Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 30 May 2023 21:15 IST

1. Hyderabad: ఒక్క మిస్డ్‌ కాల్‌తో రెండు జీవితాలు బలి.. రాజేశ్‌ మృతి కేసులో కీలక ఆధారాలు

నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌లో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసుల దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. పెద్ద అంబర్‌పేట్‌ డాక్టర్స్‌ కాలనీ సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో యువకుడు రాజేశ్‌ మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్‌ చేయాలని నిర్ణయించింది. సిట్‌ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని కమిషన్‌ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు టీఎస్‌పీఎస్సీ నోటీసులు జారీ చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌: థియేటర్‌లో విడుదలైన రోజే కొత్త సినిమా ఇంట్లో చూసేయొచ్చు!

ఆంధ్రప్రదేశ్‌లోని సినీ అభిమానులకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌) సంస్థ శుభవార్త చెప్పింది. ఇకపై ఫైబర్‌ నెట్‌ సదుపాయం కలిగిన వారు ఇంట్లో కూర్చొనే కొత్త సినిమాలు చూసే వెసులుబాటు కల్పించనుంది. థియేటర్‌ తరహాలో ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ చూసే సదుపాయాన్ని తీసుకురానున్నట్లు సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..

సాధారంగా ఒక విమానం గాల్లోకి ఎగిరినప్పుడు అది చేసే శబ్దం 100 డెసిబెల్స్‌కుపైనే ఉంటుంది. ఇక రాకెట్‌ ప్రయోగించినప్పుడు అది చేసే శబ్దం గురించి చెప్పనక్కర్లేదు. అయితే.. ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటారా..? యంత్రాలు చేసే శబ్దాలు ఇవి. కానీ.. ఓ వ్యక్తి కోసం అతడి అభిమానులు చేసే హోరు కూడా ఇదే స్థాయిలో ఉంటే.. నమ్మశక్యంగా లేదు కదా. అయితే.. ఇది నిజం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. RBI Annual Report: ఆర్‌బీఐ నుంచి మరో పేమెంట్‌ సిస్టమ్‌!

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) ద్వారా డిజిటల్‌ చెల్లింలపుల వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఆర్‌బీఐ.. మరో చెల్లింపుల వ్యవస్థను తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. లైట్‌ వెయిట్‌ పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ (LPSS) సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. అయితే, ఇది రెగ్యులర్‌ పేమెంట్స్‌ విధానం కాదు. ప్రకృతి విపత్తులు, యుద్ధాలు వంటి అనుకోని పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈ చెల్లింపుల వ్యవస్థ ఉపయోగపడుతుందన్నది ఆర్‌బీఐ ఆలోచనగా ఉంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. Lokesh: రూ.లక్ష కోట్లున్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారు?: లోకేశ్‌

లక్ష కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనేదే తెదేపా లక్ష్యమన్నారు. నాలుగు రోజుల తర్వాత తిరిగి యువగళం పాదయాత్ర మొదలైంది. వైఎస్‌ఆర్‌ జిల్లాలో లోకేశ్‌ యాత్ర కొనసాగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Wrestlers protest: గంగా నది తీరంలో రోదనలు.. పతకాల నిమజ్జానికి బ్రేక్‌

భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనబాట పట్టిన రెజ్లర్లు (Wrestlers) తమ పతకాలను గంగానదిలో (Ganga River) కలిపేందుకు సిద్ధమయ్యారు. కానీ, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు తమ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు ప్రకటించారు. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకునేందుకు 5 రోజుల గడువు విధించారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. AI: మస్క్‌ ఆరోపణలు హాస్యాస్పదం.. ఏఐపై మెటా!

కృత్రిమ మేధ (AI)తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాట్‌జీపీటీలతో భవిష్యత్‌లో మానవాళి మనుగడకే ప్రమాదం తలెత్తవచ్చనే ఆందోళనతో వాటి అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని మస్క్‌ సహా పలువురు నిపుణులు ‘పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పేరిట ఓ లేఖ రాశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. Bengaluru: మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. ఎలాంటి షరతులుండవ్‌!: మంత్రి

కర్ణాటక(Karnataka)లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలను అమలు చేసే అంశంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఈ హామీలను నెరవేర్చేందుకు ఏటా దాదాపు రూ.50వేల కోట్లు ఖర్చవుతుండటంతో ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి(Ramalinga Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. Randeep Hooda: వీర్‌ సావర్కర్‌ పాత్ర కోసం నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గిన హీరో!

టామ్‌ క్రూజ్‌ నుంచి విక్రమ్‌ వరకూ సినిమానే సర్వస్వంగా బతికే ఎంతో మంది నటీనటులు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. సినిమా, అందులోని పాత్ర కోసం నిరంతరం కష్టపడతారు.. తమని తాము కష్టపెట్టుకుంటారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయారు బాలీవుడ్‌ నటుడు రణదీప్‌ హుడా. (Randeep Hooda) ఆయన కీలక పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న పీరియాడియకల్‌ యాక్షన్‌ డ్రామా ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’ (Swatantrya Veer Savarkar). శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు