Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 May 2023 17:13 IST

1. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలేవీ?: కేంద్రాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత

దిల్లీలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై రెజ్లర్లు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటా: నారా లోకేశ్‌

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా దేవగుడి క్యాంప్‌ సైట్‌ వద్ద చేనేత కార్మికులతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్‌ పాల్గొన్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌లో కంపెనీలు రాక ఉపాధి అవకాశాలు రావడం లేదని నేత కార్మికులు లోకేశ్‌కు విన్నవించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘మోదీ.. ది బాస్‌’ అంటే రాహుల్‌ జీర్ణించుకోవట్లేదు: భాజపా కౌంటర్‌

విదేశీ గడ్డపై చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై భారతీయ జనతా పార్టీ మరోసారి విరుచుకుపడింది. ప్రధాని మోదీ (PM modi)ని ప్రపంచ దేశాలు ‘బాస్‌’ అంటే.. రాహుల్‌ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని కాషాయ పార్టీ నేతలు  మండిపడ్డారు. విదేశాల్లో అడుగుపెట్టగానే ఆయనలో జిన్నా ఆత్మ చేరుతుందని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించకపోతే..: అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ హెచ్చరిక

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తోన్న ఆందోళనపై అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ స్పందించింది. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. అటుగా మార్చ్‌ చేపట్టిన రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాయుడు, జడేజాకు ట్రోఫీ.. అందరినీ ఆకట్టుకున్న అతడి చర్య..

ధోని తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. ఐపీఎల్‌-16 ట్రోఫీ అందుకునే సమయంలో అతడి చర్య అందరినీ ఆకట్టుకుంది. ట్రోఫీ తాను అందుకోకుండా ఆఖర్లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన జడేజా, ఆఖరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన రాయుడులను అందుకోవాలని కోరాడు. జడేజా, రాయుడు.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ నుంచి ట్రోఫీని స్వీకరించారు. ధోని.. బిన్నీ పక్కన నిలబడ్డాడు. తర్వాత అతడు జడేజా, రాయుడులతో పాటు ట్రోఫీని పట్టుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గిడ్డంగుల సామర్థ్యం పెంపునకు ₹లక్ష కోట్లు.. కేబినెట్‌ ఆమోదం

గిడ్డంగుల ఏర్పాటు విషయంలో కేంద్ర కేబినెట్‌ (Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వ కోసం గిడ్డంగుల సామర్థ్యాన్ని (grain storage capacity) పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సహకార రంగంలో పెద్ద ఎత్తున గోదాములను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 700 లక్షల టన్నుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ పథకం కింద రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆధారాల్లేవా..? పోలీసులు ఏం చెప్పారంటే..?

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని, ఆయన్ను అరెస్టు చేయాలని కొద్దికాలంగా రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని దిల్లీ పోలీసు విభాగం ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. కానీ, ఆ వెంటనే దిల్లీ పోలీసులు ఓ ట్వీట్‌ చేసి డిలీట్‌ చేయడం చర్చకు దారితీసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వుతున్న చైనా..!

భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వకాన్ని మంగళవారం నుంచి చైనా(china) శాస్త్రవేత్తలు మొదలుపెట్టారు. దీంతో చైనా భూగర్భాన్వేషణలో మరో ముందడుగు పడినట్లైంది. ఈ రంధ్రం సుమారు 10,000 మీటర్ల లోతు ఉండొచ్చని అంచనా. చైనాలోని షింజియాంగ్‌ (Xinjiang) ప్రాంతంలో ఈ తవ్వకాన్ని నిన్న మొదలుపెట్టారు. ఆ దేశం తవ్వుతున్న అత్యంత లోతైన రంధ్రంగా ఇది నిలవనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. రాహుల్‌ సభలో ఖలిస్థానీ మద్దతుదారుల హల్‌చల్‌..

కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అమెరికా సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా.. కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు హల్‌చల్‌ చేశారు. రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఒక్కో డాట్‌ బాల్‌కు 500 మొక్కలు.. మొత్తం ఎన్ని మొక్కలు నాటబోతున్నారంటే?

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ, మనలో చాలామంది పర్యావరణం గురించి పట్టించుకోవడం లేదు. పట్టణీకరణ పేరుతో ఇష్టం వచ్చినట్లు చెట్లు నరికేస్తున్నారు. ఈ పరిస్థితిలో కాస్తయిన మార్పు రావాలనే ఉద్దేశంతో బీసీసీఐ (BCCI) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ (Playoffs)​లో ఒక్కో డాట్​ బాల్​కు 500 చెట్లు నాటుతామని ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు