Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 05 Oct 2022 16:57 IST

1. BRS: తెరాస.. ఇకపై భారత్‌ రాష్ట్ర సమితి: తీర్మానంపై సంతకం చేసిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని  జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెరాస సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై తెరాస ‘భారత్‌ రాష్ట్ర సమితి’ (భారాస)గా మారనుంది. ఈ మేరకు పేరును మారుస్తూ తెరాస అధినేత ప్రతిపాదించిన ఏక వాక్య తీర్మానానికి సభ్యులు మద్దతు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Revanth Reddy: కుటుంబ తగాదాల పరిష్కారం కోసమే బీఆర్‌ఎస్‌ను తీసుకొచ్చారు: రేవంత్‌

భారత్‌ రాష్ట్ర సమితి పేరున జాతీయ పార్టీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని చంపేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్‌ వ్యవహారశైలి ఉందని ధ్వజమెత్తారు. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Ukraine: నా పెంపుడు పులులను రక్షించండి.. ఓ ఆంధ్రా వైద్యుడి విన్నపం

ఉక్రెయిన్‌పై (Ukraine Crisis) రష్యా మొదలుపెట్టిన యుద్ధం కారణంగా లక్షల మంది పౌరులు యుద్ధ క్షేత్రాన్ని వీడిపోయిన సంగతి తెలిసిందే. పుతిన్‌ సేనల భీకర దాడులతో వణికిపోయిన ఉక్రెయిన్‌ ప్రజలు.. ఇళ్లు, పెంపుడు జంతువులను వదిలి కట్టుబట్టలతో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇలా యుద్ధం కారణంగా అక్కడ నుంచి పొరుగు దేశానికి వెళ్లిపోయిన ఓ ఆంధ్రా డాక్టర్‌.. తన పెంపుడు పులులను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. jasprit bumrah: బుమ్రా స్థానంలో షమీ?.. క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్‌

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా జట్టుకు దూరం కావడం అభిమానుల్లో కలవరం రేపుతోంది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచింది. దీంతో జట్టులో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి విషయం తెరపైకి వచ్చింది. బీసీసీఐ ఇంకా దీనిపై స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలో పేసర్‌ మహమ్మద్‌ షమీని అతడి స్థానంలో ఆడిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

రసాయన శాస్త్రంలో (Chemistry) విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి (Nobel Prize 2022) లభించింది. క్లిక్‌ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు కరోలిన్‌ ఆర్‌ బెర్టోజీ, మార్టెన్‌ మెల్డల్‌, కే బ్యారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Melinda Gates: ఆ విడాకులతో అంతులేని వేదన అనుభవించా..!

దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడాకులు తీసుకున్నారు బిల్‌గేట్స్‌ - మెలిందా దంపతులు. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవడం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌ కోసం కలిసి పనిచేస్తామని వారు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Allu Aravind: చిరంజీవి ఫ్యామిలీతో డిస్ట్రబెన్స్‌.. అల్లు అరవింద్‌ ఏం చెప్పారో?

చిరంజీవి - అల్లు అరవింద్‌ కుటుంబాల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సమాధానం ఈ నెల 10న ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’లో తెలిసే అవకాశం ఉంది. ప్రతి వారం సెలబ్రిటీతో ఇంటర్వ్యూ చేసే అలీ.. ఈసారి అల్లు అరవింద్‌ను తీసుకొచ్చారు. అందులో అల్లు రామలింగయ్య గురించి, అర్హ గురించి అరవింద్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ ప్రోమో ఇదీ..

8. The Ghost Review: రివ్యూ: ది ఘోస్ట్‌

ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లైన సినిమాల్లో కీల‌క‌మైనది ‘ది ఘోస్ట్‌’.  కొత్త ర‌క‌మైన క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేయ‌డానికి ఇష్ట‌ప‌డే నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టించ‌డం...  ‘గ‌రుడ వేగ’తో యాక్షన్‌ సినిమాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ప్రవీణ్‌ స‌త్తారు దర్శకుడు కావ‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. ప్రచార చిత్రాలు అంచ‌నాల్ని మ‌రింత‌గా పెంచాయి. నాగార్జున చేసిన ఈ స్టైలిష్ యాక్షన్‌ చిత్రం ఎలా ఉంది? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Recession: ఏడాదిలో ఆర్థికమాంద్యం.. మెజారిటీ CEOల అభిప్రాయం ఇదే!

వచ్చే 12 నెలల్లో ఆర్థిక మాంద్యం రానుందని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 86 శాతం మంది సీఈఓలు విశ్వసిస్తున్నట్లు ఓ ప్రముఖ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త నియామకాలను నిలిపివేశాయి. మరికొన్ని సంస్థలు రాబోయే ఆరు నెలల్లో తమ సిబ్బందిని సగానికి తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. ఈ విషయాలు కేపీఎంజీ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రావణుడిని పూజించే గ్రామం ఎక్కడ ఉందో తెలుసా...!

చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశమంతటా ఏటా దసరా పండగ జరుపుకొంటూ ఉంటారు. విజయ దశమి రోజున సాయంత్రం ప్రజలంతా రావణ దహనం చేసి ఆనందిస్తారు. ఇది దేశంలో ఉన్న సంప్రదాయం. కానీ ఒక్కచోట మాత్రం రావణ దహన కార్యక్రమం నిర్వహించరు. అంతేకాదు రావణుడిని దేవుడిగా పూజిస్తారు. ఇంతకీ ఎక్కడ? అక్కడి ప్రజలెందుకు అలా చేస్తారో తెలుసుకోవాలంటే మహారాష్ట్ర వెళ్లాల్సిందే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని