Published : 26 Jan 2022 16:57 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.తెలంగాణలో డ్రగ్స్‌ అనే మాట వినిపించకూడదు: కేసీఆర్‌

రాష్ట్రంలో డ్రగ్స్‌ అనే మాట వినిపించకుండా కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలన్నారు. డ్రగ్స్‌ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. దోషులు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలన్నారు. దీని అమలు కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

2.తెరాస జిల్లా అధ్యక్షులను నియమించిన కేసీఆర్‌.. ఏ జిల్లాకు ఎవరంటే!

తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ జిల్లాలకు ఆ పార్టీ అధ్యక్షులను నియమించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల పేర్లను ఆయన ప్రకటించారు. సూర్యాపేటకు లింగయ్య యాదవ్‌, యాదాద్రి- కంచర్ల రామకృష్ణారెడ్డి, నల్గొండ- రవీంద్ర కుమార్‌, రంగారెడ్డి- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వికారాబాద్‌- మెతుకు ఆనంద్‌, మేడ్చల్‌- శంభీపూర్‌ రాజు, నాగర్‌ కర్నూల్‌- గువ్వల బాలరాజు, మహబూబ్‌నగర్‌- సి.లక్ష్మారెడ్డి, వనపర్తి- ఏర్పుల గట్టు యాదవ్‌, జోగులాంబ గద్వాల- బి. కృష్ణమోహన్‌రెడ్డి, నారాయణపేట- ఎస్‌. రాజేందర్‌రెడ్డిని నియమించారు.

Video: దేశవ్యాప్తంగా ఘనంగా 73వ గణతంత్ర వేడుకలు

పీఆర్సీ ఉద్యమం, చర్చలు ముగిసే వరకు తమకు పాత జీతాలే ఇవ్వాలని వారం క్రితమే ప్రభుత్వానికి చెప్పినట్లు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కానీ, ప్రభుత్వం కుట్రపూరితంగా కొత్త జీతాలని ఒకసారి, సీఎఫ్‌ఎంస్‌, హెచ్‌ఆర్‌ఎంస్‌ అని మరోసారి చెబుతూ గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల్లో అసహనం కలిగేలా చేసి ఉద్యమం దెబ్బతినేలా కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు.

4.అవి తప్పుడు ఆరోపణలు.. వారి పేర్లు త్వరలోనే బయటపెడతా: శ్రీనివాస్‌గౌడ్‌

హైకోర్టు డిస్మిస్‌ చేసిన కేసులో కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తన ఎన్నికల అఫిడవిట్‌ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోందంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడారు.

5.మోదీ సందేశంతో నిద్ర లేచా: గేల్‌: జాంటీ రోడ్స్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశంతో.. ఈ రోజు నిద్ర లేచినట్లు వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు క్రిస్‌ గేల్‌ పేర్కొన్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు అతడు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు గేల్‌ ఓ ట్వీట్ చేశాడు. ‘‘భారతదేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత ప్రజలతో నాకున్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన సందేశంతో ఈ రోజు నిద్ర లేచాను’’ అని క్రిస్ గేల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

6.గణతంత్ర వేడుకల్లో నారీశక్తి.. ‘సీమా భవాని’ విన్యాసాలు అదరహో..

దేశ రాజధాని దిల్లీలో 73వ గణతంత్ర సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో భాగంగా రాజ్‌పథ్ మార్గంలో పరేడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. పలు రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వశాఖల శకటాల ప్రదర్శన.. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. ఇక సరిహద్దు భద్రతా దళానికి చెందిన ‘సీమా భవాని మోటార్‌సైకిల్‌’ బృందం చేసిన విన్యాసాలు అదరహో అనిపించాయి.

Republic Day : చిన్నారుల నృత్యాలు.. ‘వావ్‌’ అనకుండా ఉండగలమా?

ఎప్పుడూ హుందాగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల ఓ విలేకరిపై నోరుపారేసుకొన్నారు. ఈ తతంగం జరిగే సమయంలో ఆయన మైక్‌ ఆన్‌లో ఉండటంతో అది అక్కడున్న వారందరికీ వినిపించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన జనవరి 24వ తేదీన శ్వేతసౌధంలో చోటు చేసుకొంది. వైట్‌హౌస్‌ ఈస్ట్‌రూమ్‌లో కాంపిటీషన్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.

8.మూడో డోసు తర్వాత నాలుగు నెలలు యాంటీబాడీలు..!

కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసు తీసుకొన్న వారిలో వైరస్‌ను అడ్డుకోగల యాంటీబాడీలు నాలుగు నెలలపాటు స్థిరంగా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకా బూస్టర్‌ డోసు తీసుకొన్న వారిపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ పరిశోధన ఫలితాలను ఇంకా పీర్‌ రివ్యూ చేయలేదు. ఇప్పటికైతే నాలుగో షాట్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం కనిపించడంలేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 

9.వారంలో రెండు కోట్ల మందికి కరోనా..!

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. గత వారం (జనవరి 17-23) ప్రపంచ వ్యాప్తంగా 21 మిలియన్ల( 2.1 కోట్లు)కు పైగా కొత్త కేసులొచ్చాయి. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల్లో ఐదు శాతం పెరుగుదల కనిపించింది. వారం వ్యవధిలో ఈ స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగుచూడటం.. మహమ్మారి ప్రారంభమైన దగ్గరి నుంచి ఇదే మొదటిసారి.

10.జియోఫోన్‌ 5G సిద్ధమవుతోంది... ఫీచర్లేంటో తెలుసా?

మొబైల్‌ ఫోన్‌ల విపణిలో మరో సంచలనానికి జియో (Jio) సిద్ధమవుతోంది. ఇప్పటికే జియో నెట్‌వర్క్‌, జియో ఫీచర్‌ ఫోన్‌, జియోఫోన్‌ నెక్స్ట్‌తో అదరగొట్టిన ముకేశ్‌ అంబానీ టీమ్‌... ఇప్పుడు 5జీ జియో ఫోన్‌ (JioPhone 5G) మీద  దృష్టి పెట్టిందని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ సెంట్రల్‌ వెబ్‌సైట్‌ ఈ మొబైల్‌కి సంబంధించి వివరాలు వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఈ మొబైల్‌ టాక్‌ ఆఫ్‌ ది టెక్‌ ఇండస్ట్రీగా మారింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని