Published : 16 Aug 2022 16:59 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Apple: యాపిల్‌ కీలక నిర్ణయం..!
ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొంతకాలంగా దిగ్గజ టెక్‌ కంపెనీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఖర్చు తగ్గింపులపై దృష్టిపెట్టాయి. నియామకాలను తగ్గించుకోవడంతో పాటు ఉద్యోగుల్లో కోత వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా టెక్‌ దిగ్గజం యాపిల్‌ కూడా ఇదే బాట పట్టింది. 100 మంది కాంట్రాక్టు రిక్రూటర్లను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది.

2. అమెరికా-రష్యా మధ్య అణు యుద్ధం జరిగితే..!
ఇంటర్నెట్‌డెస్క్‌: అత్యాధునిక అణు యుద్ధం సంభవిస్తే వాతావరణంలోకి చేరే ధూళి, ఉద్గారాల కారణంగా కరవు తలెత్తి కనీసం 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. రట్జర్స్‌ విశ్వవిద్యాలయంలోని ఓ బృందం అణు యుద్ధం జరిగేందుకు ఉన్న ఆరు అవకాశాలను విశ్లేషించింది. వీటిల్లో అమెరికా-రష్యా మధ్య జరిగే అణు యుద్ధం భూగోళంపై భయంకరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తేల్చింది.

3. రెండ్రోజుల్లో మూడు ఉగ్రదాడులు..!
ఇంటర్నెట్‌డెస్క్‌: స్వాతంత్య్రదినోత్సవం నాటి నుంచి కశ్మీర్‌లో ఉగ్రమూక మళ్లీ పేట్రేగిపోతోంది. కేవలం 48 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఓ హిందూ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందగా మరొ ముగ్గురు గాయపడ్డారు. నేడు దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలోని ఛోటేగావ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఇద్దరు సోదరులపై కాల్పులు జరిపారు.

Video : భాజపా కార్యాలయం ఎదుట నానో కారు కలకలం

4. SBI ఉచిత డోర్‌స్టెప్ సేవ‌లు.. వీరికి మాత్ర‌మే..!
ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొవిడ్ -19 స‌మ‌యంలో ఇంటి వ‌ద్ద (డోర్ స్టెప్‌) బ్యాకింగ్ సేవ‌లను ప్రారంభించింది. నేరుగా బ్యాంకుకు రాలేని వారి కోసం.. అంటే సీనియ‌ర్ సిటిజ‌న్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారి కోసం బ్యాంకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందుబాటులో ఉంచింది. తాజాగా దివ్యాంగులైన ఖాతాదారుల‌కు డోర్ స్టెప్ సేవ‌ల‌ను ఉచితంగా అందించాల‌ని నిర్ణయించింది.

5. నీతీశ్ వద్దే హోం.. మంత్రివర్గంలోకి తేజ్ ప్రతాప్
పట్నా: బిహార్‌లో జేడీ(యూ)తో కూడిన మహా కూటమి ప్రభుత్వ కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. కూటమిలో అత్యధిక సభ్యులు కలిగిఉన్న ఆర్జేడీకి 16 మంత్రి పదవులు దక్కాయి. నీతీశ్‌ పార్టీ నుంచి 11 మంది ప్రమాణ స్వీకారం చేయగా.. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్‌ మోర్చా నుంచి ఒకరు మంత్రివర్గంలో చేరారు. మొత్తంగా సుమారు 30 మంది మంత్రులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.

6. బిలియనీర్‌గా ఎదిగినప్పటికీ.. ఆ విషయంలో సిగ్గుపడాలన్నారు
దిల్లీ: భారత్‌లో దిగ్గజ ఇన్వెస్టర్‌గా పేరుగాంచిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. సాధారణ కుటుంబం నుంచి బిలియనీర్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించుకున్న బిలియనీర్‌గా ఎదిగినప్పటికీ.. ఒక విషయంలో మాత్రం సిగ్గుపడాలని తన తండ్రి చేసిన వ్యాఖ్యలను ఝున్‌ఝున్‌వాలా పలు వేదికలపై గుర్తుచేసుకున్నారు.

Video: అనుచరుడి అంతిమయాత్రలో పాడె మోసిన తుమ్మల

7. ICC: తొలిసారి మహిళా క్రికెట్‌ ఎఫ్‌టీపీ!
ఇంటర్నెట్ డెస్క్‌: తొలిసారి మహిళా క్రికెట్‌కు సంబంధించిన భవిష్యత్‌ పర్యటనల కార్యాచరణ (ఎఫ్‌టీపీ)ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. వచ్చే మూడేళ్లపాటు (2022-25) అన్ని ఫార్మాట్లలో ద్వైపాక్షిక సిరీస్‌లను నిర్వహించనుంది. ‘‘ఐసీసీ మహిళా ఛాంపియన్‌షిప్‌ (ఐడబ్ల్యూసీ) ఈవెంట్‌లో భాగంగా 10 టీమ్‌లు వన్డే సిరీస్‌లను ఆడతాయి. దీంతో భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం జట్లకు ఉంటుంది.

8. Viral Video: మాల్‌ మూసేస్తున్నారని, హడలెత్తి పారిపోయిన ప్రజలు..!
షాంఘై: చైనా అనుసరిస్తోన్న కొవిడ్ జీరో విధానంతో ఆ దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్క కేసు వచ్చినా.. వ్యాప్తిని కట్టడి చేసేందుకు డ్రాగన్ దేశం పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తోంది. ఎక్కడికక్కడ కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తోంది. ఇదే మాదిరిగా షాంఘైలోని గ్జుయిలోని ఐకియా స్టోర్‌ను అధికారులు లాక్‌ చేయడానికి ప్రయత్నించగా.. హడలెత్తిపోయిన ప్రజలు అక్కడి నుంచి పారిపోయారు. ఇంతకీ విషయం ఏంటంటే..?

9. అలా రాసి మమ్మల్ని బలి పశువులను చేయొద్దు: దిల్‌ రాజు భావోద్వేగం
హైదరాబాద్‌: టాలీవుడ్‌ నిర్మాతల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉందని, కొందరు వ్యూస్‌ కోసం అవాస్తవాలు రాస్తుంటారని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఊహాగానాలు వ్యాప్తి చేసి, చిత్ర పరిశ్రమ వారిని బలి పశువులను చేయొద్దని కోరారు. ‘కార్తికేయ 2’ సక్సెస్‌ మీట్‌లో ఆయన ఎమోషనల్‌గా మాట్లాడారు. సినిమాల విడుదల విషయంలో తనపై వచ్చిన వదంతులపై స్పందించారు.

10. 5 ఇంజిన్లు, 295 వ్యాగన్‌లు, 3.5 కి.మీల పొడవు.. ఈ రైలును చూశారా..?
ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ రైల్వే మరో ఘనతను సాధించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 3.5 కి.మీల పొడవైన గూడ్స్‌ రైలు ‘సూపర్‌ వాసుకి(Super Vasuki)’ని విజయవంతంగా పరీక్షించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్(Azadi ka Amrit Mahotsav)’లో భాగంగా ఆగ్నేయ మధ్య రైల్వే(SECR) జోన్‌ పరిధిలో.. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ నుంచి కోర్బా వరకు ఈ సరకు రవాణా రైలు ప్రయాణించింది.

Video: శ్రీలంకకు చేరుకున్న చైనా నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని