Updated : 20 Jan 2022 16:59 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు: మంత్రిసురేశ్‌

నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. ఉన్నత విద్యలో కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు కోసం ఆన్‌లైన్‌ విధానం తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌ కోర్సులకు రానున్న కాలంలో మరింత డిమాండ్‌ ఉంటుందని వివరించారు.

2.రేపటి నుంచితెలంగాణ వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే: హరీశ్‌రావు

రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు దిశానిర్దేశం చేశారు.

TS news : ఉద్యోగుల పరస్పర బదిలీలకు రంగం సిద్ధం

3.పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలి: సోము వీర్రాజు

పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేసి, ఉద్యోగులను మళ్లీ చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. గురువారం  కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ....‘‘ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం పనిచేయలేదు. రాష్ట్రంలో ఇంటి అద్దె పెరిగిపోయి, హెచ్‌ఆర్‌ఏ తగ్గించడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

4.మార్కెట్లకు హ్యాట్రిక్‌ నష్టాలు.. 3 రోజుల్లో ₹6.5 లక్షల కోట్లు ఫట్‌!

దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలు చవిచూశాయి. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు ఇటీవల మార్కెట్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపడం మరో కారణం. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలు భారీగా నష్టపోయాయి.

5.పీజీ వైద్య సీట్ల భర్తీలో సుప్రీం కీలక తీర్పు

వైద్య విద్యలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌(పీజీ) సీట్ల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం కీలకమైన తీర్పునిచ్చింది. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన మైనార్టీ మెరిట్‌ జాబితా ప్రకారమే  సీఎంసీ వెల్లూరులో 2021-22 విద్యాసంవత్సర పీజీ వైద్య సీట్లను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌) మెరిట్‌ జాబితా ప్రకారమే ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లను భర్తీ చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్న తమిళనాడు ప్రభుత్వ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలతో  జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవయ్‌ల ధర్మాసనం  ఏకీభవించింది.

PRC : ఉపాధ్యాయ సంఘాల ఉద్యమం ఉద్ధృతం

6.మనోహర్‌ పారికర్‌ తనయుడికిభాజపాలో నిరాశ.. కేజ్రీవాల్‌ ఆఫర్‌!

గోవా మాజీ సీఎం దివంగత మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌కు భాజపాలో నిరాశ ఎదురైంది. మరికొద్ది వారాల్లో జరగబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన ఉత్పల్‌కు పార్టీ టికెట్‌ నిరాకరించింది. పాతికేళ్లుగా పారికర్‌ గెలుస్తూ రికార్టు సృష్టించిన పనాజీ స్థానాన్ని ఎమ్మెల్యే అటానాసియో బాబుష్‌ మాన్‌సెరేట్‌కు కేటాయించింది.

7.గాయని విపరీత చర్య.. ఉద్దేశపూర్వకంగా కొవిడ్ బారినపడి!

టీకా తీసుకున్నట్లు ఆధారం ఉన్నా, ఇటీవల కాలంలో కొవిడ్ సోకి తగ్గి ఉన్నా... బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చెక్ రిపబ్లిక్‌ అనుమతిస్తోంది. అలాగే ఈయూ సభ్య దేశాల్లో పర్యటించేందుకు, బార్లు, రెస్టారెంట్లకు వెళ్లేందుకు వీలు కల్పిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశానికి చెందిన ప్రముఖ జానపద గాయని హనా హోర్కా (57) ప్రాణాల పోయేలా చేసింది.

8.40 ఏళ్ల వ‌య‌సుకు కోటి రూపాయలు కూడబెట్టడం ఎలా..?

స్మార్ట్‌గా పెట్టుబ‌డులు పెడితే అధిక రాబ‌డి సాధించ‌వచ్చని అంటున్నారు నిపుణులు. ఉదాహ‌ర‌ణ‌కు మ్యూచువ‌ల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి (సిప్‌) ద్వారా మదుపుచేస్తే కాంపౌండింగ్ ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలంలో మంచి రాబడి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అందువ‌ల్ల మ‌దుప‌రులు సిప్ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్లలో దీర్ఘకాలం పాటు మ‌దుపు చేస్తారు.

9.ఫీల్డింగ్‌లో మార్పులు చేయాలి.. తెలివిగా దెబ్బకొట్టారు

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఓడిపోవడానికి ఫీల్డింగ్‌ కూడా ఒక కారణమేనని మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్ అన్నాడు. మైదానంలో ఫీల్డర్ల కూర్పును బట్టే బౌలర్లు బంతులేస్తారని.. అందుకే కెప్టెన్ ఆటగాళ్లను సరైన స్థానాల్లో ఉంచితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘భారత బౌలింగ్ విభాగం పేలవంగా ఏం లేదు. కొన్నిసార్లు బ్యాటర్లకు కూడా క్రెడిట్‌ ఇవ్వాల్సి వస్తుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.

10.వాట్సాప్‌ డెస్క్‌టాప్‌లో కొత్త ఫీచర్‌.. వాయిస్‌ మెసేజ్‌ పంపే ముందే వినొచ్చు!

వాట్సాప్‌లో అక్షరాలు టైప్‌ చేయకుండా మనం చెప్పాలనుకుంటున్న సమాచారం ఇతరులకు తెలియజేసేందుకు ఉన్న మరో ఆప్షన్‌ వాయిస్‌ మెసేజ్‌. గతేడాది చివర్లో వాట్సాప్‌ వాయిస్‌ మెసేజ్‌లో కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. వాటిలో కొన్ని ఫీచర్లను బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా వాయిస్‌ మెసేజ్‌ డెస్క్‌టాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. పాజ్‌-అండ్-రెస్యూమ్‌/ప్లే పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకురానుంది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని