Updated : 08/12/2021 16:58 IST

Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.కుప్పకూలిన బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. కోయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కలిసి 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

2.ఏనాడైనా జగన్‌ పథకాలను చంద్రబాబు మెచ్చుకున్నారా?: బొత్స

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తెదేపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సీఎం జగన్‌ ప్రతి కార్యక్రమాన్ని ఉద్యమ దీక్షతో చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. 

3.ఓటీఎస్‌ మంచి అవకాశం.. వాడుకోవాలా? వద్దా?వారిష్టం: జగన్‌
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, గృహ నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, సీఎస్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఓటీఎస్‌ పథకం పురోగతిపై వివరాలను అధికారులు సీఎంకు అందించారు. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు.

తిరుమలలో అద్దె గదుల కోసం భక్తుల అవస్థలు

4.భాజపాను గద్దె దించేది ‘ఎర్ర టోపీ’లే!

ఉత్తరప్రదేశ్‌లో భాజపాను గద్దె దించేది ‘ఎర్ర టోపీ’లేనని సమాజ్‌వాది పార్టీ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనన్న నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోదీ.. సమాజ్‌వాది పార్టీని టార్గెట్‌ చేసి విమర్శలు చేశారు. ఆ పార్టీ నేతలు ధరించే ఎర్ర టోపీలను అధికారుల కార్లపై ఉండే ఎర్రబుగ్గతో పోల్చిన ఆయన.. అధికార దర్పం ప్రదర్శించేందుకే సమాజ్‌వాదీ ఆరాటపడుతున్న విషయాన్ని తెలియజేస్తోందన్నారు.

5.తక్షణమే కేసులు ఎత్తేస్తాం.. ఉద్యమ రైతులకు కేంద్రం కొత్త ఆఫర్‌

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా ఆందోళన సాగిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని విరమించేలా కేంద్ర ప్రభుత్వం మరో ఆఫర్‌ ఇచ్చింది. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన పోలీసు కేసులను తక్షణమే ఎత్తేస్తామని తెలిపింది. ఈ మేరకు బుధవారం మరో ప్రతిపాదన పంపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

6.ఐసీఎంఆర్‌ కొత్త కొవిడ్‌ కిట్‌.. 30 నిమిషాల్లో ఫలితాలు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయంతో విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు అధికారులు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల చేయడానికి, ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతోంది. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ఫలితాలు త్వరగా వచ్చేలా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ విభాగం ఆర్‌టీ-లాంప్‌(RT-LAMP)కొవిడ్‌ కిట్‌ను ఆవిష్కరించింది.

7.రూ.4వేల కోట్ల పెట్టుబడితో 6 విద్యుత్తు కార్లు.. హ్యుందాయ్‌ భారీ ప్రణాళిక!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ భారత్‌లో మరిన్ని విద్యుత్తు వాహనాలను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం రాబోయే ఏడేళ్లలో రూ.4000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మొత్తం ఆరు మోడల్స్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

8.వాళ్లు అప్‌గ్రేడ్‌ అయ్యారు.. మనమూ అవ్వాలి: ఐఏఎఫ్‌ చీఫ్‌

పొరుగు దేశాలు పాకిస్థాన్‌.. చైనా నుంచి భారత్‌కు ముప్పు పొంచే ఉందని భారత వైమానిక దళం చీఫ్‌ వివేక్‌ రామ్‌ చౌధరి వెల్లడించారు. కశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌ వదిలిపెట్టే అవకాశాలు లేవని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు కశ్మీర్‌ వివాదాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని అన్నారు. భారత వ్యూహాత్మక లక్ష్యాలకు చైనా ఎప్పుడూ సవాల్‌గా నిలుస్తోందని తెలిపారు.

9.కాంగ్రెస్ యుద్ధంలో అలసిపోయింది..ఇప్పుడు టీఎంసీనే అసలైన కాంగ్రెస్..!

దిల్లీ వచ్చిన ప్రతిసారి సోనియాగాంధీని కలవాలా..? అసలు యూపీఏ ఎక్కడుంది..? అంటూ కాంగ్రెస్‌పై టీఎంసీ మొదలు పెట్టిన విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీ పత్రిక జాగో బంగ్లా ఈ తరహాలోనే స్పందించింది. కాంగ్రెస్ యుద్ధంలో అలసి పోయిందని, పార్లమెంట్‌లో ప్రధాన విపక్షం చేయాల్సిన పని చేయడం లేదని వ్యాఖ్యలు చేసింది. టీఎంసీనే.. అసలైన కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చింది.

10.ఆలియా భట్ ‘సీత’గా ఎలా మారిందో చూశారా?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ సీత పాత్రతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.  అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్స్‌ను విడుదల చేసింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని