Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు

Published : 06 Oct 2022 17:02 IST

1.  భారత్‌ జోడో యాత్రలో కదం కలిపిన సోనియా.. రాహుల్‌తో కలిసి నడక..!

కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. గురువారం ఉదయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని జకన్నహళ్లికి చేరుకొన్నారు. పాండవపుర తాలుకాలో ఉదయం 6.30కు మొదలైన యాత్ర అక్కడకు చేరుకోగానే.. ఆమె కూడా వారితో కలిసి నడిచారు. ఈ యాత్ర సాయంత్రం 7 గంటలకు నాగమంగళ తాలుకాలో నేడు విరామం తీసుకోనుంది. సోనియాతోపాటు ఈ యాత్రలో స్థానిక మహిళా ఎమ్మెల్యేలు అంజలీ నంబాల్కర్‌, రూపకళా, లక్ష్మీ హెబ్బాల్కర్‌లు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  థాయిలాండ్‌లో ప్రీస్కూల్‌ వద్ద కాల్పులు: కనీసం 32 మంది మృతి

థాయిలాండ్‌లోని ఓ ప్రీస్కూల్‌ వద్ద ఘోరం చోటు చేసుకొంది. ఓ దుండగుడు ప్రీస్కూల్‌ వద్ద కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం 32 మంది మరణించినట్లు స్థానిక వార్తాపత్రికలు పేర్కొంటున్నాయి. మృతుల్లో అత్యధిక మంది చిన్నపిల్లలే.  ఈ ఘటన దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న నాక్లాంగ్‌ జిల్లాలోని నాంగ్‌బు నాలంఫూ ప్రావిన్స్‌లో చోటు చేసుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Chiranjeevi: ‘అలయ్‌ బలయ్‌’ దేశవ్యాప్తంగా జరగాలి: చిరంజీవి

తెలంగాణ సంస్కృతిలో ‘అలయ్‌ బలయ్‌’ భాగంగా ఉందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమానికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని.. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తమ ఇంటికి వచ్చి ఆహ్వానించారని చెప్పారు. గతంలో పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌కు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు!

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అక్టోబర్‌ 4 వరకు సాధారణంగా ఉన్న రద్దీ.. అక్టోబర్‌ 5 నుంచి క్రమంగా పెరిగింది. పెరటాసి మాసం, రెండో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో రద్దీ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ఆదిపురుష్‌’ ట్రోలింగ్‌.. అది తప్పయితే వాళ్లే అనుభవిస్తారు: రాంగోపాల్‌ వర్మ

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్‌’. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దీన్ని రూపొందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్‌.. ప్రస్తుతం నెటిజన్లు, రాజకీయ నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలోని నటీనటుల లుక్స్‌పై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్‌’ టీజర్‌, విమర్శలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Whatsapp బ్యాంకింగ్‌ సేవలు కావాలా.. అన్ని బ్యాంకుల వివరాలివిగో!

సాంకేతికత అభివృద్ధి చెందడంతో బ్యాంకులు పలు సేవలను డిజిటల్‌ విధానంలో అందిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా తమ సర్వీసులను మరింత విస్తరించే దిశగా ముందుకెళ్తున్నాయి. దీనిలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరువైన వాట్సాప్‌ ద్వారా కూడా పలు సేవలను అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ సేవ‌ల‌ను పొందాలంటే ఆయా బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు ఏ విధంగా రిజిస్ట‌ర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. CM Jagan: ఈ ఏడాది వసూళ్లు భేష్‌.. సీఎం జగన్‌కు వివరించిన అధికారులు

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 94.47శాతం లక్ష్యం చేరుకున్నట్టు వెల్లడించారు. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధికంగా జీఎస్టీ వసూళ్లు ఉన్నాయన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. Rakheem Cornwall: టీ20ల్లో తొలి 200 కొట్టిన విండీస్‌ బాహుబలి

టీ20ల్లో అర్ధశతకం చేస్తే గొప్ప.. ఇక సెంచరీ మార్క్‌ను తాకితే అద్భుతం.. ఇలాంటి పొట్టి ఫార్మాట్‌లో ఏకంగా ఓ బ్యాటర్‌ డబుల్‌ సెంచరీ బాదేశాడు. మొత్తం 120 బంతులు ఉండే మ్యాచ్‌లో అతడే 77 బంతులను ఆడి 205 పరుగులు సాధించడం గమనార్హం. ఇంతకీ ఆ వీరభయంకర ప్లేయర్ ఎవరంటారా...? వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రకీం కార్నెల్.. ఇలా పేరు చెబితే పెద్దగా ఎవరికీ తెలియదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Karnataka: ఏనుగు కోసం రాహుల్ వినతి.. ఓకే అన్న బొమ్మై!

కర్ణాటకలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప్పూనిప్పూలా ఉండే భాజపా, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఓ ఏనుగు విషయంలో రాజకీయాలను పక్కన పెట్టారు. గాయపడిన ఏనుగుకు వైద్యం అందించాలని సీఎం బసవరాజ్‌ బొమ్మైని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ సాయం కోరగా.. అందుకు సీఎం బసవరాజ్‌ బొమ్మై సానుకూలంగా స్పందించారు. కర్ణాటకలో ‘భారత్‌ జోడో యాత్ర’ సందర్భంగా ఇరు పార్టీ నేతలూ కత్తులు దూసుకుంటున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Hyderabad: జంటనగరాల్లో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం

జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి జనజీవనం  స్తంభించింది. నగరంలోని చందానగర్‌, మల్కాజిగిరి, కీసర, పంజాగుట్ట, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, బాగ్‌లింగంపల్లి, బోలక్‌పూర్‌, కవాడిగూడ, జవహర్‌నగర్‌, రాంనగర్‌... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని