Updated : 06 Nov 2021 17:01 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.అప్పుడు పెట్రో ధరలు తగ్గిస్తానన్న జగన్‌ ఇప్పుడేం చెబుతారు?: చంద్రబాబు

అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని సీఎం జగన్‌ గతంలో చెప్పారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని.. ఏపీలో ఆ పరిస్థితి కనిపించలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కన్నా రాష్ట్రంలోనే అత్యధికంగా ధరలు ఉన్నాయని చెప్పారు. పెట్రో ధరలు ఎందుకు తగ్గించట్లేదని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేశారని తెలిపారు.

2.ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా మార్చే ఆలోచనలొద్దు: పయ్యావులు

ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా మార్చే ఆలోచనలు చేయొద్దని తెదేపా సీనియర్‌ నేత, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. కేంద్ర సౌర విద్యుత్‌ సంస్థ(సెకీ) అనేది నిరంతరం టెండర్లు పిలుస్తూనే ఉంటుందని ఎవరికి కావాలంటే వాళ్లు వెళ్లి టెండర్‌ వేసుకుంటారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదివేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక భారీ కుంభకోణం ఉందని ఆయన ఆరోపించారు.

3.రేపట్నుంచి నేనేంటో చూపిస్తా.. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి తానేంటో చూపిస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ తన ప్రాణమని తెలిపారు. ‘‘కామారెడ్డిలోని ఎల్లారెడ్డి నుంచి నా ఉద్యమం మొదలుపెడతా. రేపట్నుంచి నేనేంటో చూపిస్తా. కాంగ్రెస్‌ పార్టీ నా ప్రాణం. సోనియా గాంధీ దేవత’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

4.పెట్రో ధరలపై సరైన సమయంలో నిర్ణయం: ఏపీ మంత్రి
పెట్రో ధరలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ప్రజలకు మేలు చేకూర్చేలా మంచి నిర్ణయమే తీసుకుంటామని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు, పెట్రో ధరల భారాన్ని తగ్గించాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఎదురవుతోంది.

5.కాలుష్యంతో కరోనా మరణాలు పెరిగే అవకాశం: గులేరియా

వాయు కాలుష్యంతో కరోనా తీవ్రత అధికమవుతుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు. ‘‘కాలుష్యం కారణంగా ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తుల సమస్య తీవ్రం అవుతుంది. కరోనా సైతం ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో కాలుష్యం వల్ల కరోనా బాధితుల పరిస్థితి విషమించే అవకాశం ఉంది. కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయొచ్చు.

6.‘రివర్స్‌ గేర్‌లో మోదీ బండి.. పైగా బ్రేకులూ ఫెయిలయ్యాయి’

దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరనూ ఒక్కోదానిపై దాదాపు రూ.268 చొప్పున పెంచారు. మరోవైపు సామాన్యులు ఈ ధరలతో గగ్గోలు పెడుతున్నారు! ప్రతిపక్షాలూ మండిపడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైతం వంట గ్యాస్‌ ధరల భారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

7.ఇప్పుడు ఒత్తిడంతా అఫ్గాన్‌ - కివీస్‌లపైనే: గావస్కర్
టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రేసు రసవత్తరంగా మారింది. గ్రూప్‌-1 నుంచి ఇంగ్లాండ్‌.. గ్రూప్‌-2 నుంచి పాకిస్థాన్‌ ఇప్పటికే సెమీస్‌ చేరాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. నేటి మ్యాచ్‌లతో గ్రూప్‌-1 నుంచి ఏ జట్టు సెమీస్‌కు చేరుతుందో తెలిసిపోనుండగా.. ఆదివారం అఫ్గాన్‌ - న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో గ్రూప్‌-2 నుంచి ఏ జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుందో స్పష్టత రానుంది.

కివీస్‌పై అఫ్గాన్‌ గెలిస్తే.. సందేహాలు వ్యక్తమవుతాయి: అక్తర్‌

8.చైనా దూకుడు.. 3 రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాల ప్రయోగం

అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. శనివారం మరో మూడు రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. పశ్చిమ చైనాలోని సిచౌన్​ ప్రావిన్స్​, జిచాంగ్​ శాటిలైట్​ లాంచ్‌​ కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు చైనా వెల్లడించింది. యోగాన్​-35 విభాగానికి చెందిన ఈ మూడు ఉపగ్రహాలను లాంగ్​ మార్చ్​-2డీ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లినట్లు చైనా అధికారిక మీడియా పేర్కొంది.

9.‘మిస్సింగ్ బేబీ’ సోహైల్ ఎక్కడున్నాడో..?

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ, తాలిబన్ల ఆక్రమణతో ఆ దేశంలో వెలుగుచూసిన కల్లోల పరిస్థితులు ప్రపంచ దేశాల్ని కలవరపర్చాయి. తాలిబన్ల భయంతో అక్కడి విదేశీయులు, అఫ్గాన్ వాసులు దేశం దాటేందుకు చేసిన ప్రయత్నాలు ఎన్నో హృదయ విదారక దృశ్యాలను మిగిల్చాయి. ఆ సమయంలో తమకు దూరమైన నెలల కొడుకు కోసం ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

10.సియారా లియోన్‌లో ఘోర ప్రమాదం.. 91 మంది మృతి
పశ్చిమాఫ్రికాలోని సియారా లియోన్‌ రాజధాని రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఎక్కడ చూసినా మృతదేహాలే. కాలిపోయిన శరీర భాగాలే. ఆయిల్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో 91 మంది మృతిచెందినట్లు సమాచారం. సియారా లియోన్‌ రాజధాని ఫ్రీటౌన్‌లో కొద్ది గంటల క్రితం ఓ ఇంధన ట్యాంకర్‌ ప్రమాదానికి గురైంది. అయితే అందులోని ఇంధనం లీకవుతుండటంతో పలువురు అక్కడికి చేరి ఆ దాన్ని సేకరించే పనిలో పడ్డారు.

మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో తొక్కిసలాట.. ఎనిమిది మంది మృతి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని