేదిక కూల్చివేత దృశ్యాలు ఉన్న వీడియోను చంద్రబాబు తన ట్వీట్‌కు జత చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. China: రికార్డు స్థాయికి.. చైనా యువత నిరుద్యోగిత రేటు

తాము అనేక రంగాల్లో దూసుకుపోతున్నామని చైనా (China) చెబుతున్నప్పటికీ.. అక్కడ నిరుద్యోగం (Unemployment) క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా అక్కడి యువతలో గరిష్ఠ స్థాయి నిరుద్యోగిత రేటు నమోదయ్యింది. మునుపెన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌లో చైనా యువత నిరుద్యోగిత రేటు (Unemployment rate) 20.4 శాతంగా రికార్డయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Wrestlers Protest: మా పతకాలను నేడు గంగలో కలిపేస్తాం.. రెజ్లర్ల హెచ్చరిక

భారత రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఆందోళన (Wrestlers Protest) కొనసాగిస్తున్న రెజ్లర్లను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధం కాగా వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. దీక్ష కోసం ఇకపై జంతర్‌ మంతర్‌ వద్దకు అనుమతించబోమని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. RBI Annual Report: చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.500 నోట్లే అధికం!

చలామణిలో ఉన్న కరెన్సీ (Currency in circulation) నోట్ల విలువ 2022- 23లో 7.8 శాతం పెరిగిందని మంగళవారం వెలువడిన ఆర్‌బీఐ (RBI) వార్షిక నివేదిక వెల్లడించింది. నోట్ల సంఖ్య 4.4 శాతం పెరిగినట్లు తెలిపింది. చలామణిలో ఉన్న కరెన్సీ (Currency in circulation) నోట్ల విలువలో రూ.500, రూ.2,000 నోట్ల విలువే 87.9 శాతమని తెలిపింది. 2021- 22లో ఇది 87.1 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. CSK vs GT: సీఎస్‌కేను భయపెట్టిన చెన్నై కుర్రాడు.. గుజరాత్ జట్టులో ‘ఇంపాక్ట్‌’ అతడు!

ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ విజయం సాధించింది. ఐదోసారి కప్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఓడినప్పటికీ ఆ జట్టు పోరాటం మాత్రం అద్భుతం. మరీ ముఖ్యంగా బ్యాటింగ్‌లో యువ బ్యాటర్‌ ఆడిన తీరు ప్రశంసనీయం. టైటిల్‌ పోరంటేనే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. సీనియర్లే విఫలమవుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఓ యువ బ్యాటర్‌ అలవోకగా ఆడేసి చెన్నై సూపర్‌ కింగ్స్‌ గుండెల్లో కాస్త అలజడి సృష్టించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Telugu movies: చిరు మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ‘అఖండ’ నిర్మాతతో శ్రీకాంత్‌ అడ్డాల

అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) జోరుమీదున్నారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’ (Bholaa shankar). శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్ర బృందం పంచుకుంది. త్వరలోనే ‘భోళా మేనియా మొదలు కానుంది’ అంటూ చిరు స్టెప్‌ వేస్తున్న ఫొటోను షేర్‌ చేసింది. అంటే సినిమాకు సంబంధించిన ఏదైనా పాటలను విడుదల చేసే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Putin: పశ్చిమ దేశాలను కాదని.. పుతిన్‌కు అండగా దక్షిణాఫ్రికా..!

అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) నుంచి అరెస్ట్‌ వారెంట్‌ను ఎదుర్కొంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Russian President Vladimir Putin) విషయంలో దక్షిణాఫ్రికా(South Africa) కీలక నిర్ణయం తీసుకుంది. తన దేశంలో పుతిన్‌ను అరెస్టు చేయకుండా దౌత్యపరమైన రక్షణ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో పుతిన్‌తో పాటు ఆ దేశ ప్రతినిధులకు ఈ రక్షణ కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Dhoni and Jadeja: ధోనీతో నీ బంధం సూపర్‌ ‘సర్‌’..!

ధోనీ ఓ భావోద్వేగం.. ఇది ఐపీఎల్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో ఈ నెల 27వ తేదీన చేసిన ఓ పోస్టు సారాశం. నిజమే.. భారత క్రికెట్‌లో ప్రతిభను గుర్తించి చేరదీయడం.. అటగాళ్లను ప్రోత్సహించడంలో ధోనీ శైలే వేరు. కోహ్లీ, రోహిత్‌లు అతడి నీడన ఎదిగామని చెప్పేందుకు ఏమాత్రం సంకోచించరు. ఇక జడేజా అయితే తన కెరీర్‌ గురించి ఇటీవల చెబుతూ..‘‘నా క్రికెట్‌ ప్రయాణం ఇద్దరు మహేంద్రుల మధ్యలోనే జరిగింది’’ అని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. NTPC Jobs: ఇంకా 3 రోజులే గడువు.. ఎన్టీపీసీలో 300అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు అప్లై చేశారా?

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (NTPC) లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. వివిధ కేటగిరీల్లో 300 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఆపరేషన్స్‌/మెయింటీనెన్స్‌ E3 లెవెల్‌లో పనిచేసేందుకు అభ్యర్థులకు గత అనుభవం తప్పనిసరి. ఆసక్తికలిగిన అభ్యర్థులు జూన్‌ 2వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని